ఇలాంటి కారును చూసిందిలేదుగా! క్రియేటివిటీ అంటే ఇదే.. వీడియో చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ఇటీవల కాలంలో కార్లను తమ ఇష్టానికి అనుగుణంగా చిత్రవిచిత్రంగా మార్పులు చేస్తున ఓనర్లు తరుచుగా సోషల్‌మీడియాలో కనిపిస్తున్నారు. డిజిటల్ యుగంలో చిన్న సంఘటన అయిన సరే వెంటనే ప్రపంచం అంతా పాకుతుంది. తాజాగా ఒక కారును విచిత్రంగా ఒక రూపాయి నాణేలతో అతికించారు. ఇప్పుడు దీనీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మారుతీ సుజుకీ డిజైర్ కారు మొత్తాన్ని కూడా 1 రూపాయి నాణేలతో అతికించడంతో ఇది రోడ్డుపై ప్రయాణిస్తే మెరుస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. రాజస్థాన్‌లోని మారుతీ సుజుకీ డిజైర్ కారు ఓనర్ అందరిలాగా కాకుండా కాస్త వెరైటీగా తన కారును అలంకరించాలని సిద్దపడి 1 రూపాయి నాణేలు భారీగా పోగుచేసి దాని బాడీ మొత్తాన్ని కూడా నాణెలతో కప్పేశాడు. టైర్లను మాత్రం మామూలుగా వదిలేశాడు. ఈ కారు ఓనర్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికే ఇలా చేసినట్లు తెలుస్తుంది.

కారు బాడీకి ఇన్ని నాణేలను అతికించడం అంటే సాధారణ విషయం కాదు. దానికి చాలా ఓపిక కావాల్సి ఉంటుంది. నాణేలు దానికి అతుక్కోవడానికి గమ్ లాంటి దాన్ని వాడారు. ఓపికగా ఒకదాని తర్వాత మరో నాణంను వరుస క్రమంలో అమర్చారు. ఇలా చేయడానికి చాలా సమయం పట్టి ఉంటుంది. గతంలో చాలా మంది కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడానికి షోరూమ్‌లలో నాణేల రూపంలో డబ్బులు చెల్లించిన ఘటనలు చాలా ఉన్నాయి.

Swift Dzire car Pasted With One Rupee Coins

అయితే ఈ విచిత్రమైన ఘటనలో కారు ఓనర్ ఏకంగా బాడీని 1 రూపాయి నాణేలను అతికించి ఫేమస్ అవ్వడం విశేషం. డోర్ హ్యాండిల్స్, చక్రాలను మాత్రం సాధారణంగా వదిలి వేశారు. కారుకు 1 రూపాయి నాణేలను అతికించడానికి దాదాపు ఒక లక్ష నాణేలు అవసరం అయినట్లు తెలుస్తుంది. కారు ఎక్స్‌టీరియర్‌లో మాత్రం నాణేలను అతికించలేదు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడానికి చేసిన ప్రయోగం.

రూపాయి నాణేలతో ఉన్నటువంటి మారుతీ సుజుకీ డిజైర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా, దీన్ని చాలా మంది ఇతరులకు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వారికి తోచినట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కొంతమంది అయితే రీల్స్ పేరుతో ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా సోషల్ మీడియాలో కాలంలో సెలబ్రిటీగా మారాలంటే ఇలా ఏదో ఒకటి చేయాల్సిందే.

Maruti Suzuki Swift Dzire car

ఇక మారుతీ సుజుకీ డిజైర్ విషయానికి వస్తే, దీనిని రూ. 6.79 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దేశంలో మధ్యతరగతి వినియోగదారులకు అవసరమయ్యే కార్లను విడుదల చేయడంలో మారుతీ ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో డిజైర్ కారుకు చాలా డిమాండ్ ఉంది. కొత్తగా ఇటీవల విడుదల అయిన డిజైర్ అధునాతన ఫీచర్స్‌తో వచ్చింది. దీని టాప్ వేరియంట్ రూ. 10.14 లక్షల వరకు ఉంటుంది.

2024 డిజైర్ 1.2-లీటర్ 3 సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, CNG పవర్‌ట్రైన్‌తో కూడా కొనుగోలుకు ఉంది. పెట్రోల్ మోడల్ 82 PS పవర్, 112 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTని జత చేశారు. అదే CNGలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే ఉంది.

Swift Dzire car With One Rupee Coins

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2025, 17:13 [IST]
English summary
Maruti suzuki swift dzire car pasted with one rupee coins video goes viral
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+