4 నెలల తర్వాత ఆ కారు డెలివరీలు ప్రారంభం.. తొలి కారు ఎవరు తీసుకున్నారంటే..

Maruti Suzuki Fronx కారు డెలివరీలను ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన నూతన కారు ఫ్రాంక్స్‌ను పరిచయం చేసిన మారుతి సుజుకీ.. అదే రోజు నుంచి బుకింగ్స్‌ను పరిచయం చేసింది. కారు ధర సహా డిజైన్‌ మరియు కీలక ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. 4 నెలల తర్వాత కొత్త కార్లను బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు ఫ్రాంక్స్ కార్లను డిలివరీ చేయడం ప్రారంభించింది.

హైదరాబాద్‌లో మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ తొలి కారును జనపతి నాగార్జున అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ కారు బేస్‌ వేరియంట్‌ ధర రూ.7,46,500, మరియు టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర 13,14,000 రూపాయలుగా కంపెనీ నిర్ధారించింది.

Maruti Suzuki Fronx

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌.. మారుతీ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా భావించవచ్చు. పాత మోడల్స్‌తో పోలిస్తే SUV లేదా క్రాస్‌ఓవర్‌లా కనిపించేందుకు ఫ్రాంక్స్‌ మోడల్‌లో చాలా మార్పులు చేశారు. ఫ్రాంక్స్‌ కారు ముందు భాగం మారుతీ సుజుకీ.. కొద్దినెలల క్రితం లాంచ్ చేసిన మిడ్‌లెవల్‌ SUV గ్రాండ్‌విటారా నుంచి ప్రేరణ పొందినట్లు ఉంటుంది. కారు ఎక్సీరియర్‌ కూడా SUV పోలి ఉంటుంది.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ రెండు ఇంజిన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్‌ డ్యూయల్‌ జెట్‌ 4- సిలిండర్‌ నేచురల్ అస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌.. 90 PS మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 5 AMT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మరొకటి మారుతీ బాలెనో RSలో ఉన్న విధంగానే 1.0 లీటర్‌ బూస్టర్‌ జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగి ఉంటుంది.

ఈ రెండు మోడళ్లు BS6 ఇంజిన్లను ప్రమాణాలను కలిగి ఉంటాయి. 1.0 లీటర్‌ 3 సిలెండర్‌ టర్బోఛార్జడ్‌ ఇంజిన్‌.. 100 PS మరియు 147 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 6 స్పీడ్‌ ఆటోమెటిక్‌ గేర్‌ బాక్స్‌ను కలిగి ఉంటుంది.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ స్ల్పిట్ LED లైట్లను కలిగి ఉంటుంది. ముందు గ్రిల్‌పై ఈ డ్యూయల్‌ ఎల్ఈడీ DRLs లైట్లు క్రోమ్‌ బార్‌ తలపిస్తాయి. కారు వెనుక భాగంలో ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వాహనం చుట్టూ కనెక్ట్‌ చేయబడతాయి. ఫ్రాంక్స్‌ కారు ముందు, వెనుక ఫక్స్‌ స్కిడ్‌ ప్లేట్లను కలిగి ఉంది.

ఈ కారు లోపలి భాగం మారుతి బాలెనోను పోలి ఉంటుంది. మరియు 9 అంగుళాల HUD ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, 360 డిగ్రీల కెమెరాలు కలిగి ఉంటాయి.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ క్రాస్‌ఓవర్‌ హ్యాచ్‌బ్యాక్‌ వెనుక భాగంలో 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో రానున్నాయి. మరియు విండ్‌స్క్రీన్‌, కనెక్ట్‌ చేయబడిన LED టైల్‌లైట్‌లను కలిగి ఉంది. దాంతోపాటు ఫ్రాంక్స్‌ నెక్సా సేఫ్టీ టెక్‌తోపాటు క్రాస్ఓవర్‌ హ్యాచ్‌బ్యాక్‌ స్పోర్టింగ్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌, హిల్‌ హాల్డ్‌ అసిస్ట్, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ను రెనాల్ట్‌ కిగర్‌, నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మహీంద్రా XUV300 మరియు టాటా నెక్సాన్‌ వంటి మోడళ్లను లక్ష్యంగా చేసుకొని లాంచ్‌ చేశారు. మారుతి త్వరలో టయోటా ఇన్నోవా హైక్రాస్‌ రీబ్యాడ్జ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. అయితే ఈ SUV శక్తివంతమైన హైబ్రిడ్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో మాత్రమే లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 2, 2023, 17:43 [IST]
English summary
Maruti suzuki fronx has started deliveries in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+