అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి ఉన్నట్లు.. మనం చుట్టూ ఉండే ప్రజలు వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇందులో కొందరు చేసే సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సాధారణంగా, కార్ల కోసం కొంతమంది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీరు రూ.71,000 ఖరీదు చేసే స్కూటర్ కోసం రూ.15.44 లక్షలు చెల్లించి మరీ రిజిస్ట్రేషన్ కొనుగోలు చేస్తారా? మాకేమన్నా పిచ్చా, మేమెందుకు అలా చేస్తాం అంటారు కదూ. కానీ ఈ వ్యక్తి మాత్రం అలానే చశాడు.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

వివరాల్లోకి వెళితే.. ఫ్యాన్సీ నెంబర్ కోసం జరిగిన వేలంలో చండీగఢ్‌ కు చెందిన ఓ వ్యక్తి రూ.15.44 లక్షలు బిడ్డింగ్ చేసి ఓ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నాడు. అతడు ఈ ఫ్యాన్సీ నెంబర్ ను తన హోండా యాక్టివా స్కూటర్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు. మార్కెట్లో హోండా యాక్టివా 6జి స్కూటర్ ఖరీదు సుమారు రూ.71,000 వరకూ ఉంటుంది. ఈ సంఘటన గురించి తెలిసినవారంతా, అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు, అంత చిన్న బండికి ఇంత ఖరీదైనా నెంబరా అని ఆశ్చర్యపోతున్నారు.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

చండీగఢ్‌ కు చెందిన అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ బ్రిజ్ మోహన్ అనే 42 ఏళ్ల వ్యక్తి, చండీగఢ్ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించిన ఇ-వేలంలో అత్యధికంగా రూ.15.44 లక్షలకు బిడ్‌ చేసి 'CH-01- CJ-0001' అనే ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ను సొంతం చేసుకున్నాడు. తాను ఫ్యాన్సీ నంబర్‌ ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని, ఈ నెంబర్ ను తన కొత్త హోండా యాక్టివా స్కూటర్‌ కోసం ఉపయోగిస్తానని బ్రిజ్ మోహన్ తెలిపారు.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

అయితే, భవిష్యత్తులో తాను కొనుగోలు చేయబోయే కారుకి ఇదే ఫ్యాన్సీ నంబర్‌ ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు బ్రిజ్ మోహన్ చెప్పాడు. చండీగఢ్ లోకొత్త సిరీస్ CH-01-CJ ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలం ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 16, 2022 వరకు నిర్వహించారు. చండీగఢ్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ దాదాపు 378 రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం వేలం నిర్వహించి, మొత్తం రూ.1.5 కోట్లను వసూలు చేసింది. ఇందులో అత్యంత ఖరీదైన నంబర్‌ ను బ్రిజ్ మోహన్ రూ.15.44 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

ఇతర ఖరీదైన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లలో CH-01- CJ-007 నెంబర్ రూ.4.4 లక్షల వెల పలుకగా, CH-01-CJ-003 ఫ్యాన్సీ నెంబర్ రూ.4.2 లక్షల వెల పలికింది. ఈ వేలంలో అన్ని ప్రత్యేక ఫ్యాన్సీ నంబర్‌ లకు రిజర్వ్ ధర వద్ద బిడ్డింగ్ జరిగింది. అంటే, ఈ ఫ్యాన్సీ నెంబర్లను బిడ్ లో గెలుచుకున్న వ్యక్తులు, తొలుతగా కొంత మొత్తాన్ని చెల్లించి, ఆ నెంబర్ ను దక్కించుకోవచ్చు. కాకపోతే, ఆ ధర కోసం బిడ్ చేసిన మిగిలిన మొత్తాన్ని ఒక నెలలోపే చెల్లించాల్సి ఉంటుంది.. అలా చెల్లించని పక్షంలో 10 శాతం జరిమానా విధించబడుతుంది.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

బ్రిజ్ మోహన్ బిడ్ చేసిన CH-01-CJ-0001 ఫ్యాన్సీ నెంబర్ కోసం రిజర్వ్ ధర రూ. 50,000 కాగా, మిగిలిన రెండు నంబర్ల కోసం రిజర్వ్ ధర రూ. 30,000 గా ఉంది. గడచిన 2012లో చండీగఢ్‌లో 0001 అనే నంబర్ కోసం ఇప్పటి వరకు అత్యధిక బిడ్ దాఖలైంది, CH-01-AP సిరీస్ నంబర్ కోసం ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 26.05 లక్షలు చెల్లించాడు. ఇది అతని కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారు కోసం ఉపయోగించినట్లు సమాచారం. ఈ వేలంలో రెండవ అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్ గా CH-01-CJ-002 గా నిలిచింది. దీకోసం ఓ వ్యక్తి 5.4 లక్షలకు బిడ్ చేశాడు.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్..

ఇదిలా ఉంటే, భారతదేశంలో బిహెచ్ (BH) సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతేడాదిలో సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మరియు నాలుగుకి పైగా వివిధ రాష్ట్రాలలో కార్యాలయాలు కలిగిన ప్రైవేటు సంస్థలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు తమ వాహనం కోసం బిహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం వారు తమ కొత్త రాష్ట్రంలోని ఆర్టీవో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ అనే కాన్సెప్ట్‌లో భాగంగా, భారత ప్రభుత్వం ఈ కొత్త వాహన రిజిస్ట్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

ఉద్యోగ బదిలీల కారణంగా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి మారే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, వారి వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో, వారికి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూసేందుకు భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం, ఇకపై ఇలా ఉద్యోగరీత్యా తరచూ బదిలీ అయ్యే ఉద్యోగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ ను కొత్తగా బదిలీ అయ్యే రాష్ట్రంలోకి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారి వాహనాల కోసం కొత్త పాన్-ఇండియా రిజిస్ట్రేషన్ సిరీస్‌ (BH Series)ను కేంద్రం ప్రవేశపెట్టింది.

అంతంత కోడికి అర్థశేరు మసాలా అన్నట్లు.. రూ.71,000 స్కూటర్‌కి రూ.15.44 లక్షల నెంబర్ ప్లేట్!

NOTE: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.. పాఠకులు గమనించగలరు

Article Published On: Tuesday, April 19, 2022, 10:55 [IST]
English summary
Man spent rs 15 44 lakhs on fancy number for rs 71000 scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+