ఖరీదైన హెలికాఫ్టర్, 120 లగ్జరీ కార్లను కలిగిన గుట్కా, పాన్ మసాలా బిజినెస్‌మేన్

Written By:

ఓ మారుమూల ప్రదేశం నుండి వచ్చిన సంజయ్ గోడావత్, దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. గుట్కా పాకెట్లతో ప్రారంభించిన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు తన విలాసవంతమైన జీవనం కోసం ఏకంగా 120 లగ్జరీ కార్లను, ఓ లగ్జరీ హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేసాడు....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

నేటి కథనం ద్వారా మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి పేరు సంజయ్ గోడావత్. ఒకప్పుడు గుట్కా పదార్థాలను తయారు చేస్తూ బిజెనెస్ ప్రారంభించాడు. అనతి కాలంలో 800 కోట్ల రుపాయలు గడించాడు. ఇది గుట్కా తినే ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఎంతో మంది గుట్కా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ ఫ్యామిలీని ఉద్దరించారు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

ఇప్పుడు ఈ ఫ్యామిలీ కొన్ని వేల కోట్ల సంపదను కలిగి ఉంటూ, 120కి పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు మరియు హెలికాఫ్టర్ కలిగి ఉంది. ఒకప్పుడు వీరు ప్రారంభించిన స్టార్ 5 అనే పాన్ మసాలా ప్రొడక్ట్ వీరి తలరాతనిలా మార్చేసింది.

సంజయ్ గోడావత్ గురించి....

సంజయ్ గోడావత్ గురించి....

చెడుకైనా, మంచికైనా ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఓ గతం ఉంటుంది. అలాగే సంజయ్ గోడావత్ గతంలోకి వెళితే, కోల్హాపూర్‌లో జన్మించిన సంజయ్ తన తొలినాళ్లలో గోవా మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పాన్ మాసాలా వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొన్నేళ్లకు తానే స్వయంగా పాన్ మసాలా తయారీ పరిశ్రమను స్థాపించాలనుకున్నాడు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

స్టార్ అనే పేరుతో గుట్కా ఉత్పత్తుల తయారీ ప్రారంభించాడు. అనతి కాలంలోనే "స్టార్ గుట్కా" ప్రొడక్ట్‌తో కోటీశ్వరుడైపోయాడు. 1994లో కోల్హాపూర్ కేంద్రంగా గోడావత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు యువ సిఎమ్‌డి నిలిచాడు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

బిజినెస్ ప్రారంభించిన కేవలం 15 ఏళ్లలోపు 5,000 మంది ఉద్యోగులతో 800 కోట్ల టర్నోవర్ సాధించాడు. గుట్కా వ్యాపారం మీద వచ్చిన సొమ్ముతో పవన శక్తి, అగ్రికల్చర్, కెమికల్స్, ప్యాకేజింగ్, వంట నూనెలు, రియర్ ఎస్టేట్, హెవీ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్, మైనింగ్ మరియు ఆహార ఉత్పత్తుల తయారీ వంటి రంగాలలోకి గోడావత్ గ్రూప్‌ను విస్తరించాడు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

గుట్కా అమ్మకపు వృత్తితో ప్రారంభించిన గోడావత్ కుటుంబం ఇప్పుడు విలాసవంతమైన జీవతాన్ని అనుభవిస్తోంది. రోజూ వారి అవసరాలకు ఏకంగా 120 కార్లను కలిగి ఉంది, అందులో మొత్తం లగ్జరీ, సూపర్ కార్లే ఉన్నాయి. వీరికి ఓ హెలికాఫ్టర్ కూడా ఉంది. గుట్కా తినడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారు. కాని అదే గుట్కా తయారు చేసిన కుటుంబం ఇప్పుడు ఎలా ఉందో చూసి ప్రస్తుతం గుట్కా తినే ప్రతి ఒక్కరు కనువిప్పు పొందాలి.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

దేశీయంగా ఉన్న అనేక మంది వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు మరియు సెలబ్రిటీలకు చెందిన కార్ల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు ద్వారా తెలుసుకున్నారు కదా... నేటి కథనంలో గోడావత్ ఫ్యామిలీ వద్ద ఉన్న కళ్లు చెదిరే ఖరీదైన లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం రండి...

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

గోడావత్ గ్రూప్‌లోని గోడావత్ ఎనర్జీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న శ్రేణిక్ గోడావత్, సంజయ్ గోడావత్‌ కుమారుడు. సాధారణంగా వీరి ఇంటి ముందు వ్యాగన్ ఆర్ కారు పార్క్ చేసి ఉంటుంది. అయితే 27 ఏళ్ల శ్రేణిక్ గోడావత్ ప్రోద్బలంతో గోడావత్ కుటుంబం భారీ కార్లను కొనుగోలు చేసింది.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

సంజయ్ మరియు శ్రేణిక్ మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కొనుగోలు చేసే విశయంలో పోటీపడుతుంటారు. ప్రతి మూడు సెడాన్ కార్లకు ఓ సూపర్ కారు ఉండాలనేది వీరి ఫార్ములా. మొత్తం కార్లలో శ్రేణిక్ గోడావత్ 25 శాతం కార్లను కొనుగోలు చేసాడు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

సంజయ్ గోడావత్ తండ్రి ఇతనికి స్విప్ట్ కారును ఇచ్చాడు. ఇప్పుడు సంజయ్ గోడావత్ తన కుమారుడు శ్రేణిక్‌కు ఏకంగా లగ్జరీ కార్ల గ్యారేజీని ఇచ్చేశాడు. వీటి రోజు నిర్వహణకు భారీగా వెచ్చిస్తున్నారు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

గోడావత్ ఫ్యామిలీ లగ్జరీ కార్ల గ్యారేజీలోని కార్ల గురించి ఆరా తీస్తే ఇందులో,

 • బెంట్లీ బెంట్యాగ్ ఫ్లయింగ్ స్పర్,
 • రేంజ్ రోవర్ వోగ్ ఎవోక్,
 • నిస్సాన్ జిటి-ఆర్,
 • పోర్షే కేయన్నీ బాక్ట్సర్,
శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్
 • లింకన్ లిమోసిన్
 • క్యాడిల్లాక్ ఎస్‌టిఎస్,
 • జాగ్వార్ ఎక్స్‌జె,
 • జాగ్వార్ ఎక్స్ఎఫ్,
 • క్రిస్లర్ హెమీ 300,
శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్
 • బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్
 • బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్
 • ఆడి ఏ8,
 • ఆడి క్యూ7,
 • ఆడి టిటి
శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్
 • మెర్సిడెస్ బెంజ్ ఎస్,
 • మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్,
 • మెర్సిడెస్ బెంజ్ జిఎల్,
 • మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్,
శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఎంటో తెలుసా..? ఈ కార్లన్నీ అఫీషియల్‌గా ఇండియాలో విడుదల కాకముందే విదేశాల నుండి దిగుమతి చేసుకుని కొనుగోలు చేసారు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

విలాసంతో పాటు వేగం పరంగా చూస్తే, వీరి వద్ద నిస్సాన్ జిటి-ఆర్ మరియు రెడ్ కలర్ ఫెరారి 360 వంటి కార్లు ఉన్నాయి.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

అయితే వీటికి రెండవ ప్రాధాన్యమిస్తూ గోడావత్ కుటుంబం రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసింది.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

ఇన్ని కార్ల నిర్వహణ ఆషామాషి కాదు, అందుకే ఈ గ్యారేజీ నిర్వహణ కోసం శ్రేణిక్ గోడావత్ ఓ మెకానిక్ బృందాన్ని నియమించుకున్నాడు. ప్రతి రోజు అన్ని కార్ల పనితీరును వీరు గమనించాల్సి ఉంటుంది. ఇంధనం నింపడం, టైర్లు చెక్ చేయడం, వివిధ ఆయిల్స్ నింపడం, సమయానికి సర్వీసింగ్ చేయడం వంటివి వీరు నిత్యం చేస్తూ ఉండాలి.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

ఇన్ని కార్లు ఉన్నప్పటికీ శ్రేణిక్ గోడావత్ డ్రైవింగ్ స్టైల్ గురించి ఒక్కసారి కూడా వార్తల్లోకెక్కలేదు. సాధారణంగా ఇండియన్ రోడ్లకు ఉన్న స్పీడ్ లిమిట్‌కు అనుగుణంగా డ్రైవ్‌చేస్తుంటాడు. ఇక కొత్త సూపర్ కార్ల వేగాన్ని చెక్ చేయడానికి రాత్రి 9 నుండి 12 గంటల మధ్య ఎన్‌హెచ్-4 మధ్య డ్రైవ్‌చేస్తాడు.

శ్రేణిక్ గోడావత్ లగ్జరీ కార్ కలెక్షన్

కార్ల తరహాలోనే భారీ సంఖ్యలో బైకులను కూడా కలిగి ఉన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సూపర్ బైకుల ఫ్యాన్సే....

.

మారుతి ఈ ఏడాది తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా విడుదల చేయనుంది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటే క్రింది ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

 
English summary
Man Owns 120 Exotic Cars You Will Go Crazy Seeing Collection
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark