ఎన్ని గుండెలురా వీడికి.. రైల్వే ట్రాక్‌పై బైక్‌ డ్రైవ్‌ చేస్తూ ఎదురెళ్లిన వ్యక్తి.. కట్‌ చేస్తే!

ఈ మధ్య ఇంటర్‌నెట్‌లో కొన్ని విజువల్స్‌ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరిగనప్పటి నుంచి కొన్ని వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ప్రతీ వ్యక్తి తమ కెమెరాలో తమ చుట్టూ జరిగే విజువల్స్‌ని రికార్డు చేస్తూ ప్రపంచానికి చూపిస్తున్నారు. అగ్నికి ఆయువు తోడైనట్లు సోషల్‌మీడియాలో ఈ వీడియోలు క్షణాల్లో ఖండాతరాలు దాటి పోతున్నాయి. అయితే ఇవన్నీ పక్కనబెడితే కొందరు వ్యక్తులు పాపులారిటీ కోసం విభిన్న స్టంట్స్‌ వేస్తుండగా.. మరికొందరు పిచ్చి చేష్టలతో వైరల్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైలుకి ఎదురెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది.

రైల్వే ట్రాక్‌పై రైలుకి ఎదురెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం దర్యపూర్‌ రైల్వేగేట్‌ వద్ద జరిగింది. గేట్‌ కీపర్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై దూసుకెళ్లాడు. ఇదే సమయంలో గేట్‌ పడటంతో అక్కడే ఉన్న కొందరు కెమెరాలో ఈ విజువల్స్‌ని బంధించారు. ట్రైన్‌ వచ్చే రూట్‌కి ఎదురెళ్తున్న విజువల్స్‌ గమనించవచ్చు.

Man Ride Bike Towards a Running Train in Telangana

ఇదే సమయంలో గేట్‌ కీపర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే దగ్గర్లోని నవీపేట స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించడం ద్వారా లోకోపైలట్‌కు ఈ విషయం చేరింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్‌ రైలుని నిలిపివేశారు. అలానే వెళ్తూ రైలు వద్దకు చేరుకోవడంతో అతడిని లోకో పైలట్‌, స్థానికులు పట్టుకున్నారు. సకాలంలో గేట్‌ కీపర్‌ స్పందించడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియ రాలేదు.

దీనిపై సమాచారం అందుకున్న లోకోపైలట్‌ రైలుని నిలిపివేయడంతో ట్రైన్‌ అరగంట ఆలస్యంగా నడిచింది. గేట్‌ కీపర్‌ చర్యను రైల్వే పోలీసులు అభినందించారు. ఇదే సమయంలో ఈ చర్యను వారు సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ నిమిత్తం వాహనదారుడిని నిజామాబాద్‌ కార్యాలయానికి తరలించారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే కావాలనే చేశాడా లేక ఆత్మహత్యాయత్నమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Man Ride Bike Towards a Running Train in Telangana

ఈ మధ్య ఇలాంటి వైరల్‌ విజువల్స్‌ రోజుకి పదుల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. దేశంలో ముఖ్యంగా రైల్వే గేట్ల వద్ద జనాలు గేట్‌ పడినా సరే లెక్కచేయరు. బిజీ లైఫ్‌లో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. గేట్‌ కీపర్‌ చర్య వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. లేనియెడల పరిస్థితి వేరేలా ఉండేది. అయితే బైక్‌పై రైల్వే ట్రాక్‌లో వ్యతిరేక దిశలో ప్రయాణించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇలాంటి చర్యలను ఇతరలు ఫాలో అయ్యే అవకాశం లేకపోదు. ఎందుకంటే కొన్నిసార్లు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యేందుకు యువత దీనిని కాపీ కొట్టే ఛాన్స్‌ ఉంటుంది. ఇవే కాకుండా చాలా వరకు ఇలాంటి వింత ఘటనలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం కొందరు వ్యక్తులు రైలు ట్రాక్‌పై రాడ్లు పెట్టి పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Embed :

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 15:35 [IST]
English summary
Man rides bike towards train in telangana loco pilot saves life visuals gone viral
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+