Just In
- 16 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
'లంబోర్ఘిని' గా మారిని మారుతి స్విఫ్ట్.. దానిని ముఖ్యమంత్రికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన మెకానిక్
ప్రపంచ వ్యాప్తంగా లంబోర్ఘిని కార్లకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలుసు. ఈ కార్లు ఎక్కువ ఖరీదైనవి కాబట్టి సెలబ్రటీలు, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కార్లను కొనుగోలుచేయాలని సాధారణ ప్రజలకు కూడా ఉంటుంది.
కానీ ఎక్కువ ధర ఉన్న కారణంగా వెనుకడుగు వేయక తప్పదు. అయితే కొంతమంది తమ నైపుణ్యంతో తక్కువ ధరకు లభించే కార్లను ఖరీదైన కార్లుగా మోడిఫైడ్ చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఒక వ్యక్తి సాధారణ మారుతి సుజుకి కారుని లంబోర్ఘిని కారుగా మార్చి ఒక 'CM'కి గిఫ్ట్ గా ఇచ్చాడు.

నివేదికల ప్రకారం కరీంగంజ్ జిల్లాకి చెందిన ఒక మోటారు మెకానిక్ పాత 'మారుతి స్విఫ్ట్' కారుని ఖరీదైన లంబోర్గినీగా మార్చి అందరి చేత ప్రశంసించబడుతున్నాడు. ఈ కారుని ఆ వ్యక్తి అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' కి గిఫ్ట్ గా ఇచ్చేసాడు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. సాధారణ మెకానిక్ తనకున్న నైపుణ్యంతో సాధారణ కారుని లగ్జరీ కారుగా మార్చి ముఖ్యమంత్రికి ఇవ్వడం సాధారణ విషయం కాదు.
మారుతి స్విఫ్ట్ కారుని లంబోర్ఘినిగా మార్చిన వ్యక్తి పేరు 'నూరుల్ హక్'. యితడు ఆ మోడిఫైడ్ కారుని అస్సాం ముఖ్యమంత్రికి ఇవ్వడానికి గౌహతికి చేరుకున్నారు. కరీంగంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన హక్ ఒక మెకానికి. ఇతనికి ఒకప్పటి నుంచి లంబోర్ఘిని కారుని డ్రైవ్ చేయాలనే కోరిక ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కోసం యితడు రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపాడు.
గతంలో నూరుల్ హక్ దిమాపూర్ లో మోటార్ మెకానిక్ గా పని చేసినట్లు తెలిపాడు, గత సంవత్సరం అతడు ఒక మారుతి స్విఫ్ట్ కారుని లంబోర్గినిగా మార్చాడు. ఆ తరువాత మరో కారుని కూడా లంబోర్ఘిని గా మార్చి అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు. దీనికోసం ఒక పాత మారుతి స్విఫ్ట్ కారును నాలుగు నెలల సమయంలో లంబోర్ఘిని గా మార్చాడు.
గతంలో నురుల్ హక్ రూ. 6.2 లక్షలు ఖర్చు చేసి 'మారుతి స్విఫ్ట్' ను లంబోర్ఘిని స్పోర్ట్స్ కారుగా మార్చాడు. కోవిడ్-19 లాక్ డౌన్ యొక్క మొదటి దశలో అతనికి పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఈ సమయంలో తన పాత మారుతి స్విఫ్ట్ కారు యొక్క ఇంజిన్‌ను అనుకూలీకరించడం ద్వారా ఇటాలియన్ లగ్జరీ కార్ మోడల్ యొక్క తన స్వంత వెర్షన్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.
నురుల్ హక్ ఇప్పటికే రెండు మారుతి స్విఫ్ట్ కార్లను లంబోర్ఘిని సూపర్ కార్లుగా మార్చేశాడు. అయితే రానున్న రోజుల్లో యితడు ఫెరారీ కారుని తయారు చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు చెబుతున్నాడు. దీనికోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున ప్రభుత్వం ఇలాంటి వాటికి తన సహాయం చేస్తే మరిన్ని అద్భుతమైన కార్లను తయారు చేస్తానని చెబుతున్నాడు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఖచ్చితంగా తెలియదు.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో గొప్ప నైపుణ్యం కలిగిం వ్యక్తులు అక్కడక్కడా.. అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటారు. అలాంటి వారికి ప్రభుత్వాలు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. నిజానికి భారతదేశంలో మోటార్ వాహన చట్టం ప్రకారం మోడిఫైడ్ వాహనాలు చట్ట విరుద్ధం, అయితే ప్రభుత్వం ఆదేశించిన నియమాలకు లోబడి ఉండే మోడిఫైడ్-వాహనాలను వినియోగించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతోపాటు కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.