జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!!

ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, పరిమితికి మించి అతివేగంతో నడపడం, రోడ్డుపై స్టంట్లు చేయడం ఇలా పలు కారణాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలను అవలంభింపజేస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు పాదచారుల(Pedestrians) కోసం ప్రత్యేకంగా జీబ్రాక్రాసింగ్ ఎన్నో ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మీరు రోడ్డుపై జీబ్రాక్రాసింగ్(Zebra Crossing) చూడవచ్చు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు జీబ్రా క్రాసింగ్ వచ్చినప్పుడు పాదచారులు రోడ్డు దాటేందుకు స్లోగా వెళ్లడం లేదా.. ఆపడం లాంటివి చేయాలి.

Zebra-Crossing-Accident

అయితే ఈ నిబంధనను ఇప్పుడు చాలా మంది వాహనదారులు పాటించడం లేదు. వాహనం ఆపకపోవడం కాదు కదా.. పాదచారులు రోడ్డు దాటేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. రద్దీగా ఉండే రోడ్డుపై జీబ్రా క్రాసింగ్ ఉన్నా పాదచారులు రోడ్డు దాటేందుకు చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే తాజాగా జరిగిన ఓ ఘటనను చూస్తే జీబ్రా క్రాసింగ్ నిబంధనను చాలా మంది మరిచిపోయినట్లుగానే మీరు అనుకోవడంలో తప్పు లేదు.

ఇటీవల కేరళ(Kerala Road Accident)లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఓ రెండు లేన్ల రహదారిపై వాహనాలు వెళ్తున్నాయి. ఈ రోడ్డుపై ఓ చోట పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్ ఉంది. ఈ క్రమంలో కొందరు రోడ్డు దాటేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఏ వాహనం కూడా జీబ్రా క్రాసింగ్ వద్ద ఆపడం లేదా స్లోగా వెళ్లడం చేయట్లేదు.

Zebra-Crossing-Accident

దీంతో పాదచారులు అలాగే నిల్చుని ఉన్నారు. ఇది గమనించిన మారుతి సుజుకి సెలెరియో(Maruti Suzuki Celerio) డ్రైవర్.. పాదచారులు వెళ్లేందుకు జీబ్రా క్రాసింగ్ వద్ద కారును కొంచెం స్లో చేస్తూ ఆపాడు. వెనుక నుంచి వస్తున్న ట్రక్కు డ్రైవర్ ఇది గమనించి కారు వెనకాలే ట్రక్కును నిలిపారు. అయితే ఇక్కడే అనుకోని ట్విస్ట్ ఎదురైంది. పాదచారులు రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా ఇది గమనించని ఓ బస్సు డ్రైవర్.. ట్రక్కును ఢీకొన్నాడు.

దీంతో ట్రక్కు కారును ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పాదచారులు ఎవరూ రోడ్డు దాటకపోవడంతో అక్కడ పెద్ద ప్రమాదం తప్పింది. ట్రక్ ప్రభావంతో మారుతి సుజుకి సెలెరియో కొంచెం ముందుకు కదిలింది. అయితే ఘటనలో ఎంతమేరకు నష్టం జరిగిందనే సమాచారం అందుబాటులో లేదు.

Zebra-Crossing-Accident

ట్రక్కు ఆగిన తర్వాత, పక్కన వేచి ఉన్న పాదచారులు రోడ్డు దాటడం ప్రారంభించారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు సంభవించలేదు. అయితే, దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు దేశంలో జరగడం సర్వసాధారణమైపోయింది. జీబ్రా క్రాసింగ్‌ల కోసం వాహనదారులు ఆగకపోవడం భారతదేశంలో ప్రబలంగా ఉన్న సమస్య. అయితే పాదచారులు కూడా దీనికి అలవాటు పడిపోయారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 14:14 [IST]
English summary
Maruti car stops at zebra crossing to let pedestrians pass but it gets hit by vehicles coming behind
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+