మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి వేటుకి సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రముఖ వ్యక్తులపై కూడా పడుతోంది. ఇటీవల ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ అయిన 'కెనిచి ఆయుకావా' మరోసారి కోవిడ్-19 వైరస్ బారిన పడ్డారు.

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

కెనిచి ఆయుకావా కరోనా పరీక్షల సమయంలో ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కానీ కరోనా ఉన్నట్లు నిర్దారణ అయింది. ప్రస్తుతం యితడు గురుగ్రామ్‌లోని మెదంత హాస్పిటల్ లో చేరాడు. ఇప్పుడు కెనిచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

మారుతి సుజుకి ఇండియా సిఇఒ కెనిచి ఆయుకావా భారతదేశంలో ఒంటరిగా నివసిస్తున్నారు. అతని కుటుంబం మొత్తం జపాన్‌లో ఉంది. చివరిసారి కోవిడ్ 19 సోకినప్పుడు తమకు ఎలాంటి లక్షణాలు లేవని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

MOST READ:హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ మొదట సంక్రమించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కోవిడ్ 19 సోకిన ప్రజలు ఆక్సిజన్ కొరత కారణంగా లెక్కకు మించి చనిపోతున్నారు, చాలా మంది ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. కరోనావైరస్ యొక్క సెకండ్ వేవ్ ఢిల్లీ, మహారాష్ట్ర మరియు ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

ఈ కరోనా కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నాయి. కరోనా వైరస్ దెబ్బకు మనుషులే కాదు ఆటో పరిశ్రమలు కూడా నష్టాల బాటలో పయనించడం మొదలుపెట్టాయి. ఈ కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేశాయి.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

ఇందులో భాగంగానే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కూడా తమ ప్లాంట్‌ను మే 1 నుంచి మే 9 వరకు మూసివేస్తుందని తెలిపింది. అంతే కాకుండా సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ తన ప్రొడక్షన్ యూనిట్‌లో షిఫ్ట్‌ల సంఖ్యను తగ్గించి కేవలం ఒక షిఫ్ట్‌ చేసినట్లు తెలిపింది.

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

ఆటో మొబైల్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్లు మరియు ద్విచక్ర వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వినియోగదారులు వాహనాలను పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తి మెల్లగా సాగుతోంది.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

మారుతి సుజుకి CEO కి మరోసారి కరోనా పాజిటీవ్; వివరాలు

ప్రస్తుతం ఈ సెమీ కండక్టర్ల కొరత భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను ప్రభావితం చేసింది. ఇప్పుడు భారతదేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఆటోమొబైల్ రంగాన్ని మరింత దెబ్బతీసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చాలా కంపెనీలు ఉత్పత్తి నిలిపివేసి ఆక్సిజన్ అందించడానికి పూనుకున్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki MD Kenichi Ayukawa Tests Covid Positive For Second Time. Read in Telugu.
Story first published: Friday, April 30, 2021, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X