కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కట్టుదిట్టమైన చర్యలకు అనుకూలంగా ప్రవర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటి పరిస్థితుల్లో సామజిక దూరం ప్రజలకు చాలా అవసరం.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

లాక్ డౌన్ కారణంగా దాదాపు ప్రజలందరూ కచ్చితంగా సామజిక దూరాన్ని పాటించాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మరి భారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన 39 ఏళ్ల పార్థ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ ఒక వాహనాన్ని తయారుచేసాడు. పార్థ టీవీ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి పార్థ ఒక బైక్‌ను నిర్మించాడు. ఈ బైక్ విస్తృతంగా అందరిచేత ఆకర్శించబడింది. దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ సంక్రమణ వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వైరస్ సంక్రమణ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే భయంతో వారు రద్దీ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో తమ 8 సంవత్సరాల కుమార్తెను రద్దీగా ఉండే బస్సులో పంపించడం సరైనది కాదని నిర్ణయించుకున్నాడు.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

పార్థ ఈ విధమైన దానికి తగిన పరిస్కారంగా ఒక కొత్త తరహా బైక్ రూపకల్పన చేశారు. ఈ బైక్‌పై ఉన్న సామాజిక అంతరాన్ని తగ్గించి అతడు తమ కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ బైక్‌ను ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క రెండు సీట్ల మధ్య మీటర్ గ్యాప్ ఉంచారు.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించినప్పుడు, లాక్‌డౌన్ త్వరలో ముగియదని వారు అర్థం చేసుకున్నారు. తమ కుమార్తెను బస్సులో బడికి పంపించకూడదని నిర్ణయించుకున్నప్పుడు అందులోనుంచి పుట్టిన ఆలోచనే ఈ కొత్త సామజిక దూరాన్ని తలపించే బైక్.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

కరోనా లాక్ డౌన్ కారణంగా తన కుమార్తెను బడికి పంపడానికి ఆలస్యం చేయకుండా ఆదా చేసిన డబ్బుతో పాత బైక్ భాగాలను కొనుగోలు చేస్తూ ఈ బైక్ రూపకల్పన ప్రారంభించాడు. ఇది బ్యాటరీల సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్. దీనికి 1.2 మీటర్లు (3.2 అడుగులు) ఇనుప రాడ్ అమర్చారు. ఇది బైక్ యొక్క పొడవును పెంచడం వల్ల సామాజిక దూరం పెరుగుతుంది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత బైక్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 40 కి.మీ.

కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా ఈ బైక్ వైపు చూస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పార్థ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఇటీవల ఒక ఇ-రిక్షా డ్రైవర్ తన రిక్షాలో ప్రయాణీకుల కోసం నాలుగు క్యాబిన్లను తయారుచేశాడు, సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యత పట్ల అందరికి అవగాహన కల్పించారు.

Image Courtesy: Technical Partha

More from DriveSpark

Article Published On: Thursday, May 7, 2020, 10:14 [IST]
English summary
Mechanic builds social distancing motorcycle for daughter. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+