Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే మనదేశంలో కోన్ని నగరాలలో పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన క్రికెటర్ కి అవార్డుగా 5 లీటర్ల పెట్రోల్ బహుమతిగా ఇచ్చారు. ఈ మ్యాచ్ గత ఆదివారం జరిగినట్లు తెలిసింది. సలావుద్దీన్ అబ్బాసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు కార్ లేదా బైక్ వంటివి ఇవ్వడం తెలుసు, కానీ ఇక్కడ దానికి భిన్నంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అతనికి 5 లీటర్ల పెట్రోల్ ఇచ్చారు. భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను ఎత్తిచూపడానికి మరియు పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది.

భారతదేశంలో ఇలాంటి వింత సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, బంధువులు మరియు స్నేహితులు పెళ్లిళ్లలో కొత్త జంటకు పెట్రోల్ బహుమతిగా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు చూడటానికి సరదాగా ఉన్నప్పటికీ, వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్ ధరల గురించి చాలా అవస్థలు పడుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ మరియు సిఎన్జి వాహనాలను కొనుగోలుచేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తున్నారు.
MOST READ:సర్ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు వివిధ రకాల తగ్గింపులను కూడా అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వెంటనే కొనుగోలు చేయలేని వారు ప్రస్తుతం ఉన్న వాహనం యొక్క మైలేజీని పెంచే పనిలో ఉన్నారు. కొన్ని నగరాల్లో గ్యారేజీలు ఎక్కువ బిజీగా ఉండటానికి ఇది దారితీసింది.

ప్రస్తుతం మైలేజ్ ఎక్కువ అందించే బైకులను కొనడాటానికి కూడా ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. కావున అధిక మైలేజ్ ఇచ్చే వాహన అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల శీతాకాలం ముగిసే నాటికి ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

ఏది ఏమైనా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపాలిట శాపంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాలు ఉన్నాయి. ఈ విధమైన ధరల పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కావున ప్రభుత్వం కూడా దీనిపై తగైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.