Video viral సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకర ప్రయాణం.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం!
సోషల్ మీడియా క్రేజీ కారణంగా అనేక మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇటువంటి స్టంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్, వీడియోల కోసం ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. వారి ప్రాణాలతోపాటు పక్కవారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం : తాజాగా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటోలో నిల్చోని అత్యంత ప్రమాదకరంగా ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణిస్తున్న ఆటోలో నిల్చొని ఊగుతూ వెళ్తుండగా.. వెనుక బైక్‌పైన వస్తున్న అతని మిత్రులు వీడియోను రికార్డు చేయడాన్ని వీడియోలో గుర్తించవచ్చు.

అయితే అంతలో అటుగా సైకిల్‌పైన ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఢీకొనడం గమనించవచ్చు. దీంతో సైకిల్‌పైన ప్రయాణం చేస్తున్న వ్యక్తి కిందపడిపోవడం గమనించవచ్చు. చిన్నపాటి గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఆటోపైనుంచి స్టంట్లు చేస్తున్న వ్యక్తి కనీసం తన వాహనం నిలపకుండా వెళ్లిపోవడం గమనించవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఆటో నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి.. : ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘజియబాద్ పరిసరాల్లో ఆటోను ట్రాక్ చేశారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత ప్రమాదకర డ్రైవింగ్ సహా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై డ్రైవర్‌కు చలానా విధించారు. మరియు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వీడియోపై నెటిజన్ల ఆగ్రహం : అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఘటనకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మరికొందరు కామెంట్ చేశారు. కొందరు రీల్స్, వీడియోల కోసం ఏమైనా చేస్తారని కామెంట్ చేశారు.
ఈ ఘటన యమునా నదిపై నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జ్‌పైన జరిగింది. 2018 నవంబర్ 4న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. ఈ బ్రిడ్డ్ ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 8 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా క్రేజీ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోడ్లపై ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు సహా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారికి పోలీసులు భారీ జరిమానా విధిస్తున్నారు. అయితే ఇలాంటి ఇన్‌స్టా రీల్స్, వీడియోల కోసం ప్రయత్నం చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








