పోర్షే పనామెరా జిటిఎస్ కారును డిజైన్ చేయనున్న షరపోవా

By Ravi

పోర్షే కార్ బ్రాండ్‌కు ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్) అయిన రష్యన్ టెన్నిస్ దిగ్గజం 'మరియా షరపోవా' ఇప్పుడు ఓ సరికొత్త పోర్షే కారును డిజైన్ చేయబోతోంది. ఓ విశిష్టమైన పోర్షే పనామెరా కారును డిజైన్ చేసేందుకు కంపెనీ ఆమెకు అనుమతి ఇచ్చింది.

ఈ స్పెషల్ పోర్షే ఒకే ఒక్క కారుగా ఉంటుంది. దీనిని షరపోవా స్వస్థలం అయిన సోచిలో ఆవిష్కరించనున్నారు. ఇందుకు వేదికగా ఈ ఏడాది జరగనున్న ఒలంపింక్స్‌ను ఎంచుకున్నారు. పోర్షే ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్‌కు చెందిన వివిధ ఫీచర్లతో మరియా షరపోవా ఈ స్పెషల్ పోర్షే కారును మరింత స్పెషల్‌గా డిజైన్ చేయనుంది.

ఈ స్పెషల్ ఫీచర్లలో.. బ్లాక్డ్-అవుట్ ఎల్ఈడి హెడ్‌లైట్స్, టింటెడ్ ఎల్ఈడి రియర్ లైట్స్, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క బ్లాక్ టెయిల్‌‌పైప్ కవర్స్, 20-ఇంచ్ పనామెరా స్పోర్ట్స్ అల్లాయ్ వీల్స్ (బ్లాక్ కలర్) వంటి ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన డిజైన్ ఫీచర్లు. ఈ స్పెషల్ పోర్షే పనామెరా కారు వైట్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది.

Maria Sharapova Designs Porsche Panamera GTS

ఈ స్పెషల్ పోర్షే పనామెరా ఇంటీరియర్స్ విషయానికి వస్తే, క్రీమ్ కలర్ స్టిచింగ్‌తో కూడిన లెథర్ అప్‌హోలెస్ట్రీ, కార్బన్ డోర్ సిల్ గార్డ్స్ మరియు వాటిపై మరియా షరపోవా అనే లెటర్స్ ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ డయల్స్ మరియు వెహికల్ కీని బాడీ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటాయి.

అలాగే, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ రెస్ట్స్ పోర్షే క్రెస్ట్‌తో ఎంబోస్ చేయబడి ఉంటాయి. ఆర్మ్‌రెస్ట్ లపై పోర్షే పనామెరా జిటిఎస్ లోగో ఉంటుంది. ఇక ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో వి8, 4.8 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 440 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 288 కి.మీ.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/BAsPQpxy8UI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, February 17, 2014, 10:48 [IST]
English summary
Maria Sharapova, the Russian tennis ace is the new brand ambassador of Porsche. The German car manufacturer will be allowing her to design a one off Panamera. The Porsche will have an individual look and will be unveiled to the Russian, in her hometown Sochi. The venue for this years winter Olympics.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+