పిల్లాడు చేసిన చిన్న తప్పు ఎంత ప్రమాదానికి దారి తీసిందో మరి.. వీడియో చూడండి
ప్రస్తుతం భారతదేశంలో వాహన వినియోగం చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి ఇంటికి కనీసం ఒక టూ వీలర్ ఉంటుంది. అయితే వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
నివేదికల ప్రకారం, ఒక స్కూటర్ వినియోగదారుడు ఒక చోట తన స్కూటర్ నిలిపి ఉంచి దాని మీదనే నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అతని ముందర ఒక పిల్లవాడు ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ స్కూటర్ ని ఆఫ్ చేయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్కూటర్ మీద నిలబడి ఉన్న పిల్లవాడు అనుకోకుండా యాక్సిలరేటర్ తిప్పేస్తాడు.

పిల్లవాడు స్కూటర్ యాక్సిలరేటర్ తిప్పగానే స్కూటర్ ముందుకు వెళుతుంది. ఆ సమయంలో స్కూటర్ మీద నిలబడి మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి సరైన పట్టు లేకపోవడం వల్ల అదే సమయంలో స్కూటర్ ముందుకు వెళ్లడం వల్ల వెంటనే కిందికి వెల్లకిలా పడిపోయాడు. ఆ పిల్లవాడు కూడా కిందికి పడిపోయే సంఘటనలు అన్నీ వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆ స్కూటర్ మీద ఉన్న వ్యక్తి కిందికి పడగానే పక్కనే ఉన్న కొంతమంది అతన్ని పైకి లేకి పక్కన కూర్చోబెట్టడం కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో న్యూస్ 18 ఇండియా స్పెషల్ కరస్పాండెంట్ వివేక్ గుప్తా షేర్ చేశారు. ఈ వీడియోలో స్పష్టంగా గమనించినట్లయితే ఆ వ్యక్తి తల వెనుక భాగంలో ఎక్కువ దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది, కానీ ఆ పిల్లవానికి ఎటువంటి దెబ్బలు తగలలేదు.
जब बच्चा स्कूटी पर हो तो, स्कूटी को रोकने के बाद उसका इंजन जरूर बंद करे..
— Vivek Gupta (@imvivekgupta) December 19, 2022
नही तो यह घटना आपके साथ भी हो सकती है.
महाराष्ट्र के सिंददुर्घ की घटना..@News18India pic.twitter.com/VYrNeRnynQ
వాహనాల మీద ప్రయాణించేటప్పుడే కాదు, వాహనాలను నిలిపివుంచినప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ వ్యక్తి స్కూటర్ నిలిపి ఉంచినప్పుడు, స్కూటర్ ఆన్ లో లేకుండా ఉండేటట్లు చూసుకుని ఉండాలి. అలా కాకపోతే ఈ పిల్లవాడు ముందు లేకుండా అయినా జాగ్రత్తపడి ఉండాలి. ఈ రెండూ చేయకుండా అతడు స్కూటర్ స్టార్ట్ లోనే ఉంచి ఫోన్ లో మాట్లాడుతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అనే చిన్న జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూడగానే ఒకింద భయం కలుగుతుంది. ఈ వీడియో తప్పకుండా చాలామందికి గుణపాఠం అవుతుంది. చాలామంది తమ నిత్యజీవితంలో ఇలా ఏదో ఒకసారి చేయి ఉండవచ్చు. మనిషి చేసే ప్రతి చిన్న నిర్లక్ష్యం చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. కావున ఈ విధంగా ఏ ఒక్కరూ చేయకూడదు.
ఇదిలా ఉండగా.. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి కూర్చున్న వ్యక్తిగానీ, అతని ముందు వున్న పిల్లవాడు కానీ హెల్మెట్ ధరించలేదు. ఒక వేళా హెల్మెట్ ధరించి ఉంటే ఆ వ్యక్తి తలకు పెద్దగా దెబ్బ తగిలే అవకాశం ఉండేది కాదు. హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడమే అవుతుంది. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2021 లో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం తప్పకుండా ద్విచక్ర వాహనం మీద ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలి.
అంతే కాకుండా కారులో ప్రయాణించేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి. ఇది ప్రమాదాల్లో వాహనదారులను ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సీట్ బెల్ట్ ధరించకుండా పట్టుబడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని కార్లలో తప్పకుండా ఆరు ఎయిర్ బ్యాగులను అమర్చాలి అనే నిబంధనను కూడా తీసుకువచ్చింది. ఈ నియమం త్వరలోనే దేశం మొత్తం మీద అమలులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications








