ఆ చిత్రంలో 'మారుతి' పేరు కోసం భారీ మొత్తం చెల్లింపు!

By Ravi

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'మేరే డాడ్ కి మారుతి'లో మారుతి అనే పేరును ఉపయోగించినందుకు గాను, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ మొత్తాన్ని సమర్పించుకుంది. యష్ రాజ్ ఫిలింస్‌కు చెందిన 'వై-ఫిల్మ్స్' నిర్మాత ఆశిష్ పాటిల్ తొలుత ఈ సినిమాకు 'మేరే డాడి కి గాడి' అనే పేరును అనుకున్నారు. అయితే, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా వచ్చిన మొత్తాలతో సినిమాలను తీయాలని ఆయన అనుకునే వాడట. ఇలా సినిమాలు తీయటం వలన, నిర్మాతలు సేఫ్‌గా ఉండొచ్చనేది ఆయన అభిప్రాయం.

ఇందులో భాగంగా, ఈ సినిమా పేరులో 'గాడి' స్థానంలో ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ పేరును చేర్చాలని పాటిల్ అనుకున్నారు. అంతే, వెంటనే పలు ఆటోమొబైల్ సంస్థలను ఆయన సంప్రదించాడు. దాదాపు ఆరు కంపెనీలు ఆ పేరు కోసం పోటీపడ్డాయి. ఇందులో మారుతి సుజుకి అత్యధికంగా బిడ్ పలికింది. దీంతో మేరే డాడ్ కి గాడిని మేరే డాడ్ కి మారుతి అని మార్చారు.

ఈ సినిమా తీయటానికైన మొత్తం బడ్జెట్ రూ.10 కోట్లు. ఇందులో మారుతి సుజుకి, సోనీ టివి సంస్థలు రూ.8 కోట్ల బడ్జెట్‌ను భరించాయి. సోనీ టివి శాటిలైట్ రైట్స్ కోసం డబ్బును చెల్లించగా, మారుతి సుజుకి తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం చెల్లించింది. ఈ మొత్తంలో మారుతి సుజుకిదే అధిక వాటా. ఈ సినిమా మొత్త ఓ కారుతో ముడిపడి ఉంటుంది. అందుకే, మారుతి సుజుకి ఈ సినిమాను తమ కార్లను ప్రమోట్ చేసేందుకు ప్లాట్‌ఫామ్‌గా ఎంచుకుంది. ఈ చిత్రంలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఉపయోగించారు.

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి

మేరే డాడ్ కి మారుతి


మారుతి సుజుకి మార్కెటింగ్ తెలివితేటలతో అతి తక్కువ బడ్జెట్‌లో తమ బ్రాండ్‌ పట్ల బహళ ప్రచారాన్ని సంపాధించుకుంది. ఇక 'మేరే డాడ్ కి మారుతి' చిత్రం విషయానికి వస్తే, ఇందులో హీరో తన తండ్రి మారుతి ఎర్టిగా కారును దొంగతనంగా ఎత్తుకెళ్లిపోయి కాలేజ్ అమ్మాయిని లైన్‌లో పెట్టేందుకు పడే పాట్లు, ఇది తెలిసి తండ్రి పెట్టే చివాట్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి.

ఛంఢీఘడ్‌లో జరిగే ఓ పంజాబీ పెల్లి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. ఇందులో కథానాయకుడు సాక్విబ్ సలీమ్ (ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే సినిమా హీరో) ఓ కాలేజ్ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు తండ్రి కొనుగోలు చేసిన ఓ సరికొత్త మారుతి బ్రాండ్ కారును దొంగిలించి, ఆ తర్వాత డ్రైవింగ్‌లో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనే దానిపై సినిమా సాగుతుంది. మొత్తమ్మీద ఈ సినిమాతో మారుతి సుజుకి ఎర్టిగా కారుకు ఫ్రీ పబ్లిసిటీ లభించింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2013, 11:33 [IST]
English summary
Maruti Suzuki's latest MPV Ertiga had played a key role in Mere Dad Ki Maruti. The film managed to rope in Rs 8 crore, split between Maruti Suzuki and Sony TV, who bought the satellite rights of the film, covering 80% of the film's Rs 10-crore budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+