మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే మనదేశంలో కోన్ని నగరాలలో పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన క్రికెటర్ కి అవార్డుగా 5 లీటర్ల పెట్రోల్‌ బహుమతిగా ఇచ్చారు. ఈ మ్యాచ్ గత ఆదివారం జరిగినట్లు తెలిసింది. సలావుద్దీన్ అబ్బాసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు కార్ లేదా బైక్ వంటివి ఇవ్వడం తెలుసు, కానీ ఇక్కడ దానికి భిన్నంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అతనికి 5 లీటర్ల పెట్రోల్ ఇచ్చారు. భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను ఎత్తిచూపడానికి మరియు పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ కార్లకు రూ. 6.75 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కార్.. ఈ కార్లు వారికి మాత్రమే

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

భారతదేశంలో ఇలాంటి వింత సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, బంధువులు మరియు స్నేహితులు పెళ్లిళ్లలో కొత్త జంటకు పెట్రోల్ బహుమతిగా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు చూడటానికి సరదాగా ఉన్నప్పటికీ, వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్ ధరల గురించి చాలా అవస్థలు పడుతున్నారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ మరియు సిఎన్జి వాహనాలను కొనుగోలుచేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తున్నారు.

MOST READ:సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు వివిధ రకాల తగ్గింపులను కూడా అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వెంటనే కొనుగోలు చేయలేని వారు ప్రస్తుతం ఉన్న వాహనం యొక్క మైలేజీని పెంచే పనిలో ఉన్నారు. కొన్ని నగరాల్లో గ్యారేజీలు ఎక్కువ బిజీగా ఉండటానికి ఇది దారితీసింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

ప్రస్తుతం మైలేజ్ ఎక్కువ అందించే బైకులను కొనడాటానికి కూడా ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. కావున అధిక మైలేజ్ ఇచ్చే వాహన అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల శీతాకాలం ముగిసే నాటికి ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది.

MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

ఏది ఏమైనా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపాలిట శాపంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాలు ఉన్నాయి. ఈ విధమైన ధరల పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కావున ప్రభుత్వం కూడా దీనిపై తగైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

Most Read Articles

English summary
Man Of The Match Receives 5 Liter Petrol As Prize. Read in Telugu.
Story first published: Friday, March 5, 2021, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X