ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఏడాది వయసున్న చిన్నారి.. డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం, సీసీ ఫుటేజ్‌ వైరల్

ఏడాది వయసున్న చిన్న పిల్లాడు.. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లాడు. కొద్దిలో రోడ్డు ప్రమాదానికి బలయ్యేవాడు. అదృష్టవశాత్తు యాక్సిడెట్‌ నుంచి బయటపడ్డాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన విజువల్స్‌ ఆ ఇంటి బయట అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.

దేశంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా యాక్సిడెంట్లు జరుగుతుండగా.. ఒక్కోసారి ఇతరుల తప్పిదం కారణంగా చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు దాటుతుండగా రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చిన్నారికి నిజంగా ఇది పునర్జన్మే అని చెప్పవచ్చు.

Child-Escapes-Road-Accident

కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టాంబిలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ఏషియానెట్ న్యూస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. సమాచారం ప్రకారం ఏడాది వయసున్న చిన్నారి తనంతట తానుగా ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చిన్నారి బయటకు వెళ్లడం బహుశా తల్లిదండ్రులు గమనించకపోవచ్చు.

వీడియోను చూస్తే చిన్నారి రోడ్డుపైకి వెళ్లకుండా ఉండేందుకు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ లేనట్లుగా తెలుస్తోంది. చిన్నారి తన చేతిలో ప్లాస్టిక్ బాటిల్‌తో ఇంటి నుంచి స్లోగా రోడ్డు వైపు వెళ్లడాన్ని చూడవచ్చు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండటంతో ఆకర్షితుడై.. చిన్నగా రోడ్డు మీదకు వెళ్తున్నాడు.

Child-Escapes-Road-Accident

రోడ్డుపై కార్లతో పాటు ట్రక్కుల లాంటి భారీ వాహనాలు వెళ్లడాన్ని చూడవచ్చు. చిన్నారి రోడ్డు పైకి చేరుకోగానే డాట్సన్ రెడి-గో వెళ్తుండటాన్ని చూడవచ్చు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న చిన్నారి కారులోని వారు గమనించారు. కారు డ్రైవర్ వెంటనే కారును ఆపాడు. అన్ని వాహనాలు వెళ్లే వరకు వేచి ఉన్నాడు. కారులోని ఓ ప్రయాణీకుడు బయటికి వచ్చి పిల్లాడిని ఇంటి వైపునకు తీసుకెళ్లాడు.

ఆ తర్వాత చిన్నారి ఇంటి లోపలికి వెళ్లాడు. కారులో ఉన్న ప్రయాణికులు చిన్నారిని గమనించి వెంటనే స్పందించడం నిజంగా ఆ చిన్నారి అదృష్టమనే చెప్పవచ్చు. చిన్నారి రోడ్డుపై ఇంకా ముందుకు నడిచినట్లయితే, కారు లేదా మరేదైనా వాహనం ఢీకొట్టే అవకాశం ఉంది. డ్రైవర్‌ అప్రమత్తతో చిన్నారి అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Child-Escapes-Road-Accident

ఇలాంటి సంఘటన ఇటీవల ఇండోనేషియాలోనూ చోటేచేసుకుంది. అది వైరల్‌గా మారింది. రోడ్డుకు అడ్డంగా పరిగెడుతున్న ఓ చిన్నారి టయోటా యారిస్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. అయితే ఘటనలో పాపకు గాయాలు కాలేదు. పాప పై నుంచి ముందుకెళ్లిన కారు వెంటనే ఆగిపోయింది. బహుశా కారు గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఆ చిన్నారి బతికి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్డు దాటుతున్నప్పుడు వారిని పట్టుకోవడం లేదా ఎత్తుకుని రోడ్డు దాటించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఆధునిక వాహనాలు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. వీటి ప్రమాదాలు యాక్సిడెంట్లను నివారించవచ్చు. అయితే పాత వాహనాల్లో ఇలాంటి ఫీచర్లు లేవు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండటం అవసరం.

Child-Escapes-Road-Accident

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, November 2, 2023, 20:21 [IST]
English summary
Man rescued one year old child while runs towards road video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+