బెంజ్ కారు లాంటిది.. కానీ బెంజ్ కారు కాదు!.. ఇంకేదో చెప్పుకోండి చూద్దాం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో చాలా మంది వాహనాలను తనకు నచ్చినట్లు మోడిఫైడ్ చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి కథనాలు చాలా తెలుసుకున్నప్పటికీ.. మళ్ళీ ఇలాంటి సంఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
గతంలో మహీంద్రా థార్ SUVలను మోడిఫైడ్ చేసుకున్న సంఘనలు చూసాము. ఇప్పుడు మారుతి జిమ్నీ ఓ మెర్సిడెస్ బెంజ్ కారుగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కారును చూడగానే ఒక్కసారిగా ఇది మెర్సిడెస్ బెంజ్ కారేమో అని బ్రమ కలుగుతుంది. కానీ ఇది బెంజ్ కారుగా కనిపించే మారుతి జిమ్నీ కావడం విశేషం. ఎరుపు రంగులో కనిపించే ఈ కారు 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెక్సా డీలర్‌షిప్‌లో ఈ కారును చూపించడంతో వీడియో మొదలవుతుంది. ఇది మారుతి జిమ్నీ యొక్క టాప్ స్పెక్ ఆల్పా వేరియంట్ అని తెలుస్తోంది. ఈ SUV యొక్క మొత్తం ఫ్రంట్ ఎండ్ దిగుమతి చేసుకున్న బాడీ పార్ట్స్ కలిగి ఉంది. ఇందులో గమనించదగ్గ పెద్ద మార్పు మెర్సిడెస్ ఏఎంజీ స్టైల్ ఫ్రంట్ గ్రిల్.
లోగో మాత్రమే కాకుండా.. హెడ్‌లైట్‌లు కూడా నిజమైన జీ-వాగన్‌లో మాదిరిగా అనిపిస్తాయి. ఫ్రంట్ ఫెండర్‌లతో పాటు బోనెట్ కూడా ఎక్కువ మార్పులకు లోనైంది. ఇందులో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ కూడా గమనించవచ్చు. ఇందులో గమనించాల్సిన మరో అంశం రూఫ్ మౌంటెడ్ లైట్స్. ఆఫ్ రోడింగ్ సమయంలో మాత్రమే వీటి ఉపయోగించడానికి సాధ్యమవుతుందని ప్రజెంటర్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్ బార్ ఎలిమెంట్లను బ్రబస్ జీ-వ్యాగన్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఈ SUV 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందింది. కావున ఇది చూడగానే మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ అని అనిపించేట్లు చేస్తుంది. అయితే ఇది ఆఫ్టర్‌మార్కెట్ అల్లాయ్ వీల్స్ అని తెలుస్తోంది. ORVM వంటివి కూడా బెంజ్ కారు మాదిరిగానే ఉన్నాయి. వెనుక వైపు కూడా కొత్త బంపర్, అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, రియర్ స్పాయిలర్ ఉన్నాయి.
అద్భుతమైన డిజైన్ కలిగిన మోడిఫైడ్ జిమ్నీ.. ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ థీమ్ పొందుతుంది. వైట్ లెదర్ సీట్లను ప్రెజెంటర్ చూపించడం వీడియోలో చూడవచ్చు. వెనుక సీట్లు బ్లాక్ అండ్ వైట్ లెదర్ కవర్స్ మరియు హెడ్‌రెస్ట్‌లపై 'బీ' లోగో ఉండటం చూడవచ్చు. స్టీరింగ్ వీల్ మీద బెంజ్ లోగో కనిపిస్తుంది. యాంబియంట్ లైటింగ్, ఆఫ్టర్-మార్కెట్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఇతర మార్పులు ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ కనిపించే మోడిఫైడ్ మారుతి సుజుకి జిమ్నీ కారు యొక్క బయట మరియు లోపలి భాగాలు ఎక్కువ మార్పులకు గురయ్యాయి. అయితే ఇందులోని ఇంజిన్ ఏదైనా మార్పులు పొందిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బహుశా ఇంజిన్లో ఎటువంటి మార్పులు జరగలేదని భావిస్తున్నాము. కావున పర్ఫామెన్స్ పరంగా ఇది జిమ్నీ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇక్కడా గమనించవలసిన మరో విషయం ఏమిటంటే.. భారతదేశంలో మోడిఫైడ్ వెహికల్స్ చట్టరీత్యా నేరం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








