ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

ప్రముఖ వాహన తయారీసంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా నిత్యజీవితంలో జరిగే చాలా ఆసక్తికరమైన సంఘటనలపై స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అతడు ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో కేవలం 9 సెకన్లు మాత్రమే ఉంది. ఈ వీడియో ఇప్పటికే 1.13 లక్షలకు పైగా వీక్షించారు. అంతే కాకూండా దీనికి 6.5 వేలకు పైగా లైక్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీనితోపాటు ఆనంద్ మహీంద్రా పాలొవర్స్ చాలామంది కమిన్స్ కూడా చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

ఈ 9 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు ఆకాశమత్తుగా ఒక ఆటో అతని మీదికి దూసుకు రావడం చూడవచ్చు. అదే సమయంలో అతడు పక్కకు తప్పుకున్నాడు. కానీ ఆటో ఏకంగా ఒక వైపు వాలుతూ ముందుకు వెళుతోంది. వీడియో చూసిన ఎవరైనా ఆ ఆటో పడిపోతుందని అనుకుంటారు.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

కానీ ఇందాక తప్పించుకున్న వ్యక్తి ఆటో కింద పడిపోకుండా కాపాడతాడు. ఈ మొత్తం సంఘటన ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చివరలో ఆటో కరెక్ట్ అంటే ఆటో కరెక్టెడ్ అనే శీర్షిక చూపబడుతుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని కొంతమంది చెప్పారు.

కొంతమంది ఆటోని పడిపోకుండా ఆపిన బాహుబలి అని కామెంట్ చేశారు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి అతని చేతులను అడ్డుపెట్టి ఆ ఆటోని ఆపకుండా ఉంది ఉంటె అది తప్పకుండా కిందికి పడిపోయి ఉండేది, కానీ ఆలా జరగకుండా ఆ వ్యక్తి అడ్డునుకున్నాడు.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

వీడియో చివరలో వచ్చే ఆటో కరెక్ట్ టైటిల్ ఈ వీడియోకు సరిగ్గా సరిపోతుందని వీక్షకులు అంటున్నారు. కొంతమంది అయితే ఈ ఆటోని ఆపినది ఆ వ్యక్తి కావున దీనికి ఆటో కరెక్ట్ టైటిల్ సరైనదని వ్యాఖ్యానించారు. వీరితోపాటు ఇంకా చాలామంది దీనిపై స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో వీడియో; కనెక్ట్ అయిన నెటిజన్స్

ఏది ఏమైనా ఈ వీడియో చూడటానికి కొంత భయానకంగానే ఉంది. ఎందుకంట అక్కడున్న వ్యక్తి దీనిని ఆపకపోతే జరిగే సంఘటన ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కావున ఎలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. కావున అప్రమత్తంగా ఉంది వాహనాలు వీలైనంత నెమ్మదిగా డ్రైవ్ చేయడం ఉత్తమం.

Most Read Articles

English summary
Anand Mahindra shares viral video of man saving auto from overturning. Don't miss the caption. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X