మారుతి సుజుకి ఆల్టోలో సెల్ఫ్‌ డ్రైవింగ్ టెక్నాలజీ.. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా నియంత్రణ.. వైరల్‌ అవుతున్న వీడియో..!

మారుతి సుజుకి ఆల్టో భారత్‌ ఆటోమొబైల్‌ (Maruti Suzuki Alto) మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. బడ్జెట్ కార్లను ఇష్టపడే వారికి ఇది ఇష్టమైన కారుగా ఉంది. మరియు ఈ కారు ధర సహా నిర్వహణ కూడా తక్కువగా ఉంటుంది. మారుతి ఆల్టో అధిక మైలేజీని అందిస్తుంది. తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ఈ కారులో అవసరమైన ఫీచర్లను మాత్రమే జోడించారు.

అయితే ప్రస్తుతం ADAS ఫీచర్‌తో నడుస్తున్న ఆల్టో కారు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌తో మారుతి ఆల్టో కారుని నియంత్రిస్తున్న విషయాన్ని గమనించవచ్చు. రెడ్‌మీ నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కారును నియంత్రిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే కేవలం ఖరీదైన కార్లలో మాత్రమే అందుబాటులో ఉండే ADAS ఫీచర్‌ ఆల్టోలో ఎలా పనిచేసింది. ఈ వీడియోను మన్‌కరణ్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

maruti suzuki alto modified with adas self driving

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారుగా మారుతి ఆల్టో..! : కేరళకు చెందిన ఓ యువకుడు టయోటా ఇన్నోవా కారును డ్రైవర్‌ లెస్‌గా కారుగా మార్చాడు. టెస్ట్‌ రన్‌ కూడా నిర్వహించగా.. ప్రస్తుతం ఆల్టో సెల్ఫ్‌ డ్రైవింగ్ టెక్నాలజీ కారు వీడియో వైరల్‌గా మారింది. ఫ్లోడ్రైవ్‌ వ్యవస్థాపకుడు మన్‌కరణ్‌ సింగ్‌ ఈ మారుతి ఆల్టోలో మార్పులు చేశాడు. ఇందుకోసం ఓపెన్‌ పైలట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాడు.

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా నియంత్రణ : ఇదే సాఫ్ట్‌వేర్‌ను రెడ్‌మీ నోట్‌ 9 ప్రో హ్యాండ్‌సెట్‌లో ఇన్‌స్టాల్‌ చేశాడు. దీన్ని OBD పోర్టు ద్వారా ఆల్టోకు కనెక్ట్ చేయబడింది. ఫోన్ కెమెరాలు ఈ సాఫ్ట్‌వేర్‌కు కళ్లుగా పనిచేస్తాయి. మరియు ఆల్టోను సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనంగా మార్చేందుకు ఎలక్ట్రికల్‌ అసిస్టెడ్‌ స్టీరింగ్‌ను అమర్చాడు. దీంతోపాటు అమర్చిన కొన్నిసెన్సార్లు డైనమిక్‌ విజన్‌ సామర్థ్యం ద్వారా రహదారిని పర్యవేక్షిస్తాయి.

maruti suzuki alto car

టెస్ట్‌ డ్రైవింగ్‌కు అనుమతి ఉందా : మన్‌కరణ్‌ పోస్టు చేసిన వీడియో ఆధారంగా ఈ కారు లేన్‌ను అనుసరిస్తూ ప్రయాణం చేస్తోంది. ఇతర వాహనాలను ఢీకొనకుండా సవ్యంగా డ్రైవింగ్‌ చేస్తోంది. అయితే ఏదైనా వాహనాన్ని పబ్లిక్ రోడ్లపై నడిపేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. అయితే అధికారుల నుంచి సరైన అనుమతి లేకుండా ప్రోటోటైప్‌ టెక్నాలజీని పరీక్షించడం చ‌ట్టవిరుద్ధం.

భారత్‌కు ఈ టెక్నాలజీ మంచిదేనా : ప్రస్తుతం భారత ప్రభుత్వం కార్ల తయారీదారులను సెల్ఫ్‌ డ్రైవింగ్ టెక్నాలజీని అనుసరించమని ప్రోత్సహంచడం లేదు. ఇది డ్రైవర్ల ఉపాధికి గణనీయమైన రీతిలో నష్టం చేకూరుస్తుంది. అయితే మానవ వనరులు అధికంగా ఉన్న దేశంలో ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్ టెక్నాలజీ మంచిది కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

maruti suzuki alto

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 3, 2024, 12:45 [IST]
English summary
Maruti alto gets adas self driving technology feature how it works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+