Toyota Fortuner సెలబ్రిటీల ఫేవరెట్... ఎవరెవరి దగ్గర ఈ కార్లు ఉన్నాయో తెలుసా?

భారత మార్కెట్‌లో టయోటా ఫార్చ్యునర్‌ SUVకు (Toyota Fortuner) ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అనేక మంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టయోటా ఫార్చ్యునర్‌ SUV కారును కలిగి ఉన్నారు. అయితే ఏయే సెలబ్రిటీలు ఈ కారు కలిగి ఉన్నారు. ఈ SUV ప్రత్యేకత వంటి వివరాలతో పూర్తి కథనం మీ కోసం.

భారత్ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో టయోటా ఫార్చ్యునర్‌ SUV ప్రారంభ ధర రూ.33.43 ( ఎక్స్‌షోరూం ) గా ఉంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.51.44 లక్షలుగా ( ఎక్స్‌షోరూం ) ఉంది. సినిమా నటుల నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులు సైతం ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

aamir-khan-toyota-fortuner

నటుడు అమీర్‌ ఖాన్‌ : బాలీవుడ్‌ ప్రముఖ నటుల్లో అమీర్‌ఖాన్‌ ఒకరు. ఈ నటుడు సిల్వర్‌ కలర్‌ టయోటా ఫార్చ్యునర్‌ SUVని కలిగి ఉన్నాడు. ఈ కారుతో పాటు టయోటా వెల్‌ఫైర్‌ లగ్జరీ MPV కూడా అమీర్‌ఖాన్ వద్ద ఉంది. మరో ప్రముఖ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కూడా టయోటా ఫార్చ్యునర్‌ కారును కొనుగోలు చేశాడు. తెలుపు రంగులోని టైప్‌-2 SUVను కలిగి ఉన్నారు.

నటి మృణాల్‌ ఠాకూర్ : ప్రముఖ నటి మృణాల్‌ ఠాకూర్‌ నలుపు రంగు టైప్‌ 3 టయోటా ఫార్చ్యునర్‌ SUVను కలిగి ఉన్నారు. మరో ప్రముఖ నటి నేహా ధూపియా టైప్‌-2 ఫార్చ్యునర్‌ను కలిగి ఉన్నారు. ఈ నటి తన వాహనంలో ప్రయాణించడం అనేకసార్లు కంటపడ్డారు. నటి అమీషా పటేల్‌ కూడా ఈ టయోటా ఫార్చ్యూనర్‌ SUVను కలిగి ఉన్నారు.

 mrunal-thakur-toyota-fortuner

టైప్‌ 2 టయోటా ఫార్చ్యూనర్‌ : బాలీవుడ్‌ ప్రముఖ నటి బిపాసా బసు టైప్‌ 2 టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాన్ని కలిగి ఉన్నారు. ఈ నటి తెలుపు రంగు కారును కలిగి ఉన్నారు. ప్రముఖ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్ కూడా ఫార్చ్యునర్‌ లెజెండర్‌ను కలిగి ఉన్నారు. దీంతోపాటు బీఎండబ్ల్యూ iX ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కూడా ఉంది. అమెరికాలో టెస్లా ఎలక్ట్రిక్ కారును కలిగి ఉన్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ : బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ బ్లాక్ కలర్ టయోటా ఫార్చ్యూనర్‌ లెజెండర్‌ను కలిగి ఉన్నారు. ఈ SUV కోసం 6969 నంబర్‌ ప్లేట్‌ను కలిగి ఉన్నారు. రణ్‌వీర్‌ వద్ద ఈ ఫార్చ్యూనర్‌తోపాటు లంబోర్ఘిని ఉరస్‌ పెర్ల్‌ క్యాప్సూల్ ఎడిషన్‌, మెర్సిడెస్‌ మేబ్యాక్‌ GLS 600 వంటి లగ్జరీ SUVలను కలిగి ఉన్నాడు.

 ameesha-patel-toyota-fortuner

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, January 1, 2024, 18:20 [IST]
English summary
Many celebrities owned toyota fortuner cars photos gone viral
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+