కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

ప్రపంచం వ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. మన దేశంలో ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో ఎంతో మంది మరణిస్తున్నారు. లెక్కకుమించిన జనాభా అంగవైకల్యం భారిన పడుతున్నారు. మనం నిత్య జీవితంలో మనదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను రోజూ చూస్తూనే ఉన్నాము.

ఇదే రీతిలో ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం సింగల్ లైన్ రోడ్డులో జరిగినట్లు మనం ఇక్కడ చూడవచ్చు.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

దేశంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడం. ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో జరిగిన ప్రమాదం ఓవర్ టేక్ చేయడం వల్ల జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

ఈ వీడియో 'కేరళ సెల్ఫ్ బిజినెస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ముంచు వెళ్తున్న ఒక కారు వెనుక నుంచి తీసినట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. నివేదికల ప్రకారం ఈ వీడియో కేరళలో జరిగినట్లు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని రహదారులు సింగిల్ లేన్ రోడ్లు.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

ఈ సంఘటనను రికార్డ్ చేసిన వాహనం చివరకు ముందుకు వెళ్లిపోయింది. ఈ వీడియోలో రెడ్ కలర్ హ్యాచ్‌బ్యాక్ వెనుక ఒక ట్రక్ ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎదురుగా ఒక ఆటో రిక్షా కూడా వేగంగా వస్తోంది. రోడ్డు అంత వెడల్పుగా లేకపోవడం వల్ల ట్రక్ డ్రైవర్ పక్కకు తిప్పాడు.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

ఈ విధంగా చేసేటప్పుడు ట్రక్ డ్రైవర్ కి ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయలేమని అర్ధమయ్యింది. కానీ ఇక్కడ నివేదికల ప్రకారం ట్రక్కు యొక్క వేగం గంటకు 30 కిమీ నుంచి 35 కిమీ వరకు ఉంటుందని తెలిసింది. రెడ్ హ్యాచ్‌బ్యాక్‌ను అధిగమించలేనని ట్రక్ డ్రైవర్ భావించినప్పుడు, అతను వెనక్కి తగ్గాడు.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

ట్రక్కు డ్రైవర్ ఈ విధంగా కొంత వేగాన్ని తగ్గించిన సమయంలో, ట్రక్కు ముందు భాగం కారు యొక్క వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఆ ట్రక్ ఆగిపోయే ముందు రెడ్ మారుతి సుజుకి ఆల్టోను చాలా దూరం ముందుకు నెట్టుకుంటూ వెళ్ళింది. అదే సమయంలో ముందు వస్తున్న ఒక ట్రక్ కూడా ఆ మారుతి ఆల్టో ముందు బంపర్‌ను తాకింది. ఆ ట్రక్కు తాకినా వేగానికి కారు యొక్క ముందు బంపర్ కూడా ఎగిరిపోయింది.

ఇక్కడ మారుతి ఆల్టో యొక్క డ్రైవర్ కి ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయం గురించి స్పష్టంగా తెలియదు. అయితే కారు మాత్రం ఎక్కువగా దెబ్బతినింది. దీనికి సంబంధించిన మొత్తం సమాచారం ఈ వీడియోలో చూడవచ్చు.

కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ప్రమాదంలో భారీగా దెబ్బతిన్న హ్యాచ్‌బ్యాక్

భారతదేశంలోని అనేక సింగిల్-లేన్ రోడ్లపై ఓవర్ టేక్ చేయడం నిషిద్ధం. కానీ వాహనదారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. సింగిల్ లైన్ రోడ్డులో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లేకుంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Maruti Alto Hatchback Nearly Saved From Two Trucks During Overtaking. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X