కదులుతున్న కారుపై ప్రమాదకర స్టంట్స్‌.. తమ స్టైల్‌లో ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన పోలీసులు..!!

ప్రస్తుతం మనిషి జీవితాన్ని సోషల్‌ మీడియా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు కొందరు వ్యక్తులు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. సోషల్‌ మీడియా క్రేజ్‌ కారణంగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

కదులుతున్న మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు రూఫ్‌పైన ఓ వ్యక్తి స్టంట్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్‌ 18 ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేటును కలిగి ఉంది.

Man performs dangerous stunts on moving car

ఈ మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు నోయిడాలోని భారీగా రద్దీగా ఉన్న రోడ్లపై ప్రయాణించడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. రూఫ్‌పైన ఓ వ్యక్తి ఎటువంటి భద్రత లేకుండా ఉండగా. కారు వేగంగా, ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేయడం వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. దీంతో నాయిడా పోలీసులు మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారు యాజమానికి భారీగా జరిమానా విధించారు. రూ.26000 జరిమానా విధించి.. అందుకు సంబంధించిన రసీదును నోయిడా ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ (X) ద్వారా షేర్ చేశారు. దాంతోపాటు ఇటువంటి ఘటనలు సహా ట్రాఫిక్‌ ఉల్లంఘనలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

Man performs dangerous stunts on moving car

దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో అనేకం జరుగుతున్నాయి. గత వారం కదులుతున్న వాహనం రూఫ్‌ పై నిల్చున్న ఇద్దరు వ్యక్తుల వీడియో వైరల్‌ అయింది. వీరిపైనా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.23500 జరిమానా విధించారు.

సోషల్‌ మీడియాలో రీల్స్‌, వైరల్‌ వీడియోల కోసం యువత సహా అనేక మంది ఇటువంటి విన్యాసాలకు పాల్పడుతున్నారు. పబ్లిక్‌ రోడ్లపై స్టంట్స్‌ సహా రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. ఫలితంగా కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఇటువంటి స్టంట్స్‌ చేస్తున్నా.. రోడ్లపైన ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, ఇతర వాహనదారులు వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇటువంటి ఘటనలపై పోలీసులు భారీగా జరిమానా విధించడం సహా కఠినంగా వ్యవహరిస్తున్నా... కొంత మంది వ్యక్తుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. సీసీ కెమెరాలు, వివిధ మార్గాల ద్వారా ఇటువంటి వ్యక్తులకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కారులో సీట్‌ బెల్ట్‌, బైక్‌, స్కూటర్‌పై హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

గతం వారం నోయిడాలో ఇటువంటి ఘటనలో ఒకటి జరిగింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు ఓ సీనియర్‌ సిటిజన్‌ ప్రయత్నం చేశారు. ఓ వృద్దుడు తన టాటా హారియర్‌ కారును తీసుకొని ఫిల్లింగ్‌ స్టేషన్‌ (పెట్రోల్‌ బంక్) వచ్చాడు. అక్కడున్న సిబ్బందిని కాదని, తానే స్వయంగా తన కారులో డీజిల్ నింపడం ప్రారంభించాడు.

అయితే నేరుగా ఇంధన ట్యాంక్‌లో డిజిల్‌ నింపకుండా ఇష్టానుసారం ప్రవర్తించడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఫలితంగా చాలా వరకు డీజిల్‌ బయట పడుతోంది. టాటా హారియర్‌ కారులో డీజిల్‌ నింపడం అతని ఉద్దేశం కాదని ఈ వీడియో సరిగా గమనిస్తే అర్థం అవుతుంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యేందుకే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై నోయిడా డీసీపీ దర్యాప్తునకు ఆదేశించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 18, 2023, 12:50 [IST]
English summary
Man performs dangerous stunts on moving car noida police imposed 26k fine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+