బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. అంటే మద్యం తాగి డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేయడం మరియు మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటివి.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడమే చట్ట రీత్యా నేరం, అలాంటిది ఒక బైకర్ బైక్ పై వెల్తూ ఏకంగా సీరియల్ చూస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

సాధారణంగా సీరియల్ అంటేనే మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఒక టీవీ ప్రోగ్రాం అని తెలుసు. చాలా మంది మహిళలు ఈ సీరియల్ కి బానిసలైపోయారని కొన్ని నివేదికల ద్వారా కూడా తెలిసింది. మహిళలు మాత్రమే కాదు కొంత మంది పురుషులు కూడా ఈ టీవీ సీరియల్స్ చూడటం అలవాటుగా మార్చుకున్నారు.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువయ్యింది. ఇక్కడ బయటపడిన ఒక వీడియోలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సీరియల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించబడింది.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

నివేదికల ప్రకారం తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తి ఈ విధమైన చర్యకు పాల్పడ్డారు. అతను తన ద్విచక్ర వాహనం నడుపుతూ సీరియల్ కూడా చూశాడు. బైక్ లో మొబైల్ పెట్టుకోవడానికి అనుకూలమైన స్టాండ్స్ ఇప్పుడు విరివిగా అందుబాటులో ఉన్నాయి. దీని సహాయంతో ఇతడు సీరియల్ చూస్తూ బైక్ నడిపాడు.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

సాధారణంగా ఇలాంటి మొబైల్ స్టాండ్ జొమాటో, స్విగ్గి వంటి డెలివరీ బాయ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి మొబైల్ స్టాండ్ దాదాపు అందరూ చూసి ఉంటారు. ఈ సంఘటన కోయంబత్తూర్ గాంధీపురం ఫ్లైఓవర్ వద్ద జరిగినట్లు భావిస్తున్నారు. అటుగా వచ్చిన మరో వాహనదారుడు ఈ ఘటనను వీడియో తీశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో వైరల్ అవుతోంది. కోయంబత్తూర్ పోలీసులు కూడా ఈ వీడియోను చూశారు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్‌లో సీరియల్ చూడటం ప్రమాదానికి దారితీస్తుంది, కాబట్టి సంబంధిత వ్యక్తి కోసం గాలించి పట్టుకున్నారు. సీరియల్ చూస్తూ బైక్ నడిపిన వ్యక్తి పేరు ముత్తుసామి అని దర్యాప్తులో తేలింది.

బైక్‌పై వెళ్తూ సీరియల్ చూస్తున్న వ్యక్తి [వీడియో]

ఇటువంటి చర్యకు పాల్పడిన అతనికి పోలీసులు 1,200 రూపాయలు జరిమానా విధించారు. నిజానికి ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొనడం ప్రమాదకరం. ఇది రోడ్డు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్‌లో వీడియోలను చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటే, అది మీకు మాత్రమే కాదు రోడ్డుపై వున్న ఇతరులకు కూడా ప్రమాదాన్ని తెస్తుంది. కావున చిన్న నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని తప్పకుండా గుర్తుంచుకోండి.

Source: Dinamalar

Most Read Articles

English summary
Man Watching Serial While Riding A Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X