రివర్స్ గేర్‌లో కొండపైకి మారుతి సుజుకి ఆల్టో కారు.. వీడియో వైరల్
భారత్‌లో అందరూ నచ్చే కార్లలో మారుతి సుజుకి సంస్థ వాహనాలు కచ్చితంగా ఉంటాయి. నాణ్యమైన, మెరుగైన భద్రతా ఫీచర్లు కలిగిన కార్ల విక్రయాలతో మారుతి సుజుకి సంస్థ మంచి స్థానం సంపాదించుకుంది. మారుతి సుజుకికి చెందిన చాలా మోడల్స్ చాలా తక్కువ సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి ఆల్టో కూడా ఉంటుంది.
మారుతి సుజుకి ఆల్టో కారు ఆఫ్ రోడ్ పనితీరుకు సంబంధించిన ఓ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్టో కారు బేస్ వేరియంట్ రివర్స్ గేర్‌లో ప్రయాణిస్తున్న వీడియోను వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 3.9 లక్షల మంది లైక్ చేశారు.

ఈ వీడియోను పూర్తిగా గమనిస్తే కొండపైకి వెళ్లే రోడ్డు అంతా బురదగా ఉంది. తొలుత మారుతి సుజుకి ఆల్టో డ్రైవర్ కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే బురద కారణంగా కారు ట్రాక్షన్ కోల్పోవడాన్ని గుర్తించాడు. మారుతి ఆల్టో కారు సామర్థ్యాన్ని పూర్తిగా తెలిసిన డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు.
సురక్షితంగా కొండపైకి ఎక్కేందుకు కారును తొలుత యూ టర్న్ తీసుకున్నాడు. అనంతరం రివర్స్ గేర్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ సులువుగా కొండను ఎక్కేశాడు. మారుతి సుజుకి ఆల్టోలో ఉన్న ఓ ప్రత్యేకతే ఇందుకు కారణం. ఆల్టో కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఇంజిన్, ఫ్రంట్ ఆక్యుపెంట్ ముందు టైర్లను ఎక్కువ ట్రాక్షన్‌ను అందిస్తాయి.
దీంతోపాటు సింగిల్ రివర్స్ గేర్‌లో ఎత్తుపైకి ఎక్కేటప్పుడు మారుతి సుజుకి ఆల్టో ఇంజిన్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఆల్టో కారు ఆఫ్ రోడ్‌లో మంచి ప్రదర్శన కనబరచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సార్లు మంచి పనితీరును కనబరిచింది. కొన్ని ప్రాంతాల్లో ఫోర్ వీల్ డ్రైవ్ డ్రైవ్ SUVల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆల్టో కారుకు అత్యధికంగా విక్రయాలు ఉన్నాయి. అయినా కూడా మారుతి సుజుకి సంస్థ ఆల్టో కార్ల ఉత్పత్తిని నిలిపి వేసింది. 2023 ఏప్రిల్ 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చిన BS6 ఫేజ్ 2 నిబంధనలే ఈ నిర్ణయానికి కారణం. మారుతి సుజుకి ఆల్టో 796cc 3 సిలిండర్ 47 PS పెట్రోల్ ఇంజిన్ మరియు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది.
ఆల్టో k10 ఎస్ సీఎన్‌జీ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. CNG వెర్షన్‌లో VXi వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ప్రాథమిక ఆడియో సిస్టమ్, FM, Aux వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్, ఫ్రంట్ విండోస్ అడ్జస్టబుల్ ORVMలు, రూఫ్ యాంటెనా సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
భద్రత పరంగా మారుతి సుజుకి ఆల్టో K10 S-CNG.. ఇంజన్ ఇమ్మొబిలైజర్, EBDతో కూడిన ABD, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ డోర్ లాకింగ్, వెనుక సీట్ బెల్ట్‌లు, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ సహా మరికొన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








