మారుతి కారుకు రెక్కలొచ్చాయా! ఫిదా చేస్తున్న డిజైన్ (వీడియో)

గతంలో మోడిఫైడ్ వెహికల్స్ గురించి చాలా తెలుసుకున్నాం.. అయితే ఇటీవల ఓ సాధారణ మారుతి కారు లంబోర్ఘిని ఆవతారానికి మారింది. ఈ కారుని మోడిఫైడ్ చేయడానికి కారణం ఏంటి? మోడిఫైడ్ కార్లు దేశంలో చట్టబద్దమేనా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

నిజానికి చాలామంది ఆటోమోటివ్ ఔత్సాహికులు వాహనాలను తమకు నచ్చిన విధంగా మార్చుకుంటూ ఉంటారనే విషయం అందరికీ తెలుసు. దీనికి ప్రధాన కారణం ఇతర సూపర్ కార్ల మీద ఉన్న ఆసక్తే. ఈ క్రమంలో ఒక వ్యక్తి తన కారుకు లంబోర్ఘిని కారులో కనిపించే సిజర్ టైప్ డోర్స్ ఫిక్స్ చేసుకున్నాడు. దీనిని దూరం నుంచి చూస్తే కొందరు ఇది నిజంగా లంబోర్ఘిని కారేమో అని భ్రమపడే అవకాశం ఉంది.

Maruti Suzuki Swift Modified

నిజానికి ఇది మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌. ఈ కారు డోర్స్ రీప్లేస్ చేయడానికి సుమారు రూ. 65000 నుంచి రూ. 70000 మధ్య ఖర్చు అయినట్లు తెలుస్తోంది. హర్యానాలోని గుర్గావ్‌లో ఈ మోడిఫైడ్ మారుతి కారు కనిపించింది. ఇందులో కేవలం డోర్స్ మాత్రమే కాకుండా వెనుక భాగంలో ఉన్న లైట్స్, కారు ప్రత్యేకమైన ఆకర్షణను పొందటానికి చుట్టూ కలర్ రెయిన్‌బో ర్యాప్‌ చుట్టినట్లు తెలుస్తోంది.

కారు చుట్టూ రెయిన్‌బో కలర్స్ కనిపించడం వీడియోలో చూడవచ్చు. ఇందులో ఎగ్జాస్ట్ కూడా మోడిఫైడ్ చేసి ఉండటం చూడవచ్చు. ఈ కారులోని రీప్లేస్ చేయబడిన డోర్స్ కొత్తగా అనిపించినప్పటికీ వీటిని ఉపయోగించడం కొంత కష్టమే, కానీ అలవాటు పడితే సులభమయిపోతుంది. ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి అలవాటు పడాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు పడుతుందని వీడియోలో ప్రెజంటర్ చెబుతున్నారు.

Maruti Suzuki Swift Modified

మారుతి స్విఫ్ట్ కారుని మోడిఫైడ్ చేసుకున్నప్పటి నుంచి చాలా సార్లు సమస్యలను ఎదుర్కొన్నట్లు, పోలీసులు చాలా సార్లు కారుని నిలిపి కారులో మోడిఫికేషన్స్ గురించి అడిగారని, వెహికల్ మోడిఫికేషన్ చట్ట విరుద్ధం కాబట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమని చాలా సార్లు చెప్పారని కారు ఓనర్ చెప్పారు. కారు వేగంగా వెళ్లకపోయినా.. మోడిఫైడ్ చేసిన కారణంగా పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లు అతడు వెల్లడించాడు.

మోడిఫైడ్ కార్లు దేశంలో చట్టబద్దమేనా..

భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ అనేది చట్టబద్దం కాదు, కాబట్టి వాహన వినియోగదారుడు తన అభిరుచికి అనుగుణంగా మోడిఫైడ్ చేసుకుంటే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళా తప్పకుండా వెహికల్ మోడిఫైడ్ చేసుకుని ఉపయోగించుకోవాలంటే.. పబ్లిక్ రోడ్ల మీద తిప్పడం చట్టరీత్యా నేరం. నియమాలను అతిక్రమించి రోడ్డుపైకి వస్తే.. వాహనాన్ని సీజ్ చేయొచ్చు, జరిమానా కూడా విధించబడే అవకాశం ఉంది.

గతంలో వెలుగులోకి వచ్చిన చాలా సంఘటనల్లో వింత వింతగా.. అసలు బ్రాండుకు మోడిఫైడ్ చేసుకున్న వాహనాలకు సంబంధం లేకుండా కనిపించిన వెహికల్స్ కోకోల్లలుగానే ఉన్నాయి. అలాంటివి ప్రజా రహదారుల మీద కనిపిస్తే అధికారులు నిర్దాక్ష్యంగా సీజ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని బైకులతో ఎగ్జాస్ట్ పైపులను ఎక్కువ సౌండ్ వచ్చేలా కొంతమంది మార్చుకుంటున్నారు, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకున్న సంగటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 17, 2024, 21:21 [IST]
English summary
Maruti swift modified with scissor style doors like lamborghini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+