హెల్మెట్ అంటే ఇలా కూడా ఉంటుందా.. తలకు వాటర్ పైప్ ధరించి డేంజరస్ డ్రైవింగ్, వైరల్ అవుతున్న వీడియో
భారత్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపితే రూ. వందల్లో చలాన్లు విధిస్తుంటారు మన ట్రాఫిక్ పోలీసులు. అయితే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది రోడ్లపై పోలీసులకు కనపడకుండా తప్పించుకు తిరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అందరికంటే డిఫరెంట్.
సాధారణంగా టూ వీలర్లపై వెళ్లేటప్పుడు రైడర్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. లేదంటే చలాన్ తప్పదు. రోడ్డు ప్రమాదాల బారిన పడితే తలకు గాయాలు కాకుండా కాపాడుకునేందుకు హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ దీనిని చాలా మంది సీరియస్‌గా తీసుకోరు. స్టైల్ కోసం లేదంటే రోడ్లపై విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం తలకు హెల్మెట్ ధరించరు.

కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్‌పై మరో వ్యక్తితో కలిసి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాడు. అతను హెల్మెట్ ధరించాడా అంటే పెట్టుకున్నాడనే చెప్పవచ్చు. కానీ ట్విస్ట్ ఏమిటంటే అతను పెట్టుకున్నది మనం రెగ్యులర్‌గా చూసే హెల్మెట్ కాదు. వాటర్ పైప్(Water Pipe Helmet)ను తలకు తగిలించుకుని ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతని వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ బారి నుంచి తప్పించుకునేందుకు ఇలా వాటర్ పైప్ ధరించినట్లుగా తెలుస్తోంది. కానీ ఇది కూడా ప్రమాదకరం, చట్టవిరుద్ధం అని అతనికి తెలియకపోవడం బాధాకరం.

ఏదేమైనా మన దేశంలో క్రియేటివిటీకి కొదవలేదు అనడానికి ఇదో పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎందుకంటే ఇప్పటికే ఇలా వినూత్న తరహాలో చాలా మంది రోడ్లపై పిచ్చి చేష్టలకు పాల్పడుతూ వైరల్ అయ్యేందుకు యత్నిస్తుంటారు. చివరికి పోలీసులకు చిక్కుతుంటారు. పబ్లిక్ రోడ్లపై బైక్‌పై స్టంట్స్ చేయడం, రొమాన్స్, ప్రమాదకర రీతిలో డ్రైవింగ్ ఇలాంటి ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
కాగా రోడ్డుపై భారీ ట్రాఫిక్‌లో ఇతను వాటర్ పైప్ ధరించి బైక్ నడపడాన్ని చూడవచ్చు. హెల్మెట్ లేకపోవడంతో ఈ వ్యక్తి ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. వాటర్ పైప్.. అతని తల, ముఖం, మెడను కప్పివేస్తుంది. అతను రోడ్డు చూడటానికి వీలుగా వాటర్ పైప్‌కు మరో రంధ్రం సహాయపడుతుంది.

కానీ రోడ్డుపై అతను ప్రయాణిస్తున్న తీరును చూస్తుంటే ఇది చాలా ప్రమాదకరమైన డ్రైవింగ్‌గా అనిపిస్తోంది. బైక్‌పై వెనుక కూర్చున్న సహాయంతో రోడ్డు దాటగలుగుతున్నాడు. కొంచెం అదుపుతప్పినా.. రోడ్డుపై ఇతర వాహనదారులను ఢీకొట్టే ప్రమాదం ఉంది. దీని ద్వారా అతనితో ఉన్న వ్యక్తితో పాటు రోడ్డుపై ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తుంది. ఈ వీడియో చూసి మీరు షాక్ అవ్వడం ఖాయం.
ఇతని ప్రవర్తన ద్వారా రోడ్డుపై చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రత దృష్ట్యా ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమనిబంధనలను పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. రోడ్డుపై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








