చేతులు లేకపోతేనేం.. డ్రైవింగ్‌ లెసెన్స్‌ సాధించాడు.. కాళ్లతోనే డ్రైవింగ్‌.. ఎలా అంటే.??

మన దేశంలో డ్రైవింగ్‌ లెసెన్స్(Driving License) కావాలంటే చాలా రూల్స్‌ పాటించాలి. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీ చేస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే స్టోరీ మాత్రం దానికి కొంచెం విభిన్నం. ఈ యువకుడికి చేతులు లేవు.. అయినా డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంపాదించారు. అదెలా సాధ్యం అంటే..

రెండు చేతులు పోగొట్టుకున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించారా అని మీకు షాక్ అవ్వొచ్చు. కానీ ఇది నిజం. చేతులు లేకపోయినా కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ యువకుడు నిరూపించారు. కాగా కొందరు కాళ్లు, చేతులు లేకపోయినా.. టాలెంట్‌ ద్వారా తమకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న వారిని చూశాం. ఆ కోవలోకి చెందిన వ్యక్తి కె.థాన్సేన్‌..

Driving-License-To-Handicapped-Man

తమిళనాడు చెన్నైకి చెందిన కె.థాన్సేన్‌(31)(Driving License To Handicapped).. డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చిన్నతనంలోనే విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రెండు చేతులు కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే థాన్సేన్‌ న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో తన చిరకాల స్వప్నమైన డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా సాధించారు.

ఉత్తర చెన్నై RTO ద్వారా థాన్సేన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేశారు. ఇందుకోసం థాన్సేన్‌ ముందుగా ప్రభుత్వ వైద్యుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సంపాదించారు. దీని ఆధారంగా అతనికి లైసెన్స్‌ మంజూరైంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన థాన్సేన్‌.. అతనిలాగే వికలాంగులు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా డ్రైవింగ్ చేయాలని చెబుతుంటారు.

Driving-License-To-Handicapped-Man

వారికి పెద్దగా ఇబ్బంది కలగకుండా అర్హతను పరీక్షించి లైసెన్సు మంజూరు చేయాలని అధికారులను కోరుతున్నారు. కాగా మొదటిసారిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత, థాన్సేన్‌ తన కుటుంబంతో కలిసి పెరంపూర్‌లోని ఆలయాన్ని సందర్శించారు. అతను సమీప ప్రాంతాలకు మాత్రమే కాకుండా ఎక్కువ దూరాలకు కూడా ప్రయాణించడం విశేషం.

అయితే థాన్సేన్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్‌ చేయడానికి అనుకూలంగా కారులో ప్రత్యేక మార్పులు చేశారు. ముఖ్యంగా హారన్, ఇండికేటర్, వైపర్ తదితర వాటిని సులభంగా ఆపరేట్ చేసేలా ఏర్పాటు చేశారు. అలాగే, దీని కోసం కంట్రోల్ స్విచ్‌లు చాలా సులభంగా అందించారు. ఇంకా అన్ని స్విచ్‌లు హ్యాండ్‌బ్రేక్ దగ్గర అమర్చారు. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కారు కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా థాన్సేన్‌ కారు నడపగలరు.

Driving-License-To-Handicapped-Man

కారు నడిపేటప్పుడు థాన్సేన్‌.. యాక్సిలరేటర్ మరియు బ్రేక్‌లను నియంత్రించడానికి ఒక కాలును మరియు స్టీరింగ్ వీల్‌ను నియంత్రించడానికి మరొక కాలును ఉపయోగిస్తారు. అలాగే, కారు డ్రైవింగ్ చేసిన తర్వాత బైక్ నడపడమే తన తదుపరి లక్ష్యమని థాన్సేన్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు.

కాబట్టి త్వరలోనే బైక్ రైడ్ లైసెన్స్ కూడా పొందుతానని థాన్సేన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మన దేశంలో వికలాంగులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం ఇదే మొదటిసారి కాదని చెప్పవచ్చు. ఇటీవలే కేరళకు చెందిన ఓ వికలాంగ యువతి కారు డ్రైవింగ్ లైసెన్స్ పొంది అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Driving-License-To-Handicapped-Man

కేరళకు చెందిన జిలుమోల్ థామస్ పుట్టుకతోనే చేతులు లేకుండా జన్మించింది. గతేడాది డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొంది చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. ఇందుకోసం ఆమె ఏళ్ల తరబడి పోరాటం చేసింది. దాదాపు ఐదేళ్ల కృషి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు సమాచారం. జిలుమోల్ థామస్ ఉపయోగించిన సెలెరియో కారును కూడా ఆమెకు అనుకూలంగా మార్చారు.

More from DriveSpark

Article Published On: Saturday, May 4, 2024, 12:53 [IST]
English summary
Man without hands got car driving license he drives with legs inspiration story
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+