తండ్రి కళ్ళలో ఆనందం చూడటానికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్.. మీరు చూసెయ్యండి
సాధారణంగా తల్లిదండ్రులే తమ పిల్లలకు బహుమతులు ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అయితే పిల్లలు తమ తల్లితండ్రులకు గిఫ్ట్ ఇస్తే.. ఆ సమయంలో వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. ఇటీవల అలాంటి ఒక సంఘటనే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా తెలియదు, కానీ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తండ్రి ఒక గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అతనికి ఒక బైక్ కీస్ కనిపిస్తుంది. ఆ తరువాత అతని కొడుకు అతన్ని బయటకు తీసుకు వస్తాడు. గేటు బయట తనకు ఒక కొత్త స్టైలిష్ బైక్ కనిపిస్తుంది.

ఆ బైక్ తన కోసమే అని తెలుసుకుని అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆ తండ్రి ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు ఆ సన్నివేశాన్ని చూడవచ్చు. ఈ వీడియో @usidbodypro ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. నిజానికి ఒక సారి ఆ తండ్రి షోరూమ్‌కి వెళ్ళినప్పుడు ఆ బైక్ ఆయనకు చాలా ఇష్టమని చెబుతాడు. అయితే ఆ సమయంలో ఆ బైక్ కొనుగోలుచేయలేకపోయారు.
ఆ బైక్ తన తండ్రికి ఇష్టమని తెలుసుకున్న కొడుకు ఆ బైక్ తండ్రి కోసం తీసుకురావాలనుకుంటాడు. అయితే ఒక సంవత్సరం తరువాత తన తండ్రికి ఇష్టమైన బైక్ కొనుగోలు చేయగలిగాడు. తన తండ్రి గతంలో ఇలాంటి పాత వెర్షన్ బైక్ నడిపేవాడు. మొత్తానికి తన తండ్రి కలను ఆ కొడుకు నిజం చేసాడు. నా తండ్రి కలను నిజం చేసే శక్తిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆ కొడుకు సంబరపడిపోయారు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికీ మూడు లక్షలకు పైగా లైక్స్ పొందింది. ఈ వీడియో చూసిన చాలామంది ఆ కొడుకుని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో కనిపించే బైక్ జావా కంపెనీకి చెందిన జావా42 బైక్ అని స్పష్టంగా తెలుస్తోంది. జావా కంపెనీ యొక్క జావా 42 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ బైక్. ఈ బైక్ చూడటానికి మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.
జావా ఫోర్టీ టూ బైక్ 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 27 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్ సిస్టం అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి, కావున బైక్ రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
జావా 42 బార్-ఎండ్ మిర్రర్లతో లభిస్తుంది. రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విస్తృత మరియు సౌకర్యవంతమైన సీట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో రీడిజైన్ చేయబడిన సైడ్ స్టాండ్, ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ కి మంచి అట్రాక్టివ్ లుక్ తీసుకువస్తాయి. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
తల్లిదండ్రులు బైకులు, కార్లు గిఫ్ట్స్ గా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా మంది తమ తల్లిదండ్రులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు గిఫ్ట్స్ గా అందించారు. ఆ కథనాలను కూడా మనం గతంలో చదువుకున్నాము. మీరు కూడా మీ తల్లితండ్రులకు బైకులు లేదా కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చి ఉంటే ఆ సంఘటనలను మాతో పంచుకోండి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








