బేస్‌బాల్ మ్యాచ్ టికెట్ల కోసం 1965 ఫోర్డ్ మస్టాంగ్ కారును అమ్మేసి వ్యక్తి

By Ravi

ఇష్టమైన క్రీడను ప్రత్యక్షంగా వీక్షించాలంటే టికెట్లను కొనుగోలు చేయాలి, మరి ఆ టికెట్లను కొనుగోలు చేయటం కోసం ఎవరైనా తమకెంతో ఇష్టమైన కారును అమ్మేసుకుంటారా..? కానీ ఈ వ్యక్తి మాత్రం తన కారును అమ్మేశాడు. కొందరికి క్రికెట్ అంటే క్రేజ్, మరికొందరికి ఫుట్‌బాల్ అంటే క్రేజ్. కానీ జెరాడ్ మెయిన్‌కి మాత్రం బేస్‌బాల్ అంటే క్రేజ్. ఎంత క్రేజ్ అంటే, తన ఫేవరేట్ టీమ్ ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం తన కారును సైతం అమ్ముకునేంత క్రేజ్.

మిసౌరి బ్లూ స్ప్రింగ్‌కు చెందిన కన్సాస్ సిటీ రాయల్స్ జట్టుకు జెరాడ్ మెయిన్ వీరాభిమాని. ఈ జట్టు ఆడే బేస్‌బాల్ మ్యాచ్‌ల టికెట్ల కోసం అతను తన 1965 ఫోర్డ్ మస్టాంగ్ కారును అమ్మేశాడు. తన కోసం అలాగే తన ఫ్యామిలీ కోసం టికెట్లను కొనుగోలు చేయటానికి ఈ క్లాసిక్ కారును కేవలం 24,000 డాలర్లకే ఈ కారును అమ్మేశాడు.

1965 Ford Mustang

జెరాడ్ మెయిన్‌కు తన క్లాసిక్ కార్ అంటే ఇష్టం, కానీ బేస్‌బాల్ అంటే ఆ కారు కన్నా ఇంకా ఎక్కువ ఇష్టం. కారు కావాలనుకుంటే రోడ్డు పక్కన ఎక్కడైనా కొనుక్కోవచ్చని, ప్రతి 30 ఏళ్లకు ఒక్కసారి జరిగే మ్యాచ్‌లో రాయల్స్ జట్టు ఆటను చూడటం నిజంగా ఓ అద్భుతమైన అనుభూతి అని జెరాడ్ చెప్పుకొచ్చాడు.

క్రెయిగ్స్‌లిస్ట్ యాడ్ ప్రకారం, ఈ 1965 ఫోర్డ్ మస్టాంగ్ ఫాస్ట్‌బ్యాక్ కారు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ కారు కోసం తాను ఇచ్చిన ప్రకటనలో.. కేవలం వరల్డ్ సిరీస్ టికెట్లను కొనుగోలు చేసేందుకే కారును అమ్మేస్తున్నానని అతను పేర్కొనడం గమనార్హం.

కన్సాస్ సిటీలో ఈ మ్యాచ్ కోసం టికెట్లను కొనుగోలు చేయటం చాలా కష్టం. ఇవి అత్యంత ఖరీదుతో కూడుకున్నవి. ఈ మ్యాచ్ ప్రారంభ ధర టికెటే 450 డాలర్లు. అంత డబ్బును చెల్లించినప్పటికీ, మంచి సీట్లు దొరకవట.

More from DriveSpark

Article Published On: Thursday, October 23, 2014, 13:48 [IST]
English summary
Jerod Main is willing to sell his 1965 Ford Mustang to get tickets money for him and his family. He is big fan of Kansas City Royals baseball team from Blue Springs, Missouri.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+