అందరూ చూస్తుండగానే మారుతీ కారును ఈడ్చుకెళ్ళిన లారీ డ్రైవర్.. కావాలనే చేశాడా? అసలు ఏం జరిగింది..?

భారతదేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. యాక్సిడెంట్ల కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. కొంతమంది అయితే శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమే. ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా కొంత మంది అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. భారీగా ఫైన్‌లను విధిస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ నియమాలను పాటించని వారు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. తొందరగా గమ్యానికి చేరాలనే భావనతో రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారు ఇటీవల రోడ్లపై ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా వెళ్తున్నప్పుడు డ్రైవర్లకు మధ్య తగాదాలు కూడా జరుగుతుంటాయి.

తాజాగా ఇలాంటి ఘటననే గుర్తుచేస్తూ, ఒక కారును లారీ ఈడ్చుకెళ్ళింది. ఆ సమయంలో కారులో ఎవరు లేరు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఒక హైవే రోడ్డులో మారుతీ సుజుకీ బాలెనో కారును ఒక లారీ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్ళింది. దీంతో ఆ కారు ముందు భాగం బాగా దెబ్బతింది.

Baleno Coming Wrong Side It Is Dragged By Lorry

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కూడా లారీ డ్రైవర్‌దే తప్పు అనుకుంటారు. దీన్ని క్షుణ్ణంగా గమనించిట్లయితే, లారీ వెళ్తున్న రూట్ కరెక్ట్‌గానే అనిపిస్తుంది. మారుతీ కారు రాంగ్ రూట్‌లో ప్రయాణించినట్లు కనిపిస్తుంది. కారు డ్రైవర్‌కు బుద్ది చెప్పాలనే లారీ డ్రైవర్ ఇలా చేశాడని తెలుస్తుంది. కరెక్ట్ రూట్‌లో వెళ్తున్న లారీకి ఎదురుగా కారు వచ్చినట్లు ఉంది. ముందుకు వెళ్ళడానికి కారు అడ్డుగా ఉండటంతో కావాలనే దాన్ని ఈడ్చుకెళ్లినట్లుంది.

ఇలా కారును ఈడ్చుకెళ్లడానికి ముందు లారీ, కారు డ్రైవర్లకు మధ్య తీవ్రంగా గొడవ జరిగినట్లు తెలుస్తుంది. లారీనీ ముందుకు తీసుకెళ్లడానికి కారు డ్రైవర్ దారి ఇవ్వకపోవడంతో ఇలా కారును ఈడ్చుకెళ్లారనుకోవచ్చు. కారులో ఎవరూ లేకపోవడం కూడా మనం వీడియోలో చూడవచ్చు. అదృష్టం కొద్ది కారు లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో లక్షల విలువైన మారుతీ కారు ముందు భాగం ఎక్కువగా డ్యామేజ్ అయింది.

Maruti Suzuki Baleno Lorry

యూట్యూబ్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో కచ్చితంగా వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ కొంత సమాచారం ప్రకారం, వీడియోలో చూసిన స్థలాన్ని గమనిస్తే, అహ్మదాబాద్ బరోడా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో జరిగినట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వీడియోను చూసినట్లయితే ఒక్క విషయం బాగా అర్థమవుతుంది.

రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఇక్కడ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండటం వలన ఎలాంటి పెద్ద ప్రమాదం సంభవించలేదు. అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఇక్కడ డ్రైవ్‌స్పార్క్ ఏం చెబుతుందంటే, ఈ ఘటనలో కారు డ్రైవర్‌ది తప్పు అని పేర్కొనడం లేదు.

Maruti Suzuki Baleno Coming Wrong Side

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 18, 2025, 17:00 [IST]
English summary
Maruti suzuki baleno coming wrong side it is dragged by lorry video goes viral
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+