పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]
'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' అంటే ఏమిటి, దీని గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే ఇందులో చోటు సంపాదించడం అంటే అంత సులభమైన పని మాత్రం కాదు. ఎందుకంటే ఎవరూ చేయలేని పనిని చేసినప్పుడు ఈ 'గిన్నిస్ బుక్' లో పేరు లిఖించబడుతుంది.
'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' కోసం ఎంతో మంది గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. 'గిన్నిస్ బుక్' లో పేరు సంపాదించడానికి ఏ రంగంలో అయినా తమ ప్రతిభను కనపరచవచ్చు. ఇందులో భాగంగానే గతంలో చాలామంది తమ జుట్టుతో కార్లను లాగడం, తమ పళ్లతో కార్లను లాగడం వంటివి చేసి 'గిన్నిస్ బుక్' లో పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth5-1657254839.jpg)
నివేదికల ప్రకారం, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ బ్యాంక్స్ టౌన్‌కి చెందిన 'ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్' అనే వ్యక్తి తన పళ్లతో ఒకటి, రెండు.. కాదు, ఏకంగా 5 కార్లను అవలీలగా లాగేసి గిన్నిస్ బుక్ రికార్డ్ బద్దలు కొట్టేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడవచ్చు.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth1-1657254803.jpg)
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో #guinnessworldrecords మరియు #officiallyamazing వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేసింది.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth2-1657254811.jpg)
మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే ఒక బలమైన వ్యక్తి తన నోటి పళ్ళ సాయంతో 5 కార్లను లాగటం చూడవచ్చు. ఇందులో అతడు లాగుతున్న కార్లకు ఒక తాడు కట్టి ఉంది. ఆ తాడుని అతడు పళ్ళ సాయంతో లాగడం ద్వారా ఆ కార్లు ముందుకు రావడం చూడవచ్చు. ఇది చూడగానే నిజంగా మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth3-1657254820.jpg)
ఈ వీడియోలో ఆ వ్యక్తి చేస్తున్న ఫ్లీట్ చూసేవారికి చాలా సింపుల్ గా అనిపించినా, అది అనుకున్నంత సులభమైతే కాదు. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది చాలా రోజుల నిరంతర కృషి ,మరియు పట్టుదలతో మాత్రమే సాధ్యమవుతుంది.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth4-1657254830.jpg)
గతంలో కూడా 'ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్' తన పళ్లతో 20 మీటర్ల తేలికపాటి విమానాలను వేగంగా లాగినట్లు తెలిసింది. అంతే కాకుండా యితడు బరువైన వాహనాలను కూడా లాగినట్లు తెలిపాడు. ఎప్పటికీ 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' లో తన పేరు పదిలంగా ఉండిపోవాలని ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాలు చేసాడు.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth8-1657254865.jpg)
'ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్' చేసిన ఈ స్టంట్స్ వల్ల వచ్చే నిధులను తన సొంత ఉపయోగాలకు వినియోగిన్చుకోకుండా, స్థానిక చారిటీ సంస్థలకు అందిస్తున్నట్లు డబ్యూఆర్ సంస్థ తెలిపింది. ఇప్పుడు 5 కార్లను లాగిన ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.
'ట్రాయ్ కాన్లీ మాగ్నస్సన్' చేసిన ఈ స్టంట్స్ వల్ల వచ్చే నిధులను తన సొంత ఉపయోగాలకు వినియోగిన్చుకోకుండా, స్థానిక చారిటీ సంస్థలకు అందిస్తున్నట్లు డబ్యూఆర్ సంస్థ తెలిపింది. ఇప్పుడు 5 కార్లను లాగిన ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.
![పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో] పళ్లతో ఒకేసారి 5 కార్లు లాగడం సాధ్యమేనా.. సాధ్యమయ్యింది, గిన్నిస్‌లో చోటు దక్కింది [వీడియో]](https://images.drivespark.com/te/img/2022/07/most-cars-pulled-with-the-teeth9-1657254874.jpg)
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
సాధారణంగా మనం ఒక కారుని ముందుకు నెట్టడానికి కనీసం నలుగురి సహాయం తీసుకుంటాము. అలాంటిది పళ్ళ ద్వారా 5 కార్లను లాగడం అంటే అంత సులభమేమి కాదు. నిజంగా ఇతడు ప్రశంసనీయుడే. దీనికి ప్రధాన కారణం అతని కృషి మరియు పట్టుదల అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








