భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

అనాది నుంచి భారతదేశంలో మహిళలు వాహనాలు నడపడం చాలా అరుదు, కానీ నేటి నవయుగ భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళలు వాహనాలు కూడా నడపడానికి వెనుకాడటం లేదు. నేడు విమానాల దగ్గర నుంచి, ట్రైన్లు వరకు దాదాపు అన్ని వాహనాలను అవలీలగా నడుపుతున్నారు.

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

కానీ ఈ విధమైన సాహసాలు చేస్తున్న మహిళలను కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు, అంటే చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారని దీని అర్థం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కలకత్తా రోడ్లపై కేవలం 22 సంవత్సరాల అమ్మాయి బస్సు నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

కలకత్తా రోడ్లపై బస్సు నడుపుతున్న ఈ 22 ఏళ్ల అమ్మాయి పేరు కల్పన మొండల్. కల్పన మొండల్ తండ్రికి వాహనాలను నడపడం చాలా ఇష్టం, ఇది కాస్త ఆ అమ్మాయికి వంటపట్టింది. ఆ ఇష్టంతోనే కల్పన మొండల్ తన 8 ఏట బస్సు డ్రైవ్ చేయడం నేర్చుకుంది.

MOST READ:గుడ్ న్యూస్.. ఇకపై వారు టోల్‌గేట్ చెల్లించకుండా ఉచితంగా వెళ్ళవచ్చు.. వారెవరనుకుంటున్నారా..!

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

కల్పన మొండల్ తండ్రి 2 సంవత్సరాల క్రితం ప్రమాదంలో చిక్కుకోవడం వల్ల వాహనాలను నడపలేకపోయాడు. ఈ సమయంలో కుటుంభం భారాన్ని మోయవలసిన బాధ్యత కల్పన మొండల్ మీద పడింది. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి జీవనాధారమైన బస్సు నడపడం ప్రారంభించింది. ప్రస్తుతం, కల్పన మొండల్ యొక్క ఆదాయమే వారి కుటుంబ అవసరాలను తీరుస్తుంది.

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

ఆమె తండ్రి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడే, కల్పన మొండల్ కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. కానీ చాలా మంది బస్సు ఓనర్లు ఈమెను నమ్మలేదు, కానీ ఒక బస్సు ఓనర్ మాత్రం కల్పన మొండల్ కి అవకాశం ఇచ్చాడు. కల్పన మొండల్ అతన్ని నమ్మకాన్ని ఏ మాత్రం ఒమ్ము చేయలేదు.

MOST READ:11 బోయింగ్ 767-300 జంబో జెట్లను కొనుగోలు చేసిన అమెజాన్.. కారణం ఇదే

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

కల్పన మొండల్ చేస్తున్న ఈ గొప్ప పనికి సంతోషిస్తూ తన తండ్రి సుభాష్ మండల్ మాట్లాడుతూ, కల్పన ఇప్పుడు ప్రతిరోజూ బస్సును నడిపి కుటుంభం భారాన్ని మోస్తోంది. ఇది నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె భవిష్యత్ నే కుటుంబంకోసం ధారబోస్తోంది.

భారతదేశంలో వాహనాలు నడపడానికి చాలా కష్టమైన నగరాలలో కలకత్తా ఒకటి. కల్పన మొండల్ అటువంటి నగరం యొక్క ఇరుకైన రోడ్లపై పెద్ద బస్సును నడుపుతుంది. కోల్‌కతా రోడ్లు రద్దీగా ఉంటాయనే విషయం అందరికి తెలుసు. ఇంత క్లిష్టమైన రోడ్లలో బస్సు నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

ఇలాంటి రోడ్లపై బస్సు నడుపుతున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అని కల్పన మొండల్ ని అడిగినపుడు, నేను ఈ కలకత్తా రోడ్లపై బస్సుని సులభంగా నడపగలను, దీనికి పోలీసులలో కూడా కొంతమంది తనని ప్రోత్సహిస్తున్నారని చెప్పింది.

భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

డ్రైవింగ్ అనేది ఇప్పటి వరకూ కూడా దాదాపు పురుషుల ఆధిపత్యంలోనే ఉంది. ఇలాంటి రంగంలో అతి చిన్న వయస్కురాలైన కల్పన మొండల్ మెరిసిపోతూ మంచి పేరు తెచ్చుకుంటోంది.కల్పన మొండల్ ఈకాలంలో యువతకు నిజంగా రోల్ మోడల్. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో ఇలాంటి పని చేయడం నిజంగా ఆశ్చర్యం, కుటుంభం కోసం చేస్తున్న ఈ పని అభినందనీయం.

MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

Source:Firstpost

Most Read Articles

English summary
Meet India’s Youngest Woman Bus Driver Kalpana Mondal. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X