ఇక వారికి మాస్క్ తప్పనిసరి కాదు: హైకోర్టు సంచలన నిర్ణయం.. ఎక్కడో తెలుసా?
కరోనా మహమ్మారి ఇప్పటికి కూడా భారతదేశంలో ఎక్కువగానే విస్తరిస్తూనే ఉంది. దీనిని ఆరికట్టడానికి ప్రభుత్వాలు కూడా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఒకటి తప్పనిసరిగా మాస్క్ ధరించడం. అయితే ఇప్పుడు మాస్క్ ధరించడంపైన హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

హైకోర్టు అందించిన సమాచారం ప్రకారం, ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రకటనను పూర్తిగా రద్దు చేసింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒంటరిగా డ్రైవింగ్ చేసే వారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది. అయితే కరోనా ఇప్పుడు చాలావరకు తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పటికి కూడా ఈ నిబంధన ఎంతవరకు సమంజసం అని కొంతమంది ప్రశ్నించారు. ఈ కారణంగానే ఈ నిర్ణయం కాస్త వెనక్కి తీసుకోవడం జరిగింది. దీనిపైన న్యాయమూర్తులు విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ఈ విషయాన్ని తెలియజేసింది.

తన తల్లితో కలిసి కారులో కూర్చొని కిటికీలు మూసి కాఫీ తాగుతున్నప్పుడు మాస్క్ ధరించనందుకు ఒక వ్యక్తికి చలాన్ విధించిన సంఘటనను ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది పంచుకున్న తర్వాత ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా, ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, ఏప్రిల్ 7, 2021 నాటి హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వును ప్రస్తావించారు, ప్రైవేట్ కారును నడుపుతున్నప్పుడు మాస్క్ ధరించనందుకు చలాన్ విధించాలనే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు ఈ ఉత్తర్వు జారీ చేసింది.

కారులో విండోస్ దించి ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించకపోతే వారికి కూడా ఢిల్లీ ప్రభుత్వం రూ. 2,000 చలాన్ విధిస్తున్నారు. ఇది నిజంగా చాలా అమానుషం అని న్యాయవాదుల బృందం తెలిపింది. కరోనా దాదాపుగా ఇప్పుడు చరమదశలో ఉంది. ఈ సమయంలో మాస్క్ ధరించనందుకు కూడా చలాన్ విధించడం ఏ మాత్రం న్యాయం కాదు.

ప్రైవేట్ వాహనంలో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ ధరించనందుకు చలాన్లు విధించడాన్ని సవాలు చేసిన న్యాయవాదుల నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి 2021 ఆర్డర్ వచ్చింది. COVID-19 నేపథ్యంలో ప్రైవేట్ వాహనంలో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది, అయితే ఇది ఇప్పుడు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

జరిమానా విధించే అధికారం ఉన్న జిల్లా మేజిస్ట్రేట్‌లు ఇతరులకు అధికారాలను ఉపసంహరించుకోలేరని న్యాయవాదులు తమ వాదనలలో వాదించారు. కరోనా మహమ్మారి వ్యాప్త వల్ల కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది ప్రజలు మరణించారు.

కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరినీ సామాజిక దూరం పాటించాలని మరియు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా సమయంలో కఠినంగా అమలులో ఉన్న ఈ నిబంధనలు కరోనా చాలా వరకు తగ్గినా తరువాత కూడా ఏ మాత్రం తగ్గలేదు.

కరోనా సమయంలో నిర్ణయించిన కఠినమైన నిర్ణయాల వల్ల చాలామంది ప్రజలు ఎక్కువ దోపిడీలకు గురయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ కోర్టు కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి మాస్క్ తప్పనిసరి కాదు అని తెలిపింది. కావున ఇప్పుడు ఒంటరి ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదు.

హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు కొంత ఈ దుర్జన్యాల నుంచి విముక్తి పొందుతారు. కావున ఇది ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపైన ఇలాంటి చర్యలకు పోలీసులు కూడా పాల్పడే అవకాశం ఉండదు. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.

కరోనా మహమ్మారి ఇప్పుడు కూడా దేశంలో ఎక్కువగానే విస్తరిస్తూనే ఉంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతోంది. కావున దేశంలో కరోనా మహమ్మారిని పూర్తిగా నివారించడానికి ప్రభుత్వాలు కూడా చాలా శ్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు కరోనా కొంత తగ్గుముఖం పట్టింది.


Click it and Unblock the Notifications








