Google Earth చోరీకి గురైన కారును ఈజీగా గుర్తించిన గూగుల్ ఎర్త్.. ఎలా అంటే.!!
గూగుల్ ఎర్త్(Google Earth) సాయంతో దొంగతనానికి గురైన కారును ఈజీగా గుర్తించాడు ఓ యువకుడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు తనంతట తానుగా రంగంలోకి దిగి పోయిన కారును తిరిగి తెచ్చుకున్నాడు. ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌కు చెందిన జాయ్ రాబిన్సన్(23) వద్ద స్పోర్టీ సీట్, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్లు ఉన్నాయి. ఇటీవల రాబిన్సన్ తన కార్లను నివాసంలోని పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేశాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రాబిన్సన్ బయటకు వెళ్లేందుకు కారు తీయడానికి పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడు. అయితే అక్కడ తన రెండు కార్లు లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

ఇంకా పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న డోర్లు కూడా విరిగిపోయి ఉండటంతో.. కార్లను ఎవరో దొంగిలించారని రాబిన్సన్ గుర్తించాడు. దీంతో అతను వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్లు చోరీకి గురయ్యాయని ఫిర్యుదు చేశాడు. అనంతరం బయటకు వచ్చాడు. అయితే ఆ కాసేపటికి తనకు ఊహించని షాక్ తగిలింది.
రాబిన్సన్‌కు తన స్నాప్‌చాట్ యాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. 'మీ కారు చోరీకి గురైందని, దానిని రికవరీ చేయాలంటే 2000 పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 2 లక్షలు) చెల్లించాలి'. అని మెసేజ్‌లో పేర్కొన్నాడు. అంతే కాకుండా కారు రాబిన్సన్‌దేనని నిర్ధారించడానికి సీట్ కారు అస్పష్టమైన ఫొటోను దుండగుడు పంపాడు.
రాబిన్సన్ ఈ ఫొటోను చూసిన వెంటనే తన టెక్ స్నేహితుడు జామ్‌ను సంప్రదించి సహాయం చేయాలని కోరాడు. దీంతో ఆ ఫొటో చూసిన జామ్.. అందులో ఆ ఫొటో వెనుక ఉన్న భవనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దానిపై రివర్స్ సెర్చ్ చేశాడు.
ఈ రివర్స్ సెర్చ్ ద్వారా ఈ ప్రత్యేక బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉందో గూగుల్ ఎర్త్ ద్వారా వారిద్దరూ తెలుసుకున్నారు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై రెండు రోజుల క్రితమే ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోలేదని రాబిన్సన్ పేర్కొన్నారు.
దీంతో రాబిన్సన్ తన స్నేహితుడిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ఇంటి నుంచి దాదాపు 6 మైళ్ల దూరంలో ఆ నిర్దిష్ట భవనం ఉన్న ప్లేస్‌కు వెళ్లాడు. అక్కడ రాబిన్సన్ తన సీట్ కారును గుర్తించాడు. కీస్ కూడా అక్కడే ఉండటంతో వెంటనే తన కారును రికవరీ చేసి సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాడు.
కాగా చోరీకి గురైన కారు సీట్ స్పోర్టీ కారు ధర భారత కరెన్సీలో రూ. 23.31 లక్షలు కాగా.. వోక్స్ వ్యాగన్ కారు ధర రూ. 16.23 లక్షలు. అయితే ప్రస్తుతం రాబిన్సన్ తన సీట్ స్పోర్టీ కారును మాత్రమే గుర్తించగలిగాడు. ఇంకా వోక్స్‌వ్యాగన్ కారును గుర్తించాల్సి ఉంది. ఈ సంఘటనను రాబిన్సన్ తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోయిన కారును దక్కించుకోవడం కోసం రాబిన్సన్ చేస్తున్న ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే మరో కారును గుర్తించడం కోసం తనకు ఎలాంటి క్లూ దొరుకుతుందో చూడాలి. సినిమాటిక్ తరహాలో రాబిన్సన్ తన కారును గుర్తించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాగా కార్ల దొంగతనం విదేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా పెరుగుతూనే ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన కార్లు కూడా తరచూ చోరీకి గురవుతున్నాయి. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి పోర్షే కారు చోరీకి గురవడంతో సీసీ కెమెరాల సాయంతో గంట వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండటానికి మీ కార్లలో GPS ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








