15 నిముషాల ప్రయాణానికి రూ. 32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్.. ఎక్కడో తెలుసా?
ఒకప్పుడు ప్రయాణం అంటే కాలినడకన వెళ్లేవారు, అయితే సుదూర ప్రాంతాలకైతే గుర్రపు బండి మీదనో లేదా ఎద్దుల బండి మీదనో ప్రయాణాలను సాగించేవారు. అయితే ప్రపంచం రోజురోజుకి అభివృద్ధివైపు పరుగులు తీస్తోంది. ఇందులో టెక్నాలజీ మరింత వేగంగా పెరుగుతోంది. కాబట్టి ఈ రోజు కొంత దూరం ప్రయాణించడానికి కూడా తప్పకుండా వాహనాలనే వినియోగిస్తున్నారు. ఇందులో కూడా ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సేవలు విరివిగా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలన్న బుక్ చేసుకున్న నిముషంలో వాహనం ముందు ఉంటుంది.

ఈ కారణంగానే ఎక్కువమంది ఈ రోజు ట్యాక్సీ సేవలనే వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల లండన్ లో ఒక వ్యక్తి ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకుని కొంత దూరం ప్రయాణించాడు. అయితే అతనికి ఉబర్ వేసిన బిల్లు చూసి ఒక్కసారిగా హవాక్కయ్యాడు.

నివేదికల ప్రకారం, ఈ సంఘటన లండల్ లోని మాంచెస్టర్ లో జరిగినట్లు తెలిసింది. నిజానికి 'ఒలివర్ కప్లాన్' అనే వ్యక్తి ఉబర్ కారు బుక్ చేసుకుని మాంచెస్టర్ నుంచి అతడు వెళ్లాల్సిన లొకేషన్ సెట్ చేసుకున్నాడు. అయితే కారులో 15 నిముషాలు ప్రయాణించి తానూ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాడు. అయితే అతనికి కార్డు ఉండటం వల్ల అప్పుడు అమౌంట్ చెల్లించలేదు. ఎందుకంటే అది ఆటోమాటిక్ గా చెలించబడుతుంది.

ఆ మరుసటి రోజు ఉదయం తనకు వచ్చిన మెసేజ్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే అతడు ప్రయాణించిన 15 నిముషాలకు గాను ఉబర్ 35,427 పౌండ్ స్టెర్లింగ్స్ బిల్ వేసింది. ఇది మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 32.4 లక్షలు.

అయితే అతని కార్డులో అంత అమౌంట్ లేకపోవడం వల్ల ఆ మొత్తం అమౌంట్ తీసుకోలేకపోతున్నట్లు మెసేజ్ లో ఉంది. ఇదంతా చూసిన అతనికి దిమ్మతిరిపోయింది. వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీసాడు. అయితే మొదట కస్టమర్ కేర్ సిబ్బందికి కూడా ఆశ్చర్యం వేసింది, కానీ చివరగా అతని డ్రాప్ లోకేష్ మారిపోయిందని తెలిసింది.

ఒలివర్ కప్లాన్ పెట్టిన డ్రాప్ లోకేష్ మాంచెస్టర్ లోని 'విచ్ఉడ్ పబ్' కి బదులుగా, అదే పేరుతో ఆస్ట్రేలియాలో ఉన్న లొకేషన్ చూపించడం వల్ల ఈ తప్పు జరిగిందని కస్టమర్ కేర్ సిబ్బంది తెలిపారు. ఆ తరువాత అతనికి సరైన బిల్ వేశారు. దీనితో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

ఒలివర్ కప్లాన్ యొక్క కార్డులో అంత అమౌంట్ లేకపోవడం ఒకరకంగా చాలామంచిది అయ్యింది. లేకుంటే ఆ మొత్తం కట్ అయిపోయి ఉండేది. ఆ తరువాత వారి చుట్టూ తిరగాల్సి వచ్చేది అని తన అనుభవాన్ని తెలిపాడు. ఇది లొకేషన్ మారిపోవడం వల్ల జరిగిన పొరపాటు అని మొత్తం మీద తెలిసింది.

కొన్ని సార్లు టెక్నీకల్ సమస్యల వల్ల ఇలాంటి పొరపాట్లు జరగటం సహజమే, కానీ కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కస్టమర్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటన గతంలో హైదరాబాద్ లో జరిగింది.

హైదరాబాద్ నగరానికి చెందిన 'జబేజ్ శామ్యూల్' అనే వ్యక్తి 2021, అక్టోబర్ 19న ఓలా క్యాబ్ బుక్ చేసుకుని.. తన భార్య, మరో వ్యక్తితో కలిసి ప్రయాణించాడు. అయితే ఆ క్యాబ్ శుభ్రంగా లేకపోవడమే కాకూండా, క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా మాట్లాడటం వంటివి ఆ ప్రయాణికులకు నచ్చలేదు. ఈ కారణంగా వారు ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యలోనే దిగేసారు.

వారి ప్రయాణానికి మొత్తం రూ. 200 తీసుకోవాలి. కానీ ఆ డ్రైవర్ వారి నుంచి బలవతంగా రూ. 861 వరకు తీసుకున్నాడు. అయితే ఆ కస్టమర్ చివరికి వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. కోర్టు మొత్తం విచారణ జరిపి ఓలా సంస్థను రూ. 95,000 కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఓలా, ఉబర్ వంటి సంస్థలు విరివిగా క్యాబ్ సర్వీస్ అందిస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని టెక్నీకల్ సమస్యలు వచ్చినప్పుడు సంస్థలు పరిస్కారం చూపుతున్నాయి, కానీ అక్కడక్కడా కొన్ని మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కస్టమర్లను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మీకు కూడా ఎదురై ఉంటే మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








