ఓన్లీ ఫర్ గర్ల్స్.. ఈ బోట్‌లోకి బాయ్స్‌ని అనుమతించరు!

By Ravi

ఈ ఫొటోలలో కనిపిస్తున్న లగ్జరీ యాచ్‌ను చూడండి.. ఇది కేవలం అమ్మాయిల కోసం మాత్రమే డిజైన్ చేయబడినది, ఇందులో పురుషులకు ప్రవేశం లేదట. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ లిదియా బెర్సానీ ఈ యాచ్‌ను స్త్రీల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

తెలుపు, బంగారు వర్ణాలతో మెరిసిపోతున్న ఈ యాచ్ 262 అడుగుల పొడవు ఉంటుంది. క్రిస్టల్స్, గోల్డ్, ఫర్, ఆంక్సీ, జెమ్‌స్టోన్స్, ఫ్లవర్స్, గోల్డ్ కలర్ మొజాయిక్స్ ఈ యాచ్‌ని డిజైన్ చేశారు. దీనికి 'లా బెల్లె' (La Belle) అనే పేరును పెట్టారు. అంటే, అందం అని అర్థం.

మరి ఈ అమ్మాయిల బోట్‌లో ఏమేమి 'అందాలు' ఉన్నాయో ఓ లుక్కేసొద్దాం రండి..!

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

లగ్జరీ డిజైనర్ లిదియా బెర్సానీ కేవలం మహిళల కోసమే సృష్టించిన ఈ మొట్టమొదటి లగ్జరీ మెగా యాచ్ లా బెల్లె పొడవు 262 అడుగులు.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

అత్యంత విలాసవంతంగా ఉండేలా ఇంటీరియర్స్‌ని వైట్ అండ్ గోల్డ్ థీమ్‌లో డిజైన్ చేశారు. యాచ్ లోపల ఎక్కడ చూసినా బంగారు వర్ణంతో మెరిసిపోతూ కనిపిస్తుంది.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

లా బెల్లె యాచ్‌లో ఓ గుండ్రటి కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. దీనిపై ఏకంగా 12 మంది స్త్రీలు విశ్రాంతి తీసుకోవచ్చట.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

గోల్డ్ మొజాయిక్స్, ముత్యాలు, క్రిస్టల్స్, జెమ్‌స్టోన్స్, ఆంక్సీ అండ్ బెస్పోక్ ఉడెన్ ఫర్నిచర్‌తో ఇంటీరియర్లను విలాసవంతంగా తీర్చిదిద్దారు.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

లా బెల్లె లగ్జరీ యాచ్‌లో మొత్తం ఆరు డీలక్స్ క్యాబిన్లు ఉంటాయి. వీటిలో మొత్తం 12 మంది అతిథులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

లా బెల్లె లగ్జరీ యాచ్‌లో మొత్తం ఐదు డెక్‌లు (అంతస్థులు) ఉంటాయి. ఒక్కో డెక్‌లో ఒక్కో విశిష్టత ఉంటుంది.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

మాస్టర్ క్యాబిన్ రెండవ డెక్‌లో ఉంటుంది. ఇందులోనే రౌండ్ కింగ్ సైజ్ బెడ్, ప్రైవేట్ టెర్రాస్, థిక్ కర్టెన్స్, గోల్డ్ టచప్ ఉంటుంది.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

ఇంకా.. డార్ట్ బోర్డులు, కంప్యూటర్ గేమ్స్ స్థానంలో హైడ్రోమసాజ్ పూల్, స్పా, స్నో రూమ్, ఐస్ ఫౌంటైన్స్, లైబ్రరీ, బ్యూటీ సెంటర్, డిస్కో క్లబ్, సినిమా థియేటర్, బార్స్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

ఇందులో డెక్స్ మారడం కోసం లిఫ్ట్ కూడా ఉంటుంది. అలాగే, యాచ్ పైభాగంలో ల్యాండింగ్ ప్యాడ్‌పై గోల్డ్ కలర్‌లో డిజైన్ చేసిన హెలికాఫ్టర్ కూడా ఉంటుంది.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

ప్రతి డెక్ వద్ద కూడా విశ్రాంతి కోసం బయటి వైపు రిలాక్సింగ్ ఏరియా ఉంటుంది. సన్ బాతింగ్ సౌకర్యం కూడా ఉంది.

లా బెల్లె యాచ్: ఓన్లీ ఫర్ గర్ల్స్

ఈ లగ్జరీ యాచ్ ధరను ఇంకా నిర్ణయించలేదని, ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ దశలో ఉందని లిదియా బర్సానీ తెలిపారు.

Article Published On: Monday, February 9, 2015, 9:08 [IST]
English summary
Monaco-based luxury designer Lidia Bersani unveils design for superyacht La Belle which is targeted at millionaire women. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+