పాల వ్యాపారానికి 'హార్లీ డేవిడ్‌సన్' బైక్.. వైరల్ అవుతున్న వీడియో

మనం నిత్యజీవితంలో ప్రతి రోజు పాలు పొసే వారిని, పేపర్ వేసేవారిని చూస్తూ ఉంటాము. వారు పాలు లేదా పేపర్ వేయడానికి ఎలాంటి వాహనాలను వినియోగిస్తారు అనేది మనకు బాగా తెలుసు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఖరీదైన బైకులో తిరుగుతూ ఒక వ్యక్తి పాలు పోస్తున్నాడు.

నిజానికి మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో 'హార్లీ డేవిడ్‌సన్' ఒకటి. హార్లీ డేవిడ్‌సన్ బైకులు కొనాలనేది చాలామంది కల. అయితే ఈ బైకులు అత్యంత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కొనలేకపోతారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో ఒక వ్యక్తి ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ బైకుపై తిరుగుతూ పాలు పోస్తున్నాడు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా వీడియో చూస్తే తప్పకుండా ఎవరైనా నమ్మాల్సిందే.

పాల వ్యాపారానికి హార్లీ డేవిడ్‌సన్ బైక్

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి హార్లీ డేవిడ్‌సన్ బైకుకి వెనుకవైపు రేణు పాల క్యాన్లను తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. అంతే కాకుండా హెల్మెట్ కూడా బైక్ వెనుక భాగంలో ఉంది. అయితే ఆ బైక్ వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ మీద నెంబర్ కి బదులుగా ఇంగ్లిష్ లో 'గుజ్జర్' అని రాసి ఉంది.

ఈ వీడియోను amit_bhadana_3000 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసాడు. ఈ వీడియోకి దాదాపు 1.90 లక్షల లైకులు, 3 మిళియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బహుశా హార్లీ డేవిడ్‌సన్ రైడ్ చేసే వ్యక్తి తమ కుటుంబీకులకు సహాయం చేయడానికి ఈ పని చేస్తున్నాడేమో అని కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలియదు.

ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియకపోయినప్పటికీ 2 వారల క్రితం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారని తెలుస్తోంది. నిజానికి 'హార్లీ డేవిడ్‌సన్' బైక్‌ కలిగి ఉన్న వ్యక్తులు పాలు పోయడం వంటి పనులు చేసే అవకాశం లేదు. ఇది పబ్లిసిటీ కోసమా లేకుంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొనుగోలు చేయడానికే సాధారణ ప్రజలు కనీసం 10 సార్లు ఆలోచిస్తారు.

అలాంటిది ఒక వ్యక్తి ఖరీదైన అలంటి హార్లీ డేవిడ్‌సన్ బైకుని పాలు వేయడానికి వాడేస్తున్నాడు. పాలు వ్యాపారం చేసే వ్యక్తులు చాలామంది టీవీఎస్ ఎక్స్ఎల్100 వంటి మోపెడ్స్ వినియోగిస్తారు. అది కాకుంటే బజాజ్ ప్లాటినా, స్ప్లెండర్ వంటి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను వినియోగిస్తారు. అలాంటిది ఖరీదైన లగ్జరు బైకులను పాల వ్యాపారం చేయడానికి ఉపయోగించినట్లు గతంలో కూడా ఎక్కడా వెలుగులోకి రాలేదనే చెప్పాలి.

మొదట్లో చెప్పుకున్నట్లు భారతదేశంలో 'హార్లీ డేవిడ్‌సన్' బైకులు అత్యంత ఖరీదైనవి. కావున బాగా దబ్బున వ్యక్తులు, సెలబ్రెటీలు, క్రికెటర్లు మరియు వ్యాపారవేత్తలు ఈ బైకులను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వీడియోలో కనిపించే వ్యక్తి 'హార్లీ డేవిడ్‌సన్' బైక్ కొనుగోలు చేసినట్లయితే అతడు పేదవాడు అయిఉండే అవకాశం లేదు. ఒక వేళా ధనవంతుడే అయితే అలంటి బైకుతో పాల వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, ఈ కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అలాంటి నేపథ్యంలో భాగంగానే ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకులకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 3, 2023, 14:16 [IST]
English summary
Man selling milk on expensive harley davidson bike video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+