వరదల్లో దెబ్బతిన్న స్కోడా కుషాక్.. కారు రిపేర్‌కు రూ. 16.50 లక్షలు.. ఖంగు తిన్న యజమాని
భారత్‌లో ఇటీవల వరదల కారణంగా వేల సంఖ్యలో కార్లు వరదల్లో చిక్కకున్నాయి. ఇంకా కొన్ని కార్లు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇటీవల వరద ప్రభావం స్థానికులను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఇళ్లతో పాటు కార్లు కూడా నీట మునిగాయి. దీంతో కార్ల యజమానులు రిపేర్ సెంటర్లకు క్యూ కట్టారు.
ఇటీవల చెన్నెలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం వీధులన్నీ వరదలు ముంచెత్తాయి. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూశాం. కాగా వరదలకు గురై చెడిపోయిన కారును మరమ్మతుల కోసం యజమాని గ్యారేజీకి తీసుకెళ్లగా, మెకానిక్ చెప్పిన మాటలు విని యజమాని షాక్‌కు గురయ్యారు.

భారీ వరదలకు గురైన తన స్కోడా కుషాక్(Skoda Kushaq) కారును డీలర్‌షిప్ వద్దకు తీసుకెళ్లగా.. కారును తనిఖీ చేసిన అక్కడి మెకానిక్ కారు రిపేర్ చేసేందుకు దాదాపు రూ.16.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో యజమాని అవాక్కయ్యారు. ఈ డబ్బులు పెడితే కొత్త కారు వస్తుంది కదా అని మీరందరూ ఆశ్చర్యపోయినా ఇది ముమ్మాటికీ నిజం. స్వయంగా యజమానే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా స్కొడా కుషాక్ కారు వీల్ హబ్ వరకు నిలబడి ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో యజమాని షేర్ చేశారు. ఉదయాన్నే కారు స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్ట్ కాలేదని చెప్పారు. దీంతో ట్రక్కును పిలిపించి కారును లాగి డీలర్‌షిప్ వద్దకు తీసుకెళ్లారు. అయితే రిపేర్‌కి అయ్యే ఖర్చులు విని యజమాని ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
వరదలకు చెడిపోయిన స్కోడా కుషాక్ కారు రిపేర్(Skoda Kushaq SUV Repair)కు అయ్యే ఖర్చు ఎంత అని మెకానిక్‌ను అడగ్గా.. అతను అన్నీ చెక్ చేసి దాదాపు రూ. 16.5 లక్షలు అవుతుందని చెప్పినట్లు యజమాని వివరించారు. ఈ ఫొటోలో ఉన్న నీటి మట్టం కాస్త ఎక్కువగానే ఉందని యజమాని తెలిపారు. దీంతో ఆయన స్కోడా కుషాక్ కారు స్టార్ట్ కాలేదు.
ట్రక్కును ఉపయోగించి కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లగా.. ఇన్సూరెన్స్ ద్వారా స్కోడా కుషాక్ కారు క్లెయిమ్ చేసుకోవచ్చని యజమాని భావించారు. అయితే మెకానిక్ చెప్పిన విషయం విన్న తర్వాత ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఈ స్కోడా కుషాక్ కారు గేర్‌బాక్స్ పాడైందని, దానిని రిపేర్ చేయడానికి రూ. 16.50 లక్షలు ఖర్చవుతుందని డీలర్‌షిప్ తెలియజేసినట్లు కారు యజమాని వెల్లడించారు.
కాగా భారత మార్కెట్లో స్కోడా కుషాక్ ప్రారంభ ధర రూ. 11.89 లక్షలు ఉంది. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర రూ. 20.49 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. స్కోడా కుషాక్ ఎస్‌యూవీలు భారత మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందగా.. అమ్మకాలను రెట్టింపు చేసేందుకు 'స్కోడా ఆటో ఇండియా' మిడ్-శ్రేణి కుషాక్ యాంబిషన్ వేరియంట్‌లో శక్తివంతమైన '1.5 TSI' పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
స్కోడా కుషాక్ యాంబిషన్ ఎడిషన్ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ (1.5 TSI)తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 148 bhp శక్తిని మరియు 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








