19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమై చాలా రోజులయ్యింది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో చాలా మంది కొనుగోలుదారులు ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలతో సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి బౌన్స్ కంపెనీ యొక్క 'ఇన్ఫినిటీ ఈ1 ఈ-స్కూటర్‌' తో ప్రపంచంలో ఎత్తైన రహదారులలో ఒకటైన ఖర్దుంగ్-లాగా చేరుకున్నాడు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

మంగళూరు ప్రాంతానికి చెందిన మోటార్‌సైకిలిస్ట్ మరియు వీడియో వ్లాగర్ 'గిరీష్' బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ తో K2K చేరుకోవాలని నిర్చయించుకున్నాడు. ఇక్కడ K2K అంటే 'కన్యాకుమారి నుంచి కాశ్మీర్' వరకు అని అర్థం. తన ప్రయాణాన్ని భారతదేశానికి దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ప్రారంభించి ఉత్తరాన ఉన్న కాశ్మీర్ చేరుకుని ఒక అరుదైన రికార్డ్ సృష్టించాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

గిరీష్ తన లాంగ్ రైడింగ్ కి బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంచుకున్నాడు. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. గిరీష్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 'రూబీ' అని పేరు పెట్టాడు. మొత్తం తన రైడ్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేరుకోవడానికి 19 రోజులు సమయం పట్టింది. ఇందులో ఎన్నో అద్భుతమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

తన లాంగ్ రైడింగ్ లో కేవలం రైడింగ్ మరియు ఛార్జింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడమే కాకూండా.. వాతావరణ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అద్భుతమైన హ్యాండ్లింగ్, సస్పెన్షన్ మరియు రైడ్ రైడింగ్ పొజిషన్ వంటి వాటికి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకూలంగా ఉంది, కావున దీనిని ఎంచుకోవడం జరిగిందని గిరీష్ తెలిపాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

గిరీష్ తన బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 5 స్వాపబుల్ బ్యాటరీలను ఉపయోగించారు. ఎందుకంటే ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన 70 కిమీ పరిధిని అందిస్తుంది. కావున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణించడానికి తప్పకుండా 5 బ్యాటరీలు చాలా అవసరం. ప్రతి రోజు గిరీష్ వివిధ వాతావరణ పరిస్థితుల్లో 250 కిమీ ప్రయాణం సాగించాడు. అయితే రాత్రి సమయంలో ఆ బ్యాటరీలు ఛార్జింగ్ వేసుకునే వాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

ఈ విధంగా గిరీష్ మొత్తం 11 రాష్ట్రాల మీదుగా మొత్తం 19 రోజులు 4,340 కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ప్రయాణాన్ని 2022 జూన్ 18 న ప్రారంభించి 2022 జూలై 6 కి ముగించాడు. మొత్తం తన ప్రయాణంలో 83 సార్లు బ్యాటరీ మార్పిడులు జరిగాయి. మొత్తం మీద భారతదేశంలో ఎత్తైన మోటార్ రహదారిని చేరుకుని కొత్త రికార్డ్ బద్దలు కొట్టాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

గిరీష్ ఈ కొత్త రికార్డ్ సాధించడానికి చాలా ప్రదేశాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫ్ రోడింగ్ చేయాల్సి వచ్చింది. రాళ్లు కలిగిన రోడ్లపైన మరియు ఇసుక ప్రాంతాల్లో సైతం ప్రయాణించాల్సి వచ్చిందని, కార్గిల్ నుండి లేహ్‌కు వెళుతున్నప్పుడు ఇసుక తుఫాను వంటి వాటిలో చిక్కుకున్నట్లు తెలిపాడు. అయితే ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో తన 'రూబీ' (బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1) ఎలాంటి ఆటంకం కలిగించలేదని చెప్పాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఇంత గొప్ప రికార్డ్ సాధించడం వల్ల తప్పకుండా 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చేరగలనని ఆశిస్తున్నాను. దీనికోసం 2022 జులై 25 న ధరఖాస్తు (అప్లై) చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ధృవీకరణ మరియు నిర్ధారణ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని గిరీష్ తెలిపాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

నిజానికి గిరీష్ కేవలం వీడియా వ్లాగర్ మాత్రమే కాదు, మోటార్‌సైకిలిస్ట్ కూడా. ఇతడు ఐదు సంవత్సరాల క్రితం 'వీకెండ్ ఆన్ వీల్స్' అనే ట్యాగ్‌తో వీడియోలు చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 'నెవర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్' సిరీస్‌లో క్లాసిక్ బైకుల గురించి చెబుతూ.. తన బైక్ రైడింగ్ మరియు హై ఎండ్ బైక్‌ల రివ్యూలు కూడా చేసేవాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

2021 గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్ లో పాల్గొన్నాడు, అయితే 2021 చివరి భాగంలో గుండె పోటుతో వాటన్నిటికీ దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత మళ్ళీ రైడింగ్ చేయగలనా.. లేదా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తన రూబీతో కలిసి భారతదేశంలో ఎత్తైన రహదారిని చేరుకోగలిగినట్లు తెలిపాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

K2K రైడ్ తర్వాత గిరీష్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు మరియు సుఖాలు తప్పకుండా ఉంటాయి. 2021 లో గుండెపోటు రావడం వల్ల నా జీవితం నన్ను ఎంతగానో దెబ్బతీసింది. ఆ తరువాత ఇక రైడింగ్ చేయలేనని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ అరుదైన రికార్డ్ సాధించడం వల్ల మళ్ళీ నాలో పూర్వపు ఆశలు మొలకెత్తాయి. ఆశయం ఉండి మనసు పెట్టి శరీరానికి శిక్షణ ఇస్తే ఏదైనా సాధించవచ్చని తెలిపాడు.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్:

గిరీష్ ఇంత గొప్ప రికార్డ్ సాధించడానికి సహకరించిన బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది గత సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అదే సమయంలో ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అరుదైన రికార్డ్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు యాంటిథెఫ్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయగల ఇన్ఫినిటీ స్మార్ట్ అప్లికేషన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇటీవల కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ చేయడానికి శ్రీకారం చుట్టింది.

Most Read Articles

English summary
Mangalore bike rider completes arduous k2k journey on bounce infinity e scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X