ఓ వైపు స్కూటర్ రైడింగ్.. మరోవైపు ఆఫీస్ వర్క్ - వైరల్ వీడియో

ఐటీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు టెక్నాలజీలో, అభివృద్ధిలో ఇతర నాగరాలకంటే వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ వ్యక్తి స్కూటీ మీద వెల్తూనే ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

బెంగళూరులో.. కర్ణాటక వాసులు మాత్రమే కాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది. రోజూ ట్రాఫిక్ కష్టాల మధ్య సతమతమవుతూ.. ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లాలన్నా.. రావాలన్నా చాలా కష్టంగా మారిపోతోంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి స్కూటీ మీద వెళుతూనే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇది బెంగళూరులో ఇది ప్రారంభం కాదు అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్ అవుతోంది.

Man Riding Scooter And Attends Office Video Conference in Laptop

పీక్ బెంగళూరు అనే ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతున్న వీడియో ఎంతోమంది యూజర్లను తెగ ఆకర్షిస్తోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు బ్రదర్ వారానికి 70-గంటలు పనిచేస్తున్నారు అని అన్నారు. మరొకరు ల్యాప్‌టాప్‌ సేఫ్ అని.. ఇంకొకరు ఇది ప్రమాదమని.. ఇలా వివిధ రకాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి స్కూటీ మీద వెల్తూ ఇలా చేయడం పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఒక నెటిజన్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరిగా వర్క్ ఫ్రమ్ స్కూటీ అని పేర్కొన్నారు. మరొకరు ఈ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగంలో చేరండి అని సలహా ఇచ్చారు. మొత్తానికి వీడియో చూస్తే.. ఆ వ్యక్తి సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. అంతే కాకుండా ఉద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయనేది దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఈ వీడియో పోలీసుల కంట పడితే ఫైన్ విధించే అవకాశం ఉంది.

Man Riding Scooter And Attends Office Video Conference in Laptop

బెంగళూరులో ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గత ఏడాది అక్టోబర్‌లో ఒక మహిళా బైక్ పిలియన్ సీటులో కూర్చుని ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియోపై కూడా నెత్తినాలు కామెంట్ల వర్షం కురిపించారు ఆ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చేసింది. ఇది వాహన వినియోగదారుల భద్రతకు భంగం కలిగిస్తుంది. తోటి ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెడుతుంది.

కొన్ని సర్వేల ప్రకారం 2022లో అత్యధిక రద్దీ ఉన్న నాగరాల జాబితాలో లండన్ మొదటి స్థానంలో ఉండగా.. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు నడిబొడ్డున కేవలం 10 కిమీ దూరం ప్రయాణించడానికి కనీస 29 నిమిషాల 10 సెకన్లు అవసరమని నివేదికలు వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే నగరంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, వాహన సంఖ్య ఏ విధంగా ఉంది అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి.

బెంగుళూరు లాంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటే అక్కడి ప్రజలు మెట్రో, సిటీ బస్సులను ఉపయోగిస్తే ట్రాఫిక్ సమస్య కొంతమేరకు పరిష్కారమవుతుంది. ప్రతిరోజు ప్రజారవాణాను ఉపయోగించకున్నా.. వారానికి రెండుసార్లు వినియోగించినా ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు, ఆ వ్యక్తి ఆఫీసుకు ఇంటి నుండి కొంచెం త్వరగా బయలుదేరి ఉంటే, రోడ్డుపై వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం ఉండేది కాదు.

బెంగళూరు లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువమంది సొంత వాహనాలు కాకుండా.. మెట్రో, సిటీ బస్సులను ఉపయోగిస్తే.. తప్పకుండా ట్రాఫిక్ కొంత నియంత్రించబడుతుంది నిపుణులు చెబుతున్నాయి. కానీ చాలామంది బస్సులలో ప్రయాణించడం కంటే కూడా సొంత వాహనాల మీద ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న కారణంగా నగరంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య తారాస్థాయికి చేరుకుంటోంది. ఇదే రద్దీకి ప్రధాన కారణం అవుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2024, 12:00 [IST]
English summary
Man riding scooter and attends office video conference in laptop
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+