వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

మనం రోజూ యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో చాలా వింతగా ఉన్న మరియు ఆసక్తికరమైన ఎన్నో వీడియోలో చూస్తూ ఉంటాము. ఇటువంటి వీడియోలు రికార్డ్ చేయబడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబడతాయి. ఇలాంటి కోవకు చెందిన అలాంటి ఒక వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది.

వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

ఈ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో చూడటానికి కొంత భయానకంగా ఉంటుంది. భయంకరమైన ఈ వీడియోని సంఘటన అల్బేనియా రాజధానిలో జరిగినట్లు తెలిసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి డ్రైవింగ్ లో ఉన్న ఒక కారులోకి జంప్ చేయడం చూడవచ్చు. ఆ వ్యక్తి కారులోకి జంప్ చేసి కారుని కంట్రోల్ చేసాడు.

వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

ఈ వీడియోలో సిల్వర్ కలర్ హ్యాచ్‌బ్యాక్ ను చూడవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ అకస్మాత్తుగా నగరంలోని స్కాండేబగ్ స్క్వేర్‌లోకి ప్రవేశించింది. ఇక్కడ దేశ సాధారణ ఎన్నికలపై నివేదించడానికి డజన్ల కొద్దీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వీడియోలో సిల్వర్ కలర్ కారు గుండ్రంగా తిరగటం చూడవచ్చు.

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

కదులుతున్న కారుని ఆపడానికి చాలామంది ప్రయత్నించడం కూడా ఇక్కడ గమమనించవచ్చు. ఈ కారు చక్రాలు కొంత వంకరగా మారిపోయాయని, అదే సమయంలో దాని బోనెట్ కూడా విరిగిపోయిందని తెలుస్తోంది. స్కాండర్‌బెగ్ స్క్వేర్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందే ఈ కారుతో ప్రమాదం జరిగిందని ఊహించవచ్చు.

వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

వాహనం యొక్క డ్రైవర్ పూర్తి గందరగోళానికి గురయ్యాడు. ఇంత ప్రమాద వాతావరణానికి కారణమైన ఈ కారు నుంచి తప్పించుకుని బయటపడటానికి పాదాచారులు పరుగులుపెడుతున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది కారు యొక్క డోర్స్ ఓపెన్ చేసి కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అది సాధ్యం కాలేదు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

కారులోపల ఉన్న డ్రైవర్ యాక్సిలరేటర్‌ ను గట్టిగా నొక్కి కారుని గుండ్రంగా తిప్పుతూ ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తుకు వచ్చి కారు కిటికీ గుండా కారు లోపలికి దూకుతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి కారు ఆపుతాడు.

వేగంగా కదులుతున్న కారులోకి జంప్ చేసిన వ్యక్తి [వీడియో]

నివేదికల ప్రకారం ఈ కారు యొక్క 32 ఏళ్ల డ్రైవర్‌ను అల్బేనియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే కారు డ్రైవర్ డ్రగ్స్ తీసుకుని కారు నడుపుతున్నట్లు తెలిసింది. స్కాండేబగ్ స్క్వేర్‌లోకి ప్రవేశించే ముందు డ్రైవర్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో మూడు కార్లను ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ సంఘటనను బట్టి జన సమూహాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఒక ఉగ్రవాది ఈ విధంగా చేసాడని తెలిసింది.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

Most Read Articles

English summary
Man Jumps Through Window To Stop A Out Of Control Car. Read in Telugu.
Story first published: Saturday, May 1, 2021, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X