ఏం టాలెంట్‌ గురూ.. ఓపెన్‌ టాప్‌ మారుతి 800.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

విదేశాల్లో కార్లకు సవరణలు అనేది సర్వసాధారణం. వాహనదారులు తమ అభిరుచికి అనుగుణంగా తమ వాహనాలను మాడిఫై చేయిస్తుంటారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు కార్ల మాడిఫికేషన్లను ఉదాహరణగా చూడవచ్చు. అయితే ఇలా కార్ల సవరణకు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మన దేశంలోనూ అలాంటి ఫారిన్ కార్ మాడిఫికేషన్‌లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాడిఫై చేసిన వాహనాలకు అనుమతి లేదు. ఒకవేళ మీ అభిరుచికి అనుగుణంగా వాహనాలకు మార్పులు చేసినా వాటిని మీ ఇంట్లో మాత్రమే ఉంచుకోవాలి. వాటికి పబ్లిక్ రోడ్లపైకి అనుమతి లేదు. కొన్ని దేశాల్లో ఇది చట్టం అయితే మరికొన్ని దేశాల్లో వీటికి పబ్లిక్ రోడ్లపై అనుమతి ఉంది.

Maruti-Suzuki-800

అలా పలు దేశాల్లో తరచూ మాడిఫైడ్ వాహనాలను చూస్తుంటాం. మన దేశంలో వీటి విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల ఇలా వాహనదారులు తమ కార్లను మార్పులు చేయిస్తున్నారు. ఇటీవల అందుకు సంబంధించి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

భారత్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి టాప్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టైప్ 2 మారుతి 800 కారును ఓపెన్ టాప్‌గా మార్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అద్వైత్‌ ఎక్స్‌ పిలానీ'(@adwaitxpilani) అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ కారు ఢిల్లీ NCR లోని ఫరీదాబాద్ ప్రాంతంలో కనిపించిందని వీడియో కింద తెలిపారు.

Maruti-Suzuki-800

సిల్వర్‌ కలర్‌ 800 పైకప్పు ఓపెన్‌గా ఉండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దాని B-పిల్లర్ మరియు D-పిల్లర్ కనెక్షన్ కట్ చేశారు. ఇందులో ఆఫ్టర్‌మార్కెట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. 'ఫరీదాబాద్‌ కే ఇంజినీర్స్‌' అంటూ క్యాప్షన్‌ జత చేసి ఫన్నీ ఎమోజీలతో ఇన్‌స్టాగ్రామర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షల మందికి పైగా వీక్షించారు. 50 వేలకు పైగా లైకులను సంపాదించింది.

మారుతి సుజుకి అందించే కన్వర్టిబుల్ ఓపెన్ టాప్ మోడల్స్‌ను మనం లగ్జరీ కార్లు, టాప్‌ ఎండ్‌ కార్లలో మాత్రమే చూస్తాం. అవి చాలా ఖరీదైనవి. అందుకే ఈ వీడియోలోని అతి చవకైన కారును రీమోడల్‌ చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ప్రస్తుతం టైప్ 2 మారుతి సుజుకి 800 అత్యంత చౌకైన కారుగా ఉంది. కాగా మార్కెట్‌లోకి వచ్చిన 31 ఏళ్ల తర్వాత 2014 లో ఈ కారు ఉత్పత్తిని నిలిపివేశారు.

Maruti-Suzuki-800

కాగా భారతదేశంలో ఏదైనా కారు పైకప్పును తీసివేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. కంపెనీలు అందించిన వాహనం యొక్క నిర్దిష్ట డిజైన్ మరియు బిల్డ్‌ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చకూడదు. అంతేకాకుండా, కారు పైకప్పును ఇలా తీసివేయడం వాహనం నిర్మాణ తీరుపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.

ఇలాంటి వాహనంలో ప్రయాణించేవారికి మరియు ఇతర వాహనదారులకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ వీడియోలోని టాప్ కట్ 800 మనకు ఫన్నీగా చూడటానికి ఆకర్షణీయమైన లుక్‌తో కనిపించవచ్చు. కానీ ఇది చట్టవిరుద్ధం కాబట్టి దీనిని ప్రోత్సహించకూడదు. అయితే ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందించారు.

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 16:21 [IST]
English summary
Maruti 800 modified into open top car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+