ఇదేం క్రియేటివిటీ రాజా!.. కారు మొత్తం ఉల్టా చేశాడు.. చక్రాలు పైకి, టాప్ కిందకు తెచ్చి నడిపిస్తున్నాడు!
సోషల్ మీడియాలో ఎన్నో వింతలు చక్కర్లు కొడుతుంటాయి. బైకులను, కార్లను వింతవింతగా మార్చి అలరిస్తుంటారు చాలా మంది. మొన్నామధ్య ఓ వ్యక్తి బైకును ఏటీఎంగా మార్చి వైరల్ అయ్యాడు. నంబర్ కొట్టగానే దాంట్లో నుంచి జ్యూస్, డబ్బులు వచ్చేలా చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కారును ఊహించని రీతిలో మార్చేశాడు. సాధారణంగా ఏ వాహనానికైనా టైర్లు కింద ఉంటాయి. కానీ, ఈ వీడియోలో టైర్లు పైకి తెచ్చి వాహనాన్ని ఉల్టాపల్టా చేశాడు ఓ వ్యక్తి. దాన్ని రోడ్డుపై నడిపిస్తూ చక్కర్లు కొడుతున్నాడు. ఇదేదో గ్రాఫిక్స్ ట్రిక్కు అనుకుంటే పొరపాటే.. ఇది నిజంగా చేసిందే. ఇలా మార్చిన వ్యక్తి ఎవరు? ఈ కారు ఎలా నడుస్తోంది? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
మారుతీ సుజుకీ ఓమినీ.. చాలా మందికి ఫేవరేట్ ఎంపీవీ. ఇలాంటి మల్టీ పర్పస్ వెహికిల్ మారుతీ నుంచి మరోటి రాదనే చెప్పాలి. ఇప్పటికీ కూడా చాలా మంది ఓమినీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. లగేజ్ క్యారియర్‌గా, ఫ్యామిలీ కారుగా ఇది మంచి గుర్తింపు పొందింది. దీన్ని మారుతీ సంస్థ 1984 డిసెంబరులో లాంఛ్ చేసింది. పాపులర్ మారుతీ 800 కారు లాంఛ్ అయిన సరిగ్గా సంవత్సరానికి ఈ ఓమినీ లాంఛ్ అయింది.

అలాంటి ఓమినీ వ్యాన్‌ను ఓ వ్యక్తి తలకిందులుగా చేసి నడిపిస్తున్నాడు. దాని మీద ఉల్టీ కార్ అని కూడా రాశాడు. అయితే ఇది మోడిఫికేషన్ ద్వారా సాధ్యపడింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో artist.bs_yt పేరుతో ఉన్న ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో ఇన్‌స్టాలో వీరలెవెల్లో 'రైడ్' చేస్తోంది. దీన్ని చూసి నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయి, తర్వాత దీంట్లోని ట్రిక్కు అర్థమై, ఈ మోడిఫికేషన్ చేసిన వ్యక్తి టాలెంట్‌కు మురిసిపోతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను చాలా మంది లైక్ కొట్టి, షేర్ చేస్తున్నారు. ఈ మోడిఫికేషన్ చేసిన వ్యక్తిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ఏం క్రియేటివిటీ బ్రో" అని ఒకరంటే.. "నీ ట్యాలెంట్ ముందు సినిమా వాళ్లు కూడా సాటిరారు" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అలా ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

ఈ ఓమినీ కారు సినిమాల్లో కూడా బాగా ఫేమస్సే! విలన్లు ఈ కారులో కనిపించి ప్రేక్షకులను భయపెట్టేవారు. ఇక చిన్న పిల్లలకైతే ఈ కారు చూస్తేనే భయమేస్తుంది. దీన్ని కిడ్నాప్ కారుగా భ్రమించి భయపడుతారు. అయినా కూడా ఈ కారు అనేక రకాలుగా వినియోగదారుల అవసరాలను తీరుస్తూ వారికి చేరువైంది.
మారుతీ 800లో ఉపయోగించిన ఇంజిన్‌తోనే ఈ ఓమినీని లాంఛ్ చేశారు. ఇది 796 సీసీతో, ఇన్ లైన్ త్రీ- సిలిండర్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 38 bhp పవర్, 62 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మొదట ఈ ఓమినీని వ్యాన్ అని మాత్రమే పిలిచేవారు కానీ, తర్వాత 1988లో దీనికి ఓమినీ అని నామకరణం చేశారు.

1998లో ఈ ఓమినీకి కొన్ని కాస్మెటిక్ ఛేంజెస్ తీసుకువచ్చింది మారుతీ సుజుకీ సంస్థ. ఈ మైక్రో వ్యానులో 8 మంది వరకు ప్రయాణించవచ్చు. 8- సీటర్ సెగ్మెంట్‌లో ఇది మంచి అందుబాటు ధరలో ఉండే వాహనంగా చెప్పవచ్చు. దీని ధర రూ.2.88 లక్షలుగా ఉండేది. ఈ ఓమినీ కారు వినియోగదారులకు బాగా చేరువైంది. ఇది అంబులెన్స్‌గాను సేవలందించింది
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








