మీరే చెప్పండి.. పెట్రోల్ బంకులో ఇలా చేయడం కరెక్టేనా?.. పోలీసులు సరిగ్గా బుద్ది చెప్పారు కదా!

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సోషల్ మీడియా ప్రజల జీవన విధానంలో ఓ అంతర్భాగమైంది. కాలక్షేపానికి కొందరు సోషల్ మీడియాలో కాలం గడిపితే.. పాపులర్ అవ్వడానికి మరికొందరు నియమాలను ఉల్లంఘించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దెబ్బకు పోలీసులు దానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? పోలీసులు కారకులపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఒక వ్యక్తి తన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) కారుకు పెట్రోల్ బంకులో ఫ్యూయెల్ నింపుకుంటున్నాడు. అయితే కారు యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ ఫుల్ అయిపోయినప్పటికీ.. పంపు ఆఫ్ చేయకుండా ఇంకా ఫిల్ చేస్తూనే ఉన్నాడు. అతడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలా చేసి ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Man Overfills To Mahindra Scorpio N

మహీంద్రా కారుకు ఫ్యూయెల్ నింపుకున్న తరువాత కారులో రోడ్డు మీద వెళ్తున్న సమయంలో సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉండటం కనిపిస్తుంది. పబ్లిక్ రోడ్డుపై ఇలా చేయడం నేరం, అంతేకాదు ప్రమాదం కూడా. ఆదమరిస్తే ప్రాణాలే పోయే అవకాశం ఉంది. ఈ వీడియోను నిశాంత్ శర్మ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత రాజస్థాన్ పోలీసులు దీనికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మీద సమగ్రమైన విచారణ జరిపిన తరువాత పోలీసులు తదుపరి చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవ్వాలనే ఆలోచన ఇబ్బందుల్లోకి నెట్టింది.

Man Overfills To Mahindra Scorpio N

వీడియో గమనిస్తే.. కారు ఫ్యూయెల్ ట్యాంక్ ఫుల్ అయినప్పటికీ ఆ వ్యక్తి పెట్రోల్ పంపు ఆఫ్ చేయకుండా.. ఇంకా ఫిల్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఫ్యూయెల్ బయటకు వచ్చే సమయంలో ఏదైనా చిన్న నిప్పురవ్వ తాకినా అక్కడ ఊహకందని ప్రమాదం సంభవించేది. ఆలా జరిగి ఉంటే పెట్రోల్ బంకు, అక్కడున్న జనాభా కూడా ప్రమాదంలో చిక్కుకునేవారు.

నిజానికి ఇలాంటి తరహా సంఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఓ వృద్ధుడు పెట్రోల్ పంపు దగ్గర తన టాటా హారియర్ కారుకు ఫ్యూయెల్ నింపుకోవడానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అది కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జరిగినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి కొంతమందిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఆ ఇబ్బందులకు అమాయక ప్రజలు కూడా బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలనుకునే వారు దయచేసి ఆలోచించాలి. పోలీసులు కూడా అలాంటి వారిమీద మరింతబు కఠినంగా వ్యవరిస్తూ.. మరింత భారీ జరిమానాలు విధించాలి. అప్పుడే అలాంటి వారు దారికి వస్తారు, అనుకోని ప్రమాదాలు తగ్గుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2024, 17:01 [IST]
English summary
Man overfills to mahindra scorpio n for instagram reel cops seize car
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+