Celebrity Electric Cars ఈ సెలబ్రిటీలు ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారో తెలుసా.. ?
బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందికి కార్లంటే చాలా క్రేజీ. వారి కార్ల కలెక్షన్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది. అనేక లగ్జరీ కార్లను బాలీవుడ్ సెలబ్రిటీలు కలిగి ఉన్నారు. అయితే అనేక మంది సెలబ్రిటీలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం సెలబ్రిటీలో ట్రెండ్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు.
నటి రేఖ : ప్రముఖ నటి రేఖ BMW i7 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.2.03 కోట్లుగా ఉంది. నటి రేఖ కొనుగోలు చేసిన వాహనం ఆక్సైడ్ గ్రే మెటాలిక్ రంగుల్లో ఉంటుంది. ఈ వాహనం డ్యూయల్ స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీట్లు, మసాజ్ సీట్లు, బోవర్స్ మరియు విల్కిన్స్ డైమండ్ ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

షారుఖ్ ఖాన్ : భారత్‌లో హ్యుందాయ్ సంస్థకు ఎప్పటి నుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీంతో హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారును బహుమతిగా అందించింది. ఈ కారు ధర రూ.45.95 లక్షలుగా ఉంది. ఈ కారు హ్యందాయ్ గ్రూప్ యొక్క ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫాం ఆధారంగా తయారుచేశారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ : ఈ నటి BMW 5 సిరీస్ నుంచి బీఎండబ్ల్యూ i7 ఎలక్ట్రిక్ లగ్జరీ అప్‌గ్రేడ్ అయ్యారు. ఈ కారు ధర రూ.2.03 కోట్లుగా ఉంది. ఈ వాహనం డ్యూయల్ స్క్రీన్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మసాజింగ్ సీట్లు, వెనుక సీటు వద్ద థియేటర్ స్క్రీన్, బోవర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కిమ్ శర్మ : టాటా నానో కలిగి ఉన్న నటి కిమ్ శర్మ ఇటీవల బీఎండబ్ల్యూ i7 కారును కొనుగోలు చేశారు. ఈ కారు మినరల్ మెటాలిక్ కలర్‌ను కలిగి ఉంది.
మందిరా బేడీ : బాలీవుడ్ నటి మందిరా బేడీ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. టాటా నెక్సాన్ MR వేరియంట్ 30kWh మరియు LR వేరియంట్‌లో 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. జెన్ 2 మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.
సుష్రత్ బరుచా : ఆ బాలీవుడ్ నటి బీఎండబ్ల్యూ iX XDrive40 మోడల్‌ను కలిగి ఉన్నారు. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు 76.6kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.1.21 కోట్లు (ఎక్స్‌షోరూం) గా ఉంది.

రితీష్ దేశ్‌ముఖ్ : నుష్రత్ బరుచా కంటే నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఈ బీఎండబ్ల్యూ iX కారును కొనుగోలు చేశారు. రెడ్ మెటాలిక్ రంగును ఎంచుకున్నారు. రితేష్ సతీమణి జెనీలియా అమెరికాలో ఇంట్లో టెస్లా మోడల్ xని కలిగి ఉన్నారు.
సునీల్ శెట్టి : బాలీవుడ్ నటుల్లో సునీల్ శెట్టికి కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతని గ్యారేజీలో అనేక కార్లను కలిగి ఉన్నారు. తాజాగా తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ ఈవీని కొనుగోలు చేశాడు. 2 డోర్ ఆప్షన్‌లో అందుబాటులో ఈ వాహనం నలుగురు ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.98 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








