మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్: అందరి కార్లు ఒక ఎత్తయితే, పవర్ స్టార్ కార్లు మరో ఎత్తు

తెలుగు పాఠకుల కోసం మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మరియు జనసేన అధినేత "పవన్ కళ్యాణ్" కార్ కలెక్షన్ గురించిన ప్రత్యేక కథనం...

By N Kumar

తెలుగు చిత్రమ సీమలో అతి పెద్ద విలక్షన నటుడిగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దేశవ్యాప్తంగా అమితాబ్ బచ్చన్ ఎంత ఖ్యాతి గడించారో చిరంజీవి కూడా నటనలో అంత ప్రసిద్ది చెందారు.

నటన పరంగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నందమూరి తారకరామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు పెద్ద కుటుంబాలను అందించారు. విభిన్న నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వీరి సరసన ఇప్పుడు చిరంజీవి గారు కూడా చేరిపోయారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు తెలుగు పాఠకుల కోసం మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ మరియు జనసేన అధినేత "పవన్ కళ్యాణ్" కార్ కలెక్షన్ గురించిన ప్రత్యేక కథనం...

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొణిదెల శివ వర ప్రసాద్ "పునాది రాళ్లు" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుమారుగా మూడు తరాల ప్రేక్షకులను అలరించిన చిరంజీవి గారు తమ కుటుంబం నుండి ఎంతో మంది నటీనటులను, దర్శకులను, నిర్మాతలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.

Recommended Video

[Telugu] BMW 330i Gran Turismo Launched In India - DriveSpark
మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

150కి పైగా చిత్రాల్లో నిటించి మూడు తరాల అభిమానుల హృదయాలను చిరంజీవి గారు దోచుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'స్వయం కృషి'తో ఎదిగిన చిరంజీవి గారు తెలుగు ప్రజల జీవన శైలి, ఆర్థిక మరియు సామజిక దృకథ్ప నేపథ్యం ఉన్న చిత్రాలలో నటించి ఎంత మందిలో స్పూర్తి నింపారు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

తరువాత, ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో కొన్ని సంవత్సరాలు సినిమా రంగానికి శాస్వతంగా దూరమయ్యి, కేంద్ర మంత్రిగా సేవ చేశాడు. అయితే, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెం. 150 చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

చిరంజీవి భార్య సురేఖ గారి ప్రోద్బలంతో పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించి యువతను ఆకట్టుకునే ఎన్నో ట్రెండింగ్ సినిమాల్లో నటించిన పవన్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా తెలుగుతో పాటు దక్షిణ భారత యువ సినీ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

సినిమాలే జీవితం కాకుండా ప్రజా సేవ కోసం రాజకీయ అరంగేట్రం చేసి జనసేన పార్టీని స్థాపించారు. తెలుగు సినిమా పరిశ్రమలో మరే ఇతర సెలబ్రిటీలతో పోల్చుకున్నా పవన్ కళ్యాణ్ జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది.

చిరంజీవి కార్ కలెక్షన్:

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

రోల్స్‌రాయిస్ ఫాంటమ్

నటన పరంగా కాకుండా అమితా‌బ్‌తో చిరజీవిగారు మ్యాచ్ అయ్యే అంశం రోల్స్ రాయిస్. అత్యంత ఖరీదైన మరియు అరుదైన రోల్స్ రాయిస్ చిరంజీవి గారి గురించి అమితాబ్ మరియు చిరంజీవి ఇద్దరి వద్ద ఉంది. దీని ధర సుమారుగా ఎనిమిది కోట్ల రుపాయలుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

విలాసవంతమైన పవర్ ఫుల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారును చిరంజీవికి ఆయన 53వ పుట్టిన రోజు సందర్భంగా తన తనయుడు రామ్ చరణ్ తేజ్ బహుకరించాడు. ఇతర కార్లలా కాకుండా తన అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎన్నో మోడిఫికేషన్స్ చేయించుకున్నాడు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

సాంకేతికంగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6.8-లీటర్ కెపాసిటి గల వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 460బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

టయోటా ల్యాండ్ క్రూయిజర్

చిరంజీవి వద్ద రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో టయోటా ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేయక ముందే ఒక వెహికల్‌ను దిగుమతి చేసుకోగా, మరో వెహికల్‌ను తన 59వ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ చిరంజీవికి బహుకరించాడు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

భద్రత పరంగా మంచి పేరుతెచ్చుకున్న ల్యాండ్ క్రూయిజర్ ఎంతో మంది ఇండియన్ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల కార్ల జాబితాలే స్థానం సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లోకి టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 1.2 కోట్లుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

అధునాతన భద్రత ఫీచర్లు మరియు అత్యుత్తమ నిర్మాణ నాణ్యత గల ల్యాండ్ క్రూయిజర్‌లో టయోటా కిర్లోస్కర్ 1.5-లీటర్ కెపాసిటి గల వి8 టుర్బో డీజల్ ఇంజన్ అందించింది. ఈ శక్తివంతమైన డీజల్ యూనిట్ గరిష్టంగా 262బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

ఆ డ్రైవర్ నెలసరి వేతనం 2 లక్షల రుపాయలు!!

కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసిన బైకుల లిస్ట్!!

30కిమీల మైలేజ్‌తో నెక్ట్స్ జెనరేషన్ మారుతి ఆల్టో

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ వోగ్

చిరంజీవి ఖరీదైన కార్ల కలెక్షన్‌లో మునుపటి తరానికి చెందిన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ కలదు. ప్రస్తుతం ఉన్న వోగ్'తో పోల్చుకుంటే అత్యంత శక్తివంతమైన ఇంజన్, సురక్షితమైన తేలికపాటి క్యాబిన్ మరియు ఎన్నో ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. అప్పట్లోనే దీని ధర కోటి రుపాయలుగా ఉండేది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని 3.0-లీటర్ డీజల్ ఇంజన్ 254బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 335బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రామ్ చరణ్ తేజ్ కార్ కలెక్షన్:

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వి8

మెగా పవర్ స్టార్‌గా రాణిస్తున్న రామ్ చరణ్ తేజ పెళ్లికి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వి8 కారును కానుకగా పొందాడు. బ్రిటన్‌కు చెందిన ఈ స్పోర్ట్స్ కారు ధర రూ. 1.86 కోట్లుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

ఇంగ్లాండులోని ఆస్టన్ మార్టిన్ ప్రొడక్షన్ ప్లాంటును దిగుమతి చేసుకున్న వాంటేజ్ వి8 స్పోర్ట్స్ కారులో 4.8-లీటర్ కెపాసిటి గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 313బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ

ఇండియాలో రేంజ్ రోవర్ విక్రయిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీలలో ఆటోబయోగ్రఫీ మోడల్ అత్యంత ఖరీదైనది. మరియు రామ్ చరణ్ ఎక్కువగా వెహికల్‌నే ఉపయోగిస్తుంటాడు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ. 2.7 కోట్లుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

టాప్ ఎండ్ వేరియంట్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీలో 5-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 499బిహెచ్‌పి పవర్ మరియు 625ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోబయోగ్రఫీ లోని ప్రారంభ వేరియంట్లు 3-లీటర్ వి6 మరియు 4.4-లీటర్ వి8 డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్ కలెక్షన్:

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ లైనప్‌లో ఉన్న రెట్రో స్టైల్ మోడల్ ఎస్‌యూవీ జి63 ఏఎమ్‌జి. ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా బొలెరో మరియు థార్ డిజైన్ అంశాలతో మిశ్రమంగా నిర్మించినట్లు ఉంటుంది ఈ మోడల్. అయితే, ఇందులో శక్తివంతమైన మరియు వివేకవంతమైన 5.5-లీటర్ ఇంజన్ కలదు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

మెర్సిడెస్ జి63 ఏఎమ్‌జి ఎస్‌యూవీలోని 5.5-లీటర్ వి8 టుర్బో ఛార్జడ్‌ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 536బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి జి-క్లాస్ ఎస్‌యూవీల ప్రొడక్షన్ నిలిచిపోయింది. అయితే, అతి త్వరలో నూతన మోడల్‌ను మెర్సిడెస్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ మోడల్ ధర రూ. 1.96 కోట్లుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్

సాధారణ వ్యక్తులకు టయోటా ఇన్నోవా ఎలాంటిదో, ధనవంతులకు మరియు సినీ సెలబ్రిటీలకు మెర్సిడెస్ ఆర్-క్లాస్ అలాంటిది. జర్మన్ దిగ్జం మెర్సిడెస్ వారి అసలైన మరియు ఏకైక లగ్జరీ ఎమ్‌పీవీ ఆర్-క్లాస్. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఒక మెర్సిడెస్ ఆర్-క్లాస్ ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

మెర్సిడెస్ ఆర్-క్లాస్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో లభించును. ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ సామర్థ్యం గల ఆర్-క్లాస్‌లో పెట్రోల్ వేరియంట్‌ను పవర్ స్టార్ ఎంచుకున్నాడు. దీని ధర రూ. 72 లక్షలుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

ఆడి క్యూ7

ఇప్పుడు ఇండియా మోస్ట్ పాపులర్ మరియు లగ్జరీ ఎస్‌యూవీగా ఆడి క్యూ7 చెలామణీ అవుతోంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది సెలబ్రిటీల మదిలో డ్రీమ్ కారుగా స్థానం సంపాదించుకుంది. ఆడి క్యూ7 ఓనర్ల జాబితాలో పవర్ స్టార్ కూడా ఉన్నారు.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించే ఆడి క్యూ7 ఎస్‌యూవీలో కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే కలదు. ఆడి క్యూ7 గరిష్ట ఎక్స్-షోరూమ్ ధర రూ. 80 లక్షలుగా ఉంది.

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్

కార్ల రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే చిరజీవికి 1111 నెంబర్ సెంటిమెంట్‌గా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి సెంటిమెంట్లు ఏవీ ఉండవు. సాధారణంగా వచ్చే రిజిస్ట్రేషన్ నెంబరునే ఎంచుకుంటారు.

ఏదేమయినప్పటీ, ఈ ఇద్దరు అన్నదమ్ముల కార్ల అభిరుచి చాలా విభిన్నంగా ఉంటుంది. వీరిద్దరి కార్ల ఎంపిక వీరి జీవన శైలికి అనుగుణంగానే ఉందని చెప్పడానికి ప్రస్తుతం వారి వద్ద ఉన్న కార్లే నిదర్శనం.

Most Read Articles

English summary
Read In Telugu: Mega Family Car Collection. Chiranjeevi, Pavan Kalyan and Ramcharan tej
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X