ఇది మీ అందరికి బాగా తెలిసిన కారు - గుర్తుపడితే మీరు ఖచ్చితంగా జీనియస్..

మహీంద్రా థార్ ప్రత్యర్థి మారుతి జిమ్నీ గురించి ఆఫ్ రోడింగ్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కనిపించే కారు జిమ్నీ అంటే నమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..

సాధారణంగా మారుతి జిమ్నీ అంటేనే 3 డోర్స్ లేదా 5 డోర్స్ కలిగి ఉంటుందని అందరికి తెలుసు. కానీ ఇక్కడ కనిపించే జిమ్నీ కేవలం రెండు డోర్స్ కలిగి ఉండటమే కాకుండా.. వెనుక పికప్ ట్రక్కు మాదిరిగా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే కొంతమందికి ఇదేదో కొత్త కంపెనీ తయారు చేసిన కారేమో అని బ్రమపడే అవకాశం ఉంది. కానీ అలా బ్రమపడితే మీరు పప్పులో కాలేసినట్టే అవుతుంది.

Maruti Suzuki Jimny Modified To Pick Up Truck

ఇక్కడ కనిపిస్తున్న కారు నిజంగానే మారుతి సుజుకి కంపెనీకి చెందిన జిమ్నీ. అయితే ఆటోమొబైల్ ఔత్సాహికుడు దీనిని చాలా ప్రత్యేకంగా మోడిఫైడ్ చేశారు. ఈ కారణంగానే ఇది జిమ్నీ అంటే నమ్మడానికి కొంత సమయం పడుతుంది. నిజానికి జిమ్నీ కారు రూఫ్ మరియు వెనుక డోర్స్ మొత్తం కట్ చేసి దాన్ని పికప్ ట్రక్కుగా మార్చేశారు. దీంతో ఇది జిమ్నీ పికప్ ట్రక్కుగా మారిపోయింది.

ఈ కారును మోడిఫైడ్ చేసిన వ్యక్తి వెనుక సగం కంటే ఎక్కువ కట్ చేసి.. దాన్ని మొత్తం తనకు నచ్చినట్లు రూపొందించాడు. రూప్ కలర్ కూడా ఇప్పుడు తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు. లోగో కూడా వైట్ కలర్ స్కీమ్ పొందింది. టైర్లు కూడా కంపెనీ అందించిన టైర్లు కాదు. జిమ్నీ యొక్క 3-ఇంచెస్ కాయిల్స్ స్థానంలో 5-ఇంచెస్ కాయిల్స్ అమర్చారు. దీంతో కారు ఎత్తు పెరిగినట్లు ఇక్కడ గమనించవచ్చు.

Maruti Suzuki Jimny Modified To Pick Up Truck

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ కారులో ఇంకా సీట్లు కూడా అమర్చలేదు. కానీ స్టీరింగ్ వీల్, గేర్‌బాక్స్ లాంటివి అలాగే ఉండటం కూడా వీడియోలో చూడవచ్చు. అయితే ఇందులో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(FMSCI) ఆమోదించిన ఆరు పాయింట్ల రోల్ కేజ్ చూడవచ్చు. ఈ నిర్మాణం కలిగి ఉన్న ఏకైక జిమ్నీ ఇదే కావడం గమనార్హం. ఇంటీరియర్‌లో ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం చాలానే ఉంది.

డిజైన్ పరంగా పూర్తిగా కొత్తగా కనిపించే ఈ కారు ఇంజిన్‌లో ఏమైనా మార్పులు చేశారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కారు తయారీకి 36 లక్షలు ఖర్చు పెట్టినట్లు ప్రెజెంటర్ పేర్కొన్నారు. ఇందులో నిజమెంత అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే ఇది సాధారణ జిమ్నీ కంటే కూడా చాలా దృఢంగా ఉన్నట్లు, ఎత్తుగా ఉన్నట్లు చూడగానే స్పష్టంగా కనిపిస్తోంది.

మోడిఫైడ్ కార్లు దేశంలో చట్టబద్దం కాదు..

భారతదేశంలో ప్రతి కంపెనీ ప్రారంభం నుంచి కొన్ని ఖచ్చితమైన నిర్దిష్టలతో ఒక వాహనాన్ని రూపొందిస్తుంది. దీనికి సంబంధిత ప్రభుత్వాల నుంచి కూడా కావలసిన అనుమతులను పొందుతుంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు వాహనాలను తమకు నచ్చినట్లు లేదా ఇష్టానుసారంగా మోడిఫైడ్ చేసుకుంటే అలాంటివి పబ్లిక్ రోడ్డు మీద తిరగటానికి అనుమతించబడవు. నియమాలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని సదరు వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాలి.

నిజానికి ఇక్కడ కనిపించే మోడిఫైడ్ మారుతి జిమ్నీ పూర్తిగా దాని నార్మల్ డిజైన్ కోల్పోయింది. కాబట్టి ఇది ప్రజా రహదారుల మీద తిరగటానికి అనుమతి లేదు. కాబట్టి దీనిని ప్రైవేట్ ప్రదేశాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ కారును మోడిఫైడ్ చేసిన వ్యక్తి కూడా పబ్లిక్ రోడ్డు మీదే దీనిని డ్రైవ్ చేయడానికి తయారు చేయలేదని రాక్ క్రాలింగ్ మరియు పోటీల కోసం రూపొందించినట్లు స్పష్టం చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 6:54 [IST]
English summary
Maruti jimny modified to pick up truck video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+