దీన్నే పిచ్చి అంటారు.. రీల్స్ కోసం బైక్‌పై పెట్రోల్‌ పోసి.!!. వైరల్ అవుతున్న వీడియో.!!

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం కొందరు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం ఏమో కానీ చివరికి ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో కటకటాలపాలవుతున్నారు. లేదంటే జరిమానాలు తప్పడం లేదు. తాజాగా ఓ యువకుడు రీల్‌ కోసం చేసిన ఘటన వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఓ వ్యక్తి తన బైక్‌పై పెట్రోల్ పోసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఈ నెల 28 న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారి ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లింది.

Viral-Video

ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌ వద్ద తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌లోని పెట్రోల్‌ నింపిన తర్వాత.. అంతటితో ఆగకుండా బైక్‌పై పెట్రోల్‌ చల్లడం మొదలుపెట్టాడు. అలా పెట్రోల్‌ చల్లడాన్ని అతని స్నేహితులు వీడియో తీశారు. సోషల్ మీడియా కోసం రీల్ చేసేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ వీడియో ఉత్తరప్రదేశ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ రైడర్‌, అతని స్నేహితుడు, పెట్రోల్ పంప్‌లో పనిచేసే సాల్మన్‌తో సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వారి ఫొటోలతో సహా ట్వీట్‌ చేశారు.

Viral-Video

ఈ కథలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. వీరు బైక్‌పై పెట్రోల్‌ చల్లిన అనంతరం మరో ఘటకు పాల్పడ్డారు. క్లాసిక్ 350 మడ్‌గార్డ్‌పై అతని స్నేహితుడు కూర్చొని ఉండగా ఆ వ్యక్తి పబ్లిక్‌ రోడ్డుపై బైక్‌ నడుపుతూ ప్రమాదకర విన్యాసాలకు పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

పెట్రోల్‌తో ఇటువంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది డీజిల్ ఇంధనంలా కాకుండా చాలా వేగంగా మంటలను వ్యాప్తి చేస్తుంది. వేడి ఇంజిన్‌తో తాకినప్పుడు పెట్రోల్ ఆవిరై మంటలను అంటుకుంటుంది. కానీ ఈ ఘటనలో అలాంటిదేమీ జరగకపోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది.

Viral-Video

కొన్ని వైరల్‌ వీడియోలు ఆసక్తికరంగా, సరదాగా అనిపించినా మరికొన్ని వీడియోలు ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తాయి. వీడియో చేస్తూ రహదారి నియమాలను ఉల్లంఘించినప్పుడు వారితో పాటు ఇతర వాహనాదారులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ చలాన్ విధానం ద్వారా ఈ వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారికి జరిమానా విధిస్తున్నారు.

అంతేకాకుండా గత వేసవిలోనూ పలు రాష్ట్రాల్లో వింత చేష్టలకు పాల్పడ్డారు కొందరు యువతీయువకులు. వేసవి తాపాన్ని తెలియజేసేందుకు బండిపై వెళ్తూ బకెట్‌తో నీళ్లు పోసుకోవడం, స్నానం చేయడం లాంటివి చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో లక్షల వ్యూస్‌ సంపాదించుకున్నాయి.

పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధం. అలా పట్టుబడితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీడియోలు లేదా సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చినప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. సీసీ కెమెరాల సాయంతో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల ద్వారా ఉల్లంఘనలను గుర్తించి, జరిమానాలు వాటంతట అవే జారీ అవుతాయి. అయితే, కొన్ని ఆన్‌లైన్ చలాన్‌లు తప్పుగా లేదా తప్పుడు నంబర్ ప్లేట్ల కారణంగా పొరపాటుగా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 31, 2023, 15:37 [IST]
English summary
Man sprays petrol on royal enfield classic 350 arrested and bike seized video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+