వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

భారతదేశంలో ఇటీవల వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ముంబై, కలకత్తా వంటి రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతాల్లో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల జరిగే నష్టాలను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షాల వల్ల వాహనదారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

గుంతలు ఉన్న రోడ్లపై వాహనదారులు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంతే కాకుండా వర్షం అధికంగా కురవడం వల్ల వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వరదల ఉదృతి కారంగా పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయిన చాలా సంఘటనలు ఇదివరకటి కథనాల్లో ఎన్నో చూసాము. అయితే వరదల్లో తన కారు కొట్టుకుపోకూడదని తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ఒక కొత్త విధానాన్ని అమలు చేసాడు. ఈ విధానం ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంటోంది.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

నివేదికల ప్రకారం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భర్తీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. రోడ్లు మాత్రమే కాకుండా సిరిసిల్ల పట్టణంలోని చాలా కాలనీలు కూడా నీటితో నిండిపోయాయి. వరద నీరు ఎక్కువైన కారణంగా వస్తువులు మాత్రమే కాకుండా, వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

వరద ఎక్కువైన కారణంగా పట్టణ ప్రజలు తమ తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తన కారు వరదలో కొట్టుకుపోకుండా, తన ఇంటి ముందు ఉన్న కారుని తాళ్లతో కట్టేశాడు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో ఇప్పుడు సోషల్ ,మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

నివేదికల ప్రకారం ఇక్కడ కనిపించే కారు మారుతి కంపెనీకి చెందిన ఆల్టోగా గుర్తించబడింది. సాధారణంగా ఎవరైనా తాము పెంచుకునే కుక్కపిల్లకు మరియు ఇతర పెంపుడు జంతువులకు తాళ్లను కట్టి ఉండటం గమనించి ఉంటాము, కానీ ఇక్కడ కారుకి తాళ్లకు కట్టి ఉంచడం వల్ల ఇది చాలా వైరల్ అయ్యింది. ఈ ఒక్క ఫొటోతో సిరిసిల్ల ప్రాతంలో అధిక వర్షం సమయంలో అక్కడ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లతే మారుతి ఆల్టో కారు చుట్టూ వర్షపు నీరు ప్రవహించడాన్ని చూడవచ్చు. ఈ ప్రాంతంలో వరద నీరు ఒక సాధారణ సంఘటనగా మారిపోయింది. ఇంతకు ముందు వర్షపు నీటి తాకిడికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆల్టో కారు యజమాని తన కారును తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా కాపాడాడు.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

తెలంగాణ వ్యక్తి చేసిన ఈ చర్య కారును కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అయితే ఈ వర్షపు నీటి వల్ల కారు కొట్టుకుపోకుండా ఆపవచ్చు కానీ, నీటి తాకిడికి కారులో ఏదైనా ఎలక్ట్రానిక్స్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కారులో ఎటువంటి నష్టం జరిగినప్పటికీ, ఈ వరదలో కొట్టుకుపోకుండా మాత్రం ఉంటుంది.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువ వరదలు సంభవించే ప్రాంతాల్లో కారులోని ఎలక్ట్రిక్ వస్తువులు చెడిపోకుండా ఉండాలంటే, వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత బ్యాటరీ కనెక్షన్‌లను తీసివేయాలి. టెర్మినల్స్ డిస్కనెక్ట్ చేయడం ద్వారా అనవసరమైన షార్ట్ సర్క్యూట్లను నిరోధించవచ్చు. అంతే కాకుండా వర్షపు నీరు ఉన్న సమయంలో కారుని ఎట్టిపరిస్థితుల్లో స్టార్ట్ చేయడానికి పూనుకోకూడదు. దీని వల్ల అనేక నష్టాలు జరగవచ్చు.

భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వాహనాలు సురక్షితంగా ఉండాలంటే, సురక్షితమైన మరియు వర్షంలో తడిసిపోకుండా ఉండే చోట పార్క్ చేసి ఉంచాలి. అంతే కాకుండా అధిక కరెంట్ ఉన్న ప్రాంతాల్లో కారు అకస్మాత్తుగా నిలిచిపోతే వెంటనే కారును వదిలివేయడం ఉత్తమం. ఇది వాహనదారుల ప్రాణాలను కాపాడుతుంది.

వరదనీటిలో కారు కొట్టుకుపోకుండా తెలంగాణ వ్యక్తి కొత్త ఐడియా.. మీరే చూడండి

మారుతి యొక్క ఆల్టో కారు విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇది 37 సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఆ తర్వాత 2010 వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఇది కీర్తి పొందింది. 2010 తర్వాత ఈ కారుని నిలిపివేసినప్పటికీ దీని ఆధారంగా కొత్త అవతారాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ కంపెనీ ఈ మోడల్‌ను మారుతి ఆల్టో పేరుతో అమ్మడం కొనసాగిస్తోంది మరియు ప్రతి నెల దాని అమ్మకాలు బాగా కొనసాగుతున్నాయి.

Note: ఇక్కడ ఉపయోగించిన చివరి చిత్రం కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Maruti alto tied to avoid getting washed by flood
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X