కాస్ట్లీ కారులో ఇంటి భోజనం హోటల్.. ఫుల్లు గిరాకీ, ఐడియా అదుర్స్ గురూ.!!
ఇటీవల ఖరీదైన కార్లలో చేపలు విక్రయించడం, ఆకు కూరలు అమ్మడం లాంటి సంఘటనలు తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా బెంజ్ కారుపై గడ్డి మోపు తీసుకెళ్లడం తెగ ఫేమస్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. తాజాగా ఖరీదైన కారులో కమ్మనైన ఇంటి భోజనం అందించి ఓ వ్యక్తి ట్రెండ్ అయ్యారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, హోటళ్లు.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వెరైటీ డిషెస్, వినూత్నమైన సర్వీస్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కానీ భోజన ప్రియులు ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉన్నారు. సరికొత్తగా సర్వీసులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. వీటి గురించి లోకల్ ప్రజలతో పాటు చాలా మందికి తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ముంబయిలోని ఓ రైలు బోగీలో చిన్న పాటి ఫైవ్ స్టార్ హోటల్‌నే ప్రారంభించారు ఇద్దరు యవకులు.. ఆ ఐడియా ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది ట్రెండింగ్‌లో ఉండగానే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన కొత్త కియా కేరెన్స్(Kia Karens MPV) ఎంపీవీ కారులో ఇంటి భోజనం అందిస్తున్నారు.
ఎంత గొప్పగా సర్వీసు చేసి, ఎన్ని రకాల వంటకాలు వడ్డించినా ఎంతైనా ఇంటి భోజనం రుచే అంటారు ఎవరైనా.. అలాంటి ఇంటి భోజనం కోరుకునే వారి కోసం ఇలా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు కియా కేరెన్స్ యజమాని. ఇందుకు సంబంధించిన వీడియోను హర్‌సిమ్రాన్ సింగ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.

కారు యజమాని ఇంట్లో తన భార్యతో వంట చేయించి ఆ వంటకాలను కియా కేరెన్స్ కారులో ఢిల్లీ రోడ్లపై విక్రయిస్తున్నారు. అయితే ఢిల్లో ఈ స్పాట్ ఎక్కడ అనే స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. కాగా ఇక్కడ సర్వీస్ అందిస్తున్న కియా కేరెన్స్ సరికొత్తది అని వీడియోలోని సమాచారం ద్వారా తెలుస్తోంది. కియా కేరెన్స్‌లోని మూడవ వరుస సీట్లను మడతపెట్టి, అక్కడ భోజనాన్ని ఉంచి కస్టమర్లకు అందిస్తున్నారు.
Kia Carens దాని విభాగంలో ఒక ప్రసిద్ధ MPVగా పేరు గాంచింది. భారత మార్కెట్లో కియా కేరెన్స్ ఎంపీవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎంతలా అంటే ఒక ఏడాదిలో లక్ష యూనిట్లను సేల్ చేయగలిగింది. ఇటీవల కియా కేరెన్స్ X లైన్ వేరియంట్‌ను కూడా పరిచయం చేశారు. ఇతర కియా మోడళ్ల మాదిరిగా కేరెన్స్‌లో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

కియా కేరెన్స్ ఎంపీవీ భద్రతా పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెథెరెట్ అప్హోల్స్టరీ వంటి ఆకర్షణీయమైన ఇంటీరియర్ ఫీచర్లను కలిగి ఉంది.
కియా కేరెన్స్ ఎంపీవీ 1.5 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 115 Ps వద్ద 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కూడా ఈ ఎంపీవీని కొనుగోలు చేయవచ్చు. ఇది 115 Ps వద్ద 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా కియా కేరెన్స్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంజిన్ 160 Ps వద్ద 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
కియా కేరెన్స్ ఎంపీవీ(Kia Carens MPV) పైన పేర్కొన్న ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌తో 23 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్ల ప్రకారం భారత మార్కెట్లో ఈ ఎంపీవీ ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల వరకూ ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.


Click it and Unblock the Notifications








